అసలే తమిళలకు ప్రాంతీయ అభిమానం ఎక్కువ. అక్కడి హీరోల ఫ్యాన్స్ చిన్న చిన్న విషయాలకు కూడా కాలు దువ్వుతుంటుంటారు. అలాంటిది ఎంతో మంది తమిళులను పొట్టన పెట్టుకుంది శ్రీలంక. అక్కడి క్రికెటర్ గురించి సినిమా తీస్తామంటే ఒప్పుకుంటారా? కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా శ్రీలంకన్ లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితచరిత్ర ఆధారంగా ‘800’ అనే చిత్రాన్ని ఎంఎస్. శ్రీపతి దర్శకత్వంలో ట్రైన్ మోషన్ పిక్చర్స్, వివేక్ రంగాచారి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టుగా […]
కొలంబో: 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్ అయిందన్న ఆరోపణలకు ఎట్టకేలకు చెక్ పడింది. ఇందుకు సంబంధించిన సరైన ఆధారాలు లేవని లంక క్రీడా మంత్రిత్వ శాఖ విచారణ బృందం స్పష్టంచేసింది. ఈ మేరకు విచారణను ఆపేస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు 10 గంటల పాటు అప్పటి కెప్టెన్ కుమార సంగక్కరను విచారించిన విచారణ బృందం.. అతని స్టేట్మెంట్ను రికార్డు చేసింది. కానీ ఎక్కడా అవినీతి జరిగినట్లు ఆధారాలు లేకపోవడంతో దర్యాపు ముందు సాగలేదు. అరవింద డిసిల్లా (అప్పటి […]
కొలంబో: కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యాపారాలు కుదేలయ్యాయి. సినిమా థియేటర్లు కూడా మూతపడటంతో యజమానులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో అన్ని దేశాలు క్రమంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నాయి. అయినప్పటికీ చాలా దేశాల్లో సినిమాహాళ్లు, పబ్లిక్ పార్కులు, పబ్‌లు వంటివి తెరవలేదు. కాగా తాజాగా శ్రీలంకలో సినిమా థియేటర్లను తిరిగి ఓపెన్ చేయనున్నట్టు ఆ దేశం ప్రకటించింది. ఇందుకు ప్రతి థియేటర్ నిర్వాహకులు స్థానిక ఆరోగ్యశాఖ అధికారులకు ఒప్పంద పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది.అలాగే దేశంలో అన్ని మ్యూజియాలను, […]
కొలంబో: 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఫిక్సయిందని అప్పటి శ్రీలంక క్రీడా మంత్రి మహిందానంద అల్తుగమాగే సంచలన ఆరోపణలు చేశాడు. ఆ మ్యాచ్ ను లంక.. భారత్‌కు అమ్మేసుకున్నదని విమర్శించాడు. ‘ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మేం అమ్మేసుకున్నామని నేను ఈ రోజు చెబుతున్నా. అప్పుడు నేనే క్రీడా మంత్రిగా ఉన్నా.. ఆ సమయంలో చెప్పే అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు చెప్పడం నా బాధ్యతగా భావిస్తున్నా’ అని మహిందానంద వ్యాఖ్యానించాడు. 2010 నుంచి 2015 వరకు లంక […]
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లో ఐపీఎల్ జరిగే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లీగ్‌ను నిర్వహించడం పెద్ద తలనొప్పితో కూడుకున్న వ్యవహారమన్నాడు. అయితే సెప్టెంబర్‌లో శ్రీలంక లేదా యూఏఈలో మెగా టోర్నీని నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుందన్నాడు. ‘స్టేడియాల్లోకి అభిమానులను అనుమతిస్తూ ఆసీస్ నిర్ణయం తీసుకోవడంతో టీ20 ప్రపంచకప్‌పై ఆశలు మొలకెత్తుతున్నాయి. అక్టోబర్‌లో ఈ మెగా ఈవెంట్ ఉంటే అంతకంటే ముందుగానే అన్ని జట్లు అక్కడికి వెళ్తాయి. క్వారంటైన్, […]
న్యూఢిల్లీ: శ్రీలంకలో టీమిండియా పర్యటన రద్దయింది. జూన్–జులైలో జరగాల్సిన ఈ పర్యటనలో ఇరుజట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లు ఆడడం సాధ్యం కాదని ఇరుదేశాల బోర్డులు ప్రకటించాయి. అయితే ఎఫ్టీపీ ప్రకారం ఆడాల్సిన సిరీస్‌లను భవిష్యత్‌లో అవకాశం వస్తే ఆడతామని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నాడు. ‘జూన్, జులైలో జరగాల్సిన లంక టూర్ సాధ్యం కాదు. ఈ విషయాన్ని లంక బోర్డుకు కూడా చెప్పాం. ప్రస్తుతం […]
ముంబై: టీమిండియా క్రికెటర్లు ఇంకా ఔట్‌డోర్ ప్రాక్టీస్ మొదలుపెట్టకపోయినా.. ఆగస్టులో శ్రీలంక పర్యటనను బీసీసీఐ దాదాపుగా ఖరారు చేసింది. 3వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం కోహ్లీసేన అక్కడ పర్యటించనుంది. ఈ సిరీస్‌కు సంబంధించి శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. లంకకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కూడా తెలుస్తున్నది. ఎఫ్టీపీ ప్రకారం ఈ సిరీస్‌ను జూన్‌లో నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా వ్యాప్తి పెరుగుతుండడతో […]
ముంబై: క్రికెట్‌ను రీస్టార్ట్ చేశాక.. కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర అన్నాడు. ముఖ్యంగా కొత్త గైడ్‌లైన్స్ విషయంలో గందరగోళం చోటు చేసుకుంటుందన్నాడు. వీటిని క్రికెటర్లు ఎలా అధిగమిస్తారో చూడాలన్నాడు. ‘ఫాస్ట్ బౌలర్ అయినా, స్పిన్నరైనా బాల్‌ను షైన్ చేసేందుకు మొగ్గు చూపుతారు. దీని కోసం సలైవాను ఉపయోగిస్తారు. ఏళ్లుగా వస్తున్న అలవాటు ఇది. ఒక్కసారి దీనిని మర్చిపోవాలంటే సాధ్యం కాదు. క్రికెట్ సోషల్ గేమ్. ఎక్కువ టైమ్ మనం డ్రెస్సింగ్ రూమ్‌లో […]