శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం వారు బుధవారం ఉదయం సాక్షి గణపతిస్వామి వారికి విశేష అభిషేకం నిర్వహించారు. పంచామృతాలు, పలు ఫలోదకాలతోనూ హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోదకం, శుద్ధజలంతో పూజలు చేశారు. తర్వాత స్వామివారికి విశేష పుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిపించారు. వైదిక సంప్రదాయాల్లో గణపతి అభిషేకానికి ఎంతో విశిష్టత ఉంది. అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. విద్యార్థుల్లో ఆలోచనా […]
సారథి న్యూస్, అచ్చంపేట: కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే ఘాట్‌రోడ్డులో నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు సమీపంలోని దర్గా వద్ద రక్షణగోడ శనివారం కూలింది. సమాచారం అందుకున్న అమ్రాబాద్ పోలీసులు శ్రీశైలం మార్గంలో వాహనాల రాకపోకలను కొద్దిసేపు నిలిపివేశారు. నాలుగైదు రోజులుగా నల్లమల అటవీప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాన నీటికి రక్షణ గోడ కోతకు గురైందని భావిస్తున్నారు. శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో కరోనా కలకలం సృష్టించగా, భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. […]
సారథి న్యూస్, కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శుక్రవారం నుంచి దర్శనాలను ప్రారంభించినట్టు దేవస్థాన ఈవో కేఎస్ రామారావు తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఆలయానికి రావొద్దని సూచించారు. క్యూలైన్లలో సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. శుక్రవారం స్థానికులకు దర్శనాలకు అవకాశం కల్పించామని.. శనివారం నుంచి దూరప్రాంతాల వారు రావొచ్చని సూచించారు. ఆలయసిబ్బందికి కరోనా రావడంతో కొంతకాలం క్రితం దర్శనాలను నిలిపివేశారు.
శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనాలు శుక్రవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి స్థానికులకు స్వామి, అమ్మవారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. 15వ తేదీ నుంచి యథావిధిగా భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ముందస్తుగానే www.srisailamonline.com వెబ్సైట్లో దర్శన టికెట్లు బుక్చేసుకోవాలని ఈవో తెలిపారు
శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానంలో బుధవారం ఉదయం సాక్షిగణపతికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశేష పుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిపించారు. వైదిక సంప్రదాయాల్లో గణపతి అభిషేకానికి ప్రాముఖ్యం ఉంది. ఈ అభిషేకం ద్వారా అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలి, విజయం లభిస్తుందని చెబుతుంటారు. అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులు ఆలోచనా శక్తి పెరిగి విద్య బాగా వస్తుంది చెబుతుంటారు. శ్రీశైల క్షేత్ర పరివార ఆలయాల్లో సాక్షిగణపతి ఆలయానికి […]
జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు 25 గేట్లు ఎత్తి.. 2.02లక్షల క్యూసెక్కుల నీటి విడుదల శ్రీశైలం రిజర్వాయర్‌కు తరలివస్తున్న వరద నీరు సారథి న్యూస్, కర్నూలు/మానవపాడు(జోగుళాంబ గద్వాల): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు బిరబిరా మంటూ కృష్ణవేణి శ్రీశైలం మల్లన్న సన్నిధికి చేరుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాం నిండుకుండలా మారి జలకళ సంతరించుకుంది. దీంతో గేట్లు ఎత్తివేయడంతో జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద […]
సారథి న్యూస్, శ్రీశైలం: లోకకల్యాణం కోసం పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం శ్రీశైలం భ్రమరాంబదేవి అమ్మవారి ఊయల సేవను వైభవంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి విశేషంగా స్తోత్రం, త్రిశతి, ఖడ్గమాల, సహస్ర నామపూజ, స్వామివారికి సహస్రనామార్చన జరిపించారు. చివరగా ఊయలసేవ నిర్వహించారు. స్వామి, అమ్మవారికి విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు జరిపించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో దర్శనాలను పూర్తిగా నిలిపివేశామని, అర్చకస్వాములు భౌతిక దూరం పాటిస్తూ ఊయలసేవ విశేషార్చనలు జరిపించామని […]
సారథి న్యూస్, నాగార్జునసాగర్ : నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం గురువారం సాయంత్రం క్రస్ట్‌గేట్లను తాకింది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు వద్ద విద్యుదుత్పత్తి చేస్తూ సాగర్‌కు 40,259 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో గురువారానికి క్రస్ట్‌గేట్ల లెవల్ (546 అడుగుల)కు నీటిమట్టం చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 13 రోజులుగా వరద వస్తుండగా, సాగర్ నీటిమట్టం రోజుకు ఒక అడుగు చొప్పున […]