Breaking News

TESTS

నల్లగొండ జిల్లాలో 25 కొత్తకేసులు

సారథిన్యూస్​, నల్లగొండ: కరోనా మహమ్మారి జీహెచ్​ఎంసీతోపాటు జిల్లాలను వణికిస్తున్నది.తాజాగా నల్లగొండ జిల్లాలో 25 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవల కరోనా సోకిన వారి ప్రైమరీ కాంటాక్ట్​ల శాంపిల్లు సేకరించగా 25 కొత్తకేసులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్​ మండలాల్లో అత్యధిక కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. పాజిటివ్​ వచ్చనవారిలో పోలీస్​, వైద్యసిబ్బంది ఉన్నట్టు సమాచారం.

Read More

దక్షిణాఫ్రికా జట్టులో ఏడుగురికి కరోనా

జోహన్స్​బర్గ్​: దక్షిణాఫ్రికా క్రికెట్​ టీమ్​కు కరోనా భయం పట్టుకున్నది. తాము నిర్వహించిన మాస్ట్ పరీక్షల్లో ఏడుగురికి కరోనా ఉన్నట్టు తేలడందో బోర్డు ఆందోళనలో పడింది. నాన్ కాంటాక్ట్ క్రీడలను మొదలుపెట్టేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. బోర్డు తమ ఆటగాళ్లను ఒక చోటికి చేర్చింది. కొంత మంది కాంట్రాక్ట్ ప్లేయర్లు, ఫ్రాంచైజీ ఆటగాళ్లతో కలిపి మొత్తం 100 మంది కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో ఏడుగురు వైరస్ బారిన పడినట్టు తెలిసింది. అయితే ఈ ఏడు మందిలో […]

Read More

కరోనా కట్టడిలో టీఆర్​ఎస్​ విఫలం

సారథి న్యూస్, హుస్నాబాద్: కరోనా మహమ్మారిని అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు ఆరోపించారు. సోమవారం కరీంనగర్​ జిల్లా అక్కన్నపేటలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్​ఎస్​ ప్రభుత్వం కరోనా టెస్టులు చేయడం లేదని ఆరోపించారు. అనంతరం అక్కన్నపేట వైద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు సంపత్ కుమార్, కార్తీక్, కృష్ణ, వంశీ, రాహుల్, కల్యాణ్​, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

Read More

కరోనా టెస్టులు పెంచండి

సారథి న్యూస్, రామాయంపేట/రామడుగు: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని భారతీయ జనతాపార్టీ డిమాండ్​ చేసింది. కరోనా వార్డుల్లో పనిచేసే సిబ్బందికి, డాక్టర్లకు పీపీఈ కిట్లు ఇవ్వాలని కోరింది. మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ దవాఖాన ఎదుట, కరీంనగర్​ జిల్లా రామడగులోనూ బీజేపీ నేతలు సోమవారం ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆయుష్మాన్​ భారత్​ స్కీమ్​లో చేర్చాలని డిమాండ్​ చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు. కార్యక్రమంలో రామడుగు బీజేపీ మండల అధ్యక్షుడు ఒంటెల కర్ణాకర్ రెడ్డి, రామయంపేట […]

Read More

కరోనాపై నిర్లక్ష్యం తగదు

సారథిన్యూస్​, మహబూబాబాద్​: ప్రైవేట్​ ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలను ఉచితంగా చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య డిమాండ్​ చేశారు. అవసరమైతే ప్రైవేట్​ ఆస్పత్రులను ప్రభుత్వమే తన ఆధీనంలోకి తీసుకోవాలని సూచించారు. కరోనా టెస్టుల విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు. కరోనా టెస్టుల్లో ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం ఆయన మహబూబాబాద్​లోని పెరుమాండ్ల భవన్​లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంటింటికి కరోనా టెస్టులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. […]

Read More