సారథి న్యూస్, రామాయంపేట: వరి పంటలో అధిక దిగుబడులకు సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని నిజాంపేట మండల వ్యవసాయాధికారి సతీష్రైతులకు సూచించారు. మంగళవారం ఆయన నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామంలో పంట పొలాలను పరిశీలించారు. వరి పంటను మొగిపురుగు ఆశిస్తే మొదటగా 3జీ లేదా 4జీ గుళికలను ఎకరాకు ఆరు లేదా 8 కిలోల చొప్పున చల్లుకోవాలని సూచించారు. అగ్గితెగులు ఆశించినట్లయితే ట్రైసాక్లోజల్ 0.6 గ్రాములు లేదా 2.25 ఎం.ఎల్ కాసుమిసిన్ వేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఈవో […]
సారథి న్యూస్, రామాయంపేట: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి కిరోసిన్పోసుకుని నిప్పంటించుకుని సూసైడ్చేసుకుంది. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నందిగామకు చెందిన దేవసాని రేవతి(19) రెండేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స చేయించినా నయం కాకపోవడం, అలాగే తన కుటుంబసభ్యులు తనకు పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. అనారోగ్యంతో ఉంటూనే ఇప్పుడే పెండ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనంతట తాను ఒంటిపై కిరోసిన్ పోసుకుని […]
సారథి న్యూస్, రామాయంపేట: కరోనా నేపథ్యంలో.. ఉన్న ఊరులోనే తన శక్తి మేర పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశపడ్డ ఓ యువకుడి ఆశలు అడియాసలయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు కోళ్ల షెడ్ లోకి చేరడంతో సుమారు వెయ్యి కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన మండలంలోని మెదక్ జిల్లా రామాయంపేట చల్మెడ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా షెడ్ నిర్వాహకుడు కరుణాకర్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఎక్కడికి వెళ్లి ఉద్యోగం […]
సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా కో ఆపరేటివ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా రామాయంపేట సహకార సంఘం సీఈవో పుట్టి నర్సింలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవలు అందిస్తానని తెలిపారు.
సారథి న్యూస్, రామాయంపేట: చిన్ననాటి స్నేహితులు తమ అనుబంధాన్ని చాటుకున్నారు. చనిపోయిన తమ స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచారు. కొంత ఆర్థిక సహాయం అందజేసి మేమున్నామని.. ధైర్యం చెప్పారు. మెదక్జిల్లా నిజాంపేట మండలంలోని చల్మేడ గ్రామానికి చెందిన కుమ్మరి బాలరాజు(36) మూడు రోజుల క్రితం చనిపోయాడు. ఈ ఘటనతో తమ చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న దోస్త్ ఫ్యామిలీకి ఆర్థిక సహాయం అందించాలని, అదే గ్రామానికి చెందిన మృతుడి ఫ్రెండ్స్ రూ.13,800 జమచేసి మృతుడి భార్యకు అందజేశారు. […]
సారథి న్యూస్, రామాయంపేట: మెదక్జిల్లా నిజాంపేట మండలంలోని చల్మెడ గ్రామంలో శనివారం నిజాంపేట ఎంపీపీ సిద్ధరాములు పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ మేరకు గ్రామానికి చెందిన బొమ్మన భిక్షపతి రూ.25వేలు, వడ్ల శ్రీనివాసులు రూ.44,వేలు, భూడాల దుర్గయ్య కు రూ.48వేల చొప్పున విలువైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నంద్యాల బాల్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహేష్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్, ఆకుల లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ నాయకులు […]
సారథి న్యూస్, రామాయంపేట: అగస్టు 15 కల్లా రైతు వేదిక నిర్మాణాలు చేపట్టాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె నిజాంపేట మండల కేంద్రంలో ఆరో విడుత హరితహారం సందర్భంగా మొక్కలు నాటారు. జిల్లాలో ని 75 క్లస్టర్ లలో రైతు వేదికలను నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఏవో పరుశురాం నాయక్, మెదక్ ఆర్డీవో సాయిరాం, ఏడీ ఏ వసంత సుగుణ, తహసీల్దార్ జయరామ్, వ్యవసాయాధికారి సతీశ్, ఎంపీపీ సిద్ధరాములు, జెడ్పీటీసీ విజయ్ కుమార్, […]
సారథి న్యూస్, రామాయంపేట: జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం పనిదినాలను 200 రోజులకు పెంచాలని దళిత బహుజలన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పీ శంకర్ డిమాండ్ చేశారు. సోమవారం నిజాంపేట మండలం చల్మెడలో జాతీయ ఉపాధి హామీ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లాక్ డౌన్ తో నిరుద్యోగం పెరిగి లక్షలమంది గ్రామాలకు తిరిగి వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో డీబీఆర్సీ జిల్లా కో ఆర్డినేటర్ దుబాషి సంజివ్ బుచ్చయ్య, మల్లేశం, పరుశరాములు, స్వామి, […]