Breaking News

SARPANCH

మథర్ థెరిస్సా గొప్ప మానవతావాది

సారథి న్యూస్, చొప్పదండి: మథర్ థెరిస్సా సేవలు మరువలేనివని ప్రముఖ సామాజిక వేత్త, కవి, రచయిత పసూల రవి కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్​ జిల్లా చొప్పదండి మండలం దేశాయిపేట్ గ్రామంలో బుధవారం మథర్ థెరిస్సా జయంతి పురస్కరించుకుని గ్రామ యువకులు ‘మీకోసం.. మేము’ అనే స్వచ్ఛంద సేవాసమితిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఈ ఫౌండేషన్ స్థాపించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గుంట రవి, ఉప సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, వార్డుసభ్యులు మోర వెంకటరమణ, కొలిపాక […]

Read More

నిజాంపేటలో 31 వరకు లాక్​డౌన్​

సారథి న్యూస్​, రామాయంపేట: కరోనా వైరస్​ తీవ్రరూపం దాల్చుతున్న ప్రస్తుత తరుణంలోనిజాంపేట మండల కేంద్రంలో ఈ నెల 31 వరకు లాక్​డౌన్​ పొడగించాలని గ్రామపంచాయతీ తీర్మానించింది. ఈ సందర్భంగా సర్పంచ్ అనూష మాట్లాడుతూ.. కరోనా వైరస్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లఘించిన వారికి రూ. 5000 జరిమానా విధిస్తున్నట్లు ఆమె తెలిపారు. బుధవారం లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురు షాప్ యజమానులకు జరిమానా విధించినట్టు ఆమె […]

Read More

పార్కులతో ఆహ్లాదం

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలం నందగోకుల్​ గ్రామంలోని వివేకానంద యువజనసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పార్కుకు శుక్రవారం సర్పంచ్ బాల్ నర్సవ్వ, ఎంపీపీ సిద్ధరాములు శంకుస్థాపన చేశారు. పార్కు లోపల ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి, వార్డు మెంబర్లు, వివేకానంద యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు.

Read More

సర్పంచ్​ల సంఘం ఉపాధ్యక్షురాలిగా శైలజ

సారథి న్యూస్, చేవెళ్ల : సర్పంచుల సంఘం మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా చేవెళ్ల సర్పంచ్ బండారు శైలజ నియమితులయ్యారు. బుధవారం సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చక్కటి వెంకటేశ్ యాదవ్ నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్​ల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్ గౌడ్, మండలంలోని పలు గ్రామాల సర్పంచ్​లు పాల్గొన్నారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేయడం ఆనందంగా ఉందని శైలజ పేర్కొన్నారు.

Read More

సరుకులు పంపిణీ

సారథి న్యూస్, మహబూబ్​ నగర్​ : మహబూబ్ నగర్ రూరల్ మండలం కోటకదిర గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లు రమ్య దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రేషన్ కార్డు లేని వారికి బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రైతుబంధు అధ్యక్షుడు మల్లు దేవేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మునీర్, మండల కో ఆప్షన్ ఎం.డి మస్తాన్, మాజీ ఎంపిటిసి నరసింహులు, పంచాయతీ సెక్రటరీ మాధవి, టిఆర్ఎస్ కార్యకర్తలు రాములు, శేఖర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Read More