Breaking News

TRANSFER

కౌన్సెలింగ్ భౌతికంగా నిర్వహించాలి

కౌన్సెలింగ్ భౌతికంగా నిర్వహించాలి

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియను భౌతికంగా నిర్వహించాలని జిల్లా ఉపాధ్యాయ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్టో) నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు  మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా బదిలీల ప్రక్రియ నిర్వహించాలన్నారు. అనంతరం   జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.  కార్యక్రమంలో నాయకులు పర్వతరెడ్డి, మురళి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Read More

సూర్యాపేట ఆర్డీవో బదిలీ

సారథి న్యూస్​, సూర్యాపేట : సూర్యాపేట ఆర్డీవో ఎస్. మోహన్ రావు బదిలీ అయ్యారు. మూడు సంవత్సరాలుగా సూర్యాపేట ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న ఆయన అకస్మాత్తుగా బదిలీ కావడం కొంత చర్చానీయాంశమైంది. ఆయన వెయిటింగ్ పోస్టులో ఉన్నప్పటికీ సూర్యాపేట నూతన ఆర్డీవో గా కే.రాజేంద్ర కుమార్ ను నియామిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Read More
లేడీ సింగం

లేడీ సింగం

ఆమె ఓ సాధారణ లేడీ కానిస్టేబుల్​. కానీ ఏకంగా మంత్రి కొడుకుకే చుక్కలు చూపించింది. నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి సుపుత్రుడికి నడి రోడ్డుమీదే వార్నింగ్​ ఇచ్చింది. ‘నేను నీకు నీ బాబుకు సర్వేంట్​ను కాను’ అంటూ హెచ్చరించింది. ఇటీవల గుజరాత్​లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మహిళా కానిస్టేబుల్​కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అయింది. ఇక ఆ కానిస్టేబుల్​ తెగువను మెచ్చుకోని వారంటూ లేరు. అయితే యధావిధిగా పోలీస్​శాఖ […]

Read More
ఏకపక్షంగా బదిలీలు చేసిన్రు

ఏకపక్షంగా బదిలీలు చేసిన్రు

సారథి న్యూస్, ఖమ్మం: ఎలాంటి కౌన్సిలింగ్ లేకుండా జిల్లాలో వీఆర్వోలను ఏకపక్షంగా బదిలీలు చేశారని, ఈ విషయం గురించి వినతి ఇవ్వడానికి వెళ్తే ఖమ్మం కలెక్టర్ ​అపాయింట్​మెంట్​ ఇవ్వడం లేదని వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికే ఉపేందర్ రావు మంగళవారం ఎంపీ నామా నాగేశ్వరావుకు ఆన్​లైన్​లో వినతిపత్రం పంపించారు. ప్రశాంత వాతావరణంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ధరణి ద్వారా కొత్త పట్టాబుక్కులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ, ఎన్నికల నిర్వహణ, […]

Read More
ఏపీలో ఐఏఎస్‌ల బదిలీ

ఏపీలో ఐఏఎస్‌ల బదిలీ

సారథి న్యూస్, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సహాని ఉత్తర్వులు జారీచేశారు. ఎవరు.. ఎక్కడికి..? బీసీ వెల్ఫేర్ స్పెషల్ సీఎస్‌గా కె.ప్రవీణ్ కుమార్ రజత్ భార్గవ్‌కు అదనంగా పర్యాటకం, సాంస్కృతిక శాఖలు క్రీడలు, యువజనసంక్షేమం ప్రిన్సిపల్ సెక్రటరీగా కె. రామ్‌గోపాల్ ఎస్టీ వెల్ఫేర్ గిరిజనసంక్షేమం సెక్రటరీగా కాంతిలాల్ దండే సర్వే, లాండ్ సెటిల్‌మెంట్స్ డైరెక్టర్‌గా సిద్ధార్థజైన్‌కు అదనపు బాధ్యతలు మత్స్యశాఖ కమిషనర్‌గా […]

Read More