సారథి న్యూస్, అచ్చంపేట: తెలంగాణ పరిధిలోని శ్రీశైలం పాతాళగంగ జెన్కో పవర్‌హౌస్‌లో అగ్నిప్రమాదం జరిగి 9 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ప్రమాదస్థలిని పరిశీలించేందుకు వెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డిని నల్లగొండ జిల్లా డిండి వద్ద పోలీసులు పోలీసులు అరెస్ట్ చేసి ఉప్పునుంతల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సంఘటన జరిగిన తీరును తెలుసుకుని బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందని, విచారణకు ఎలాంటి ఇబ్బందులు కలిగించబోమని తనను […]
సారథి న్యూస్, కర్నూలు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాలకు వరద నీరు పోటెత్తడంతో శ్రీశైలం 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బృందం శ్రీశైలం జలాశయం ప్రాజెక్టు ను సందర్శించి గేట్లను పరిశీలించి.. డ్యాంకు వస్తున్న వరద పరిస్థితి, ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్యాం ఎడమ గట్టున ఉన్న తెలంగాణ జెన్ కో పవర్ హౌస్ […]
శ్రీశైలం పవర్‌హౌస్ ఘటన చాలా దురదృష్టకరం బాధిత కుటుంబాలకు అన్నివిధాలుగా సాయం విచారం వ్యక్తంచేసిన విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సారథి న్యూస్, అచ్చంపేట: శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన సంఘటన దురదృష్టకరమైందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సంఘటన జరిగిన వెంటనే అర్ధరాత్రి బయలుదేరి సంఘటన స్థలికి 2.30 గంటలకు చేరుకున్నా ఉద్యోగులను దక్కించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం జెన్కో పవర్‌హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన జెన్కో ఉద్యోగుల పార్థివదేహాలను […]
నాగార్జునసాగర్: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో శుక్రవారం మధ్యాహ్నం నాగార్జునసాగర్ 4 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి 3.45 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల కొనసాగుతోంది. నాగార్జునసాగర్ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 585 అడుగుల మేర ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 312.04 టీఎంసీలకు గాను ప్రస్తుతం 271.37 టీఎంసీల నిల్వ ఉంది.
575 అడుగులకు చేరిన నీటిమట్టం నేడు సాగర్ గేట్లు ఎత్తివేసే అవకాశం నాగార్జునసాగర్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి వరద ఉధృతి పెరగడంతో నాగార్జునసాగర్ తొణికిసలాడుతోంది. శ్రీశైలం జలాశయం 10గేట్లు ఎత్తివేసి దిగువకు 3.45 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గురువారం సాయంత్రం నాగార్జునసాగర్ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 575.70 అడుగుల వద్ద ఉంది. 585 అడుగులకు చేరితే గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయి. సాగర్ […]
సారథి న్యూస్, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళగంగ వద్ద శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టీఎస్ జెన్ కో విద్యుత్ కేంద్రం మొదటి యూనిట్‌లోని ఓ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా గురువారం అర్ధరాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్దం సంభవించి మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. జీరో లెవెల్ నుంచి సర్వీస్ బే వరకు మంటలు వ్యాపించాయి. ఉద్యోగులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. […]
సారథి న్యూస్, కర్నూలు: ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో ఇప్పటికే పదిగేట్లను ఎత్తివేసి నాగార్జునసాగర్జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు భద్రత, నీటి మట్టం, విద్యుదుత్పత్తి.. తదితర వాటిని పరిశీలించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగస్టు 21న శుక్రవారం శ్రీశైలం రానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో శ్రీశైలంలోని సున్నిపెంట హెలిప్యాడ్ లో దిగుతారు. అక్కడి నుంచి జెన్కో […]
సారథి న్యూస్, కర్నూలు: ఎగువ నుంచి భారీవరద రావడంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. బుధవారం సాయంత్రం 195.7599 టీఎంసీల నీటి సామర్థ్యం చేరుకోవడంతో దిగువకు విడుదల చేశారు. రిజర్వాయర్ సామర్థ్యం 215. 807 టీఎంసీలు. 885 అడుగులకు గాను 881 అడుగుల మేర నీటినిల్వ ఉంది. జూరాల రిజర్వాయర్, సుంకేసుల బ్యారేజీ నుంచి మొత్తం శ్రీశైలానికి 3.63 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతోంది. సాయంత్రం ఆరు గంటలకు శిల్పాచక్రపాణి రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు మూడుగేట్లను ఎత్తి […]