Breaking News

TELANGANA

అపెక్స్​ మీటింగ్​ వాయిదా

సారథిమీడియా, హైదరాబాద్​: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలను పరిష్కరించేందుకు ఈ నెల 25 న ఏర్పాటు చేయాలనుకున్న అపెక్స్​ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాలకు లేఖలు పంపింది. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన […]

Read More
తెలంగాణలో 2,384 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో 2,384 పాజిటివ్‌ కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం(గత 24 గంటల్లో) కొత్తగా 2,384 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా 11 మృతిచెందారు. ఇలా ఇప్పటివరకు మహమ్మారి బారినపడి 755 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 1,04,249కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 80,586 మంది కోలుకోగా.. 22,908 మందికి చికిత్స పొందుతున్నారు. శనివారం ఒక్కరోజే 40,666 కరోనా నిర్ధారణ వైద్యపరీక్షలు చేశారు. ఇక అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో […]

Read More
మీరైనా జోక్యం చేసుకోండి

మీరైనా జోక్యం చేసుకోండి

పాలనలో తప్పులు ఎత్తిచూపే వారిని వేధిస్తున్నారు పవర్​హౌస్ ​ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలి గవర్నర్‌ తమిళిసై సౌందర్​రాజన్​కు రేవంత్ రెడ్డి లేఖ హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ ప్రభుత్వం రాజ్యాంగ, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందర్​రాజన్ కు శనివారం లేఖ రాశారు. ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రజలకు గవర్నర్ హోదాలో మీరు ఇటీవల స్పందించిన తీరు కొంత ఊరట కలిగించిందన్నారు. లేఖలోని ముఖ్యాంశాలు.. ‘రాష్ట్రంలో రాజ్యాంగ, పౌర, […]

Read More

బాలిక ఆత్మహత్య

సారథి న్యూస్, రామగుండం: బాలిక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్​స్టేషన్​ పరిధిలోని కృష్ణానగర్​లో శనివారం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Read More
వినాయకుడికి సీఎం కేసీఆర్​విశేషపూజ

వినాయకుడికి సీఎం కేసీఆర్ ​విశేషపూజలు

సారథి న్యూస్, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్ రావు శనివారం వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్​లోని ప్రగతి భవన్ లో కుటుంబ సమేతంగా వినాయకుడికి పూజచేశారు. మంత్రి కె.తారక రామారావు సతీమణి శైలిమా, కుమారులు, కుమార్తె, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ కుటుంబ సభ్యులు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్​పల్లి వినోద్ కుమార్, తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Read More
‘సెట్స్’ తేదీలు ఖరారు

‘సెట్స్’ తేదీలు ఖరారు

హైదరాబాద్‌: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా చాలా ఎంట్రెన్స్​ఎగ్జామ్స్​వాయిదాపడిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ మేరకు ఎగ్జామ్స్​షెడ్యూల్‌ను వెలువరించింది. ఈనెల 31న టీఎస్‌ ఈసెట్‌, సెప్టెంబర్​9 నుంచి 14 వరకు ఎంసెట్‌, సెప్టెంబర్​21 నుంచి 24వరకు పీజీఈసెట్‌ ను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Read More

తెలంగాణలో కొత్త నౌకర్లు

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇది నిజంగా శుభవార్తే. రాష్ట్రప్రభుత్వం త్వరలోనే కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. పురపాలకశాఖలో వార్డు ఆఫీసర్లు అనే కొత్తపోస్టును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​ ప్రగతిభవన్​లో తన శాఖ అధికారులతో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్లను నియమించనున్నట్టు కేటీఆర్​ తెలిపారు. వార్డు ఆఫీసర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. […]

Read More

అడుగు అడుగుకో మడుగు

సారథిన్యూస్, రామడుగు: మీరు చూస్తున్న ఈ ఫోటో ఎక్కడో మారుమూల గ్రామంలోనిది కాదు.. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ఓ రోడ్డు. రామడుగు వరద కాల్వ నుంచి చిప్పకుర్తి పోయే రోడ్డు పూర్తిగా దెబ్బతిని కంకర తెలి గుంతలు పడి నీరు నిలిచింది. దీంతో వాహన రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. కాలి నడకన వెళ్లే వారుసైతం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు అద్వాన్నంగా మారడంతో రోగులు, గర్భిణి లు అవస్థలు పడుతున్నారు. గతంలో వరద కాల్వ నిర్మాణ […]

Read More