Breaking News

TAMILNADU

కార్తీ చిదంబరానికి కరోనా

కార్తీ చిదంబరానికి కరోనా

చెన్నై: కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తీ చిదంబరానికి కరోనా ప్రబలింది. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్​ చేశారు. ఇటీవల ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నారు. దీంతో ఆయనకు కరోనా నిర్ధారణ అయ్యింది. కాగా ఇటీవల కార్తీ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తనను ఇటీవల కలిసిన వారంతా క్వారంటైన్​లో ఉండాలని, వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు కార్తీ చిదంబరం కుటుంబసభ్యులంతా పరీక్షలు చేయించుకున్నారు.

Read More
తమిళనాడు గవర్నర్​కు కరోనా

తమిళనాడు గవర్నర్‌కు కరోనా

చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్‌ విలయ తాండవం చేస్తున్నది. తాజాగా ఆ రాష్ట్ర గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌కు కరోనా సోకింది. దీంతో ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం గవర్నర్‌ భన్వరిలాల్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇటీవల గవర్నర్​ను కలిసిన వారంతా హోం క్వారంటైన్​కు వెళ్లారు.

Read More
తమిళనాడు రాజ్​భవన్​లో 84 మందికి కరోనా

రాజ్​భవన్​లో 84 మంది కరోనా

చెన్నై: తమిళనాడు గవర్నర్​ అధికారిక నివాసం రాజ్​భవన్​లో పనిచేస్తున్న 84 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. మొత్తం 147 మందికి పరీక్షలు చేయగా 84 మందికి కరోనా సోకడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొన్నది. వీరంతా రాజ్​భవన్ పరిసరాల్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ 84 మందిలో ఏ ఒక్కరూ కూడా ఇటీవల గవర్నర్​ బన్వర్​లాల్​ పురోహిత్​ను కాంటాక్ట్​ కాలేదని అక్కడి అధికారులు తెలిపారు.

Read More

గోల్డ్​మాస్క్​​ ధర ఎంతంటే

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు చెందిన ఓ స్వర్ణకారుడు వినూత్నంగా ఆలోచించి బంగారం, వెండితో మాస్కును తయారుచేశాడు. బంగారుమాస్కును 2.75 లక్షలకు, వెండి మాస్కును రూ.15,000 లకు విక్రయిస్తున్నట్టు ఆ స్వర్ణకారుడు తెలిపారు. ఇప్పటికే వీటికి 9 ఆర్డర్లు వచ్చాయని చెప్పారు. ధనవంతులు తమ హోదాకు చిహ్నంగా ఓ మాస్కులను కొనుగోలు చేస్తున్నారని ఆయన చెప్పారు.

Read More
తమిళనాడులో బీజేపీ కొత్త ఎత్తులు

తమిళనాడులో బీజేపీ కొత్తఎత్తులు

చెన్నై: త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ కొత్త ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగానే గంధపు చెక్కల స్మగ్లర్​ వీరప్పన్​ కూతురు విద్యావీరప్పన్​కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు యువమోర్చా విభాగం ఉపాధ్యక్షురాలిగా ఆదివారం ఆమెను నియమించింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆమె గత ఫిబ్రవరిలో బీజేపీలో చేరారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో వీరప్పన్ వర్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని […]

Read More
షార్ట్ న్యూస్

భయపెట్టిన భారీ తాచు

కోయంబత్తూరు: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు సమీపంలోని ఓ గ్రామంలోకి 15 అడుగుల భారీ తాచుపాము వచ్చింది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామంలోని కొందరు యువకులు ఆ పామును చంపేందుకు యత్నించగా వారికి చిక్కలేదు. దీంతో అటవీఅధికారులను సమాచారమిచ్చారు. అధికారులు గ్రామానికి చేరుకొని ఆ పామును సజీవంగా బంధించారు. అనంతరం సమీపంలోని సిరువాని అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్​ అవుతున్నది.

Read More

తమిళనాడులో మరోసారి లాక్​డౌన్​

సారథిన్యూస్​, హైదరాబాద్:​ రోజురోజుకు కరోనా విజృంభిస్తుండటంతో మరోసారి సంపూర్ణ లాక్​డౌన్​ విధించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్​పట్టు జిల్లాల్లో ఈ నెల 19 నుంచి 39 వరకు సంపూర్ణ లాక్​డౌన్​ విధించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ సిబ్బందే.. ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లతోసహా అన్ని దుకాణాలు మూతపడనున్నాయి. హోటళ్లనుంచి పార్శిల్​ను మాత్రం […]

Read More
బస్సులకు అనుమతి లేదు

బస్సులకు అనుమతి లేదు

తమిళనాడు సర్కార్‌‌ నిర్ణయం చెన్నై: లాక్‌డౌన్‌ 5కు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ రిలీజ్‌ చేసింది. రాష్ట్రంలో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నట్లు సీఎం పళనిస్వామి ఆదివారం ప్రకటించారు. జూన్‌ 8 తర్వాత పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌, రెస్టారెంట్లను తెరిచేందుకు పర్మిషన్‌ ఇచ్చారు. చెన్నై, తిరువెళ్లూరు, చెంగళ్‌పట్టు, కాంచీపురం జిల్లాల్లో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు అనుమతి లేదని, రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో 50శాతం బస్సులు తిరుగుతాయని చెప్పారు.దేవాలయాలు, మెట్రో, ఇంటర్‌‌ స్టేట్‌ బస్‌ ట్రాన్స్‌పోర్ట్‌, సబ్‌ అర్బన్‌ ట్రైన్స్‌పై […]

Read More