సెంట్రల్ విస్టా పనులు కొనసాగడంపై ఆగ్రహం ప్రభుత్వాన్ని వివరణ కోరుతామన్న చీఫ్ జస్టిస్ రమణ న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో భవన నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధించినప్పటికీ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులు కొనసాగుతుండటంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరుతామని తెలిపింది. తాజాగా గాలి కాలుష్యం స్థాయి 419 అని, ఇది రోజు రోజుకూ పెరుగుతోందని తెలిపింది. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా భారత […]
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రమణ హితవు న్యూఢిల్లీ: చర్చకు అవకాశం కల్పించడం రాజ్యాంగ ముఖ్య లక్షణమని, మంచికి అండగా, చెడుకు వ్యతిరేకంగా నిలవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ న్యాయవాదులకు పిలుపునిచ్చారు. ప్రేరేపిత, కక్షితదాడుల నుంచి న్యాయవ్యవస్థను పరిరక్షించాలని కోరారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ, డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్, జవహర్‌లాల్‌నెహ్రూ, లాలాలజపతిరాయ్, సర్ధార్ వల్లాభాయ్ పటేల్, అల్లాడి […]
న్యూఢిల్లీ: ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ విరుచుపడుతోంది. వైరస్ తన రూపాంతరాన్ని మార్చుకుంటోంది. ఎంతో మందిని బలితీసుకుంటోంది. ఈ తరుణంలో థర్డ్‌వేవ్ ముప్పు కూడా తప్పదన్న సైంటిస్టులు, వైద్యనిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రతిఒక్కరిలోనూ మరింత భయాందోళన మొదలైంది. విపత్తు ఎలా విరుచుకుపడుతుందోనన్న కలవరం నెలకొంది. దేశంలో కొవిడ్ అంతానికి, కొత్త రకం వైరస్‌లను ఎదుర్కొనేందుకు టీకాలపై పరిశోధనలను పెంచాలని కేంద్రప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు విజయరాఘవన్ సైతం హెచ్చరించారు. కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేలా వ్యాక్సిన్ ను అప్ […]
న్యూఢిల్లీ: నీట్, జేఈఈ పరీక్షలు యధాతథంగానే జరుగుతాయని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఆగస్టు 17న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించడం కుదరదని తేల్చిచెప్పింది. నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని ఆరురాష్ట్రాల మంత్రలు వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టి వేసింది. కాగా, ఇప్పటికే జేఈఈ మెయిన్స్-2020 పరీక్షలు సెప్టెంబర్ 1న ప్రారంభమయ్యాయి. 6వ తేదీ వరకూ జరగనున్నాయి. ఈనెల 13న నీట్ పరీక్ష జరగనుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు, పలు […]
న్యూఢిల్లీ: పదిరోజులుగా రోజుకో మలుపు తిరుగుతున్న రాజస్థాన్ రాజకీయం తాజాగా సుప్రీం కోర్టుకు చేరింది. 18 మంది రెబల్ ఎమ్మెల్యేల విషయంలో శుక్రవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్నారు. ‘నేను న్యాయమూర్తులను గౌరవిస్తాను. షో కాజ్ నోటీసు పంపే పూర్తి అధికారం స్పీకర్‌కు ఉంది. సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్‌పీ పిటిషన్ వేయాలని మా లాయర్‌ను కోరాను. హైకోర్టు […]
ముంబై: దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీలు, యూనివర్సిటీల్లో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర మినిస్టర్ ఆదిత్యథాక్రే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కు సెప్టెంబర్‌లో నిర్వహించనున్న పరీక్షలను రద్దుచేసేలా ఆదేశించాలని శివసేన అనుబంధ సంస్థ యువ సేన తరఫున పిటిషన్ వేశారు. స్టూడెంట్స్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, యాంక్సైటీ, సేఫ్టీని పక్కన పెడుతోందని, అందుకే పరీక్షలు నిర్వహిచాలని చూస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘కరోనా నేషనల్ డిజాస్టర్. […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ పాత భవనాల కూల్చివేత, కొత్త భవన సముదాయం నిర్మాణాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. సచివాలయం నిర్మాణం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయమని, అందులో న్యాయస్థానం జోక్యం చేసుకోదని అత్యున్నత న్యాయం స్థానం స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు తీర్పు సెక్రటేరియట్ నూతన భవన సముదాయం నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూసే వారికి చెంపపెట్టు అని టీఆర్ఎస్ […]
న్యూఢిల్లీ: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) లేదా ఇతర జ్యుడీషియరీ అథారిటీ అనుమతి లేకుండా జర్నలిస్టులపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేయొద్దని, ఈ మేరకు ప్రభుత్వానికి తగిన ఆదేశాలివ్వాలని కోరుతూ అడ్వొకేట్ ఘనశ్యామ్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంఘ విద్రోహ, జాతి వ్యతిరేక శక్తుల బండారం బయటపెడుతున్న న్యూస్ చానళ్లను కొందరు లక్ష్యంగా చేసుకుంటున్నారని, జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి, జీ […]