న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్లో అత్యంత మెరుగైన ఫిట్నెస్ కలిగిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన ఫిట్నెస్ను కాపాడుకోవడానికి చేసే కసరత్తులు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. కరోనా లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన విరాట్.. కసరత్తులు మాత్రం మానలేదు. అతను చేసే కొత్త రకం ఎక్సర్సైజ్లకు సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటాడు. తాజాగా అతను పోస్ట్ చేసిన ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఎగురుతూ పుష్ అప్స్ చేసే క్రమంలో నేలను తాకక ముందే […]
న్యూఢిల్లీ: లాక్ డౌన్‌తో ఇంకా ఔట్‌డోర్ ప్రాక్టీస్ మొదలుపెట్టని టీమిండియా ఫిట్నెస్ కాపాడుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తోంది. కొంత మంది ఇంట్లో ఉన్న పెరట్లో ప్రాక్టీస్ చేస్తుంటే.. పేసర్ మహ్మద్ షమీ మాత్రం కాస్త భిన్నంగా ప్రయత్నించాడు. తన వేగాన్ని పెంచుకోవడం కోసం పెంపుడు శునకంతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఈ పరుగులో శునకం కంటే షమీని ఎక్కువగా పరుగెత్తినట్లు కనిపించింది.
న్యూఢిల్లీ: భారత్ జట్టుకు మళ్లీ ప్రాతినిథ్యం వహించాలన్నది తన కల అని పేసర్ శ్రీశాంత్ అన్నాడు. ఇందుకోసం ఎంతవరకైనా శ్రమిస్తానన్నాడు. ‘2023 ప్రపంచకప్‌లో ఆడతాననే నమ్మకం ఉంది. అంతేకాదు నేను ఎక్కడైతే శిక్షకు గురయ్యానో.. అదే ఐపీఎల్లో మళ్లీ సత్తా చాటుతా. ఈ విషయాన్ని బలంగా విశ్వసిస్తున్నా. నేను పునరాగమనం చేస్తున్నది కేవలం రంజీల కోసం కాదు. టీమిండియా, ఐపీఎల్‌కు ఆడటం నా ప్రధాన లక్ష్యం. జట్టుకు విజయాలు అందించాలనే కసి, పట్లుదల నాలో ఇంకా చావలేదు. […]
న్యూఢిల్లీ: సిరీస్‌కు ముందు జరిపే కరోనా పరీక్షల్లో నెగెటివ్ వస్తే.. వాళ్లు ఉమ్మిని ఉపయోగించేందుకు అవకాశం ఇవ్వాలని టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగర్కార్ కోరాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మిపై నిషేధం మంచిదే అయినా.. రాబోయే రోజుల్లో బౌలర్లు బాగా ఇబ్బందిపడాల్సి వస్తుందన్నాడు. ‘బ్యాట్స్‌మెన్‌కు బ్యాట్ ఎంత ముఖ్యమో.. బౌలర్లకు ఉమ్మి కూడా అంతే. మ్యాచ్‌కు ముందే ప్లేయర్లకు కరోనా టెస్టులు నిర్వహిస్తారు. అందులో నెగెటివ్ వస్తే వాళ్లు సురక్షితమేనని భావిస్తారు. అలాంటి వాళ్లకు ఉమ్మిని ఉపయోగించే […]
న్యూఢిల్లీ: భారత జట్టుకు కోచ్‌గా ఎంపికవడానికి తనకు ఏడు నిమిషాల సమయం పట్టిందని దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ గ్యారీ కిర్‌స్టెన్ వెల్లడించాడు. తనకు ఆసక్తి లేకపోయినా.. కనీసం దరఖాస్తు చేయకపోయినా ఆ పదవి తనకు దక్కిందన్నాడు. దీనికంతటికి కారణం అప్పటి సెలెక్షన్ కమిటీ మెంబర్, దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ అని స్పష్టం చేశాడు. ‘2007లో గ్రెగ్ చాపెల్ వారసుడి కోసం బీసీసీఐ అన్వేషిస్తోంది. ఆ సమయంలోనే నాకు టీమిండియాకు కోచింగ్ ఇచ్చే ఆసక్తి ఉందా? సన్నీ […]
న్యూఢిల్లీ: నాకౌట్ మ్యాచ్‌ల్లో ఎదురయ్యే ఒత్తిడిని టీమిండియా క్రికెటర్లు తట్టుకోలేరని మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. మెగా ఈవెంట్లలో సెమీస్, ఫైనల్ మ్యాచ్‌ల్లో కోహ్లీసేన ఆటతీరు చూస్తే ఇది అర్థమవుతుందన్నాడు. ఈ విషయంలో మెరుగుపడనంత వరకు ప్రపంచ చాంపియన్లు కాలేరన్నాడు. ‘నాకౌట్ మ్యాచ్‌ల్లో మన ఆట బాగాలేదు. గత కొన్ని టోర్నీల్లో దీనిని చూశాం. ఈ మ్యాచ్‌ల్లో మనం ఎలా ఆడతామనే దానిని బట్టే మంచి, అద్భుతమైన ప్లేయరా అనేది తెలుస్తుంది. ఇతర జట్లలాగా మనం […]
న్యూఢిల్లీ: మహిళల క్రికెట్‌కు ప్రజాదరణ పెంచాలన్నా.. ఎక్కువ మంది ఇందులోకి రావాలన్నా ఆటలో కొన్ని మార్పులు చేయాలని టీమిండియా ప్లేయర్ జెమీమా రొడ్రిగ్స్ సూచించింది. ఇందులో భాగంగా పిచ్ సైజ్‌ను కొద్దిగా తగ్గిస్తే ఫలితాలు మరోలా ఉంటాయని అభిప్రాయపడింది. ‘ఇప్పుడున్న దానికంటే పిచ్ సైజ్‌ను కాస్త తగ్గించాలి. దీనివల్ల ఫలితాలు భిన్నంగా వస్తాయి. ఆటలో మజా కూడా పెరుగుతుంది. ఎక్కువ మంది ఆటను చూస్తారు. ఆడేందుకు ఆసక్తి కనబరుస్తారు. అందుకే ఓసారి ప్రయత్నించి చూడాలి’ అని ఐసీసీ […]
ముంబై: బంతిని రంగును మెరుగుపర్చేందుకు ఉమ్మిన వాడకపోవడం.. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై పెద్దగా ప్రభావం చూపదని టీమిండియా పేసర్ దీపక్ చహర్ అన్నాడు. టీ20 ఫార్మాట్‌లో ఇది పెద్దగా అవసరం పడదని చెప్పాడు. టెస్ట్ క్రికెట్‌కు వచ్చేసరికి పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయన్నాడు. ‘వన్డే ఫార్మాట్‌లో తెల్ల బంతి రెండు ఓవర్లు మాత్రమే స్వింగ్ అవుతుంది. టీ20లకు వస్తే పిచ్ రెండు, మూడు ఓవర్లు మాత్రమే బాగుంటుంది. దీనివల్ల మూడు ఓవర్లు బంతి బాగా స్వింగ్ అవుతుంది. […]