Breaking News

RAMAGUNDAM

నిత్యావసర సరుకులు పంపిణీ

సారథిన్యూస్​, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆదివారం లయన్స్​క్లబ్​ ఆధ్వర్యంలో ప్రైవేట్​ ఉపాధ్యాయులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్​ క్లబ్​ అధ్యక్షుడు గుగ్గిళ్ల రవీంద్రాచారి మాట్లాడుతూ.. కరోనా, లాక్​డౌన్​తో ప్రైవేట్​ టీచర్ల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. అందుకే వారికి తమవంతుగా ఈ సాయం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో లయన్స్​క్లబ్​ ప్రధాన కార్యదర్శి భిక్షపతి, కోశాధికారి గుండా రాజు, సభ్యులు శరత్ బాబు, డాక్టర్ వెంకటేశ్వర్లు, భేణిగోపాల్ త్రివేది, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Read More

ప్రజాధనం దుర్వినియోగం

సారథి న్యూస్​, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని లక్ష్మీనగర్​లో 2013లో ప్రభుత్వం నిర్మించిన షాపింగ్​ కాంప్లెక్స్​ నిరుపయోగంగా ఉందని.. దీంతో రూ. 7 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని సీపీఐ నేతలు ఆరోపించారు. ఆదివారం సీపీఐ నేతలు రామగుండంలో పర్యటించి ప్రభుత్వం నిర్మించిన షాపింగ్​ కాంప్లెక్స్​ను సందర్శించారు. సీపీఐ రామగుండం నగర కార్యదర్శి కనకరాజ్​ మాట్లాడుతూ.. కేవలం కాంట్రాక్టర్లను బతికించడానికే షాపింగ్​ కాంప్లెక్స్​ను నిర్మించారని ఆరోపించారు. ఈ దుకాణ సముదాయం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. […]

Read More

రజకుల సమస్యలు పరిష్కరిస్తాం

సారథిన్యూస్​, రామగుండం: రజకుల సమస్యలను పరిష్కరిస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని 9వ డివిజన్​లో దోబీఘాట్​ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కులవృత్తులను నమ్ముకుని జీవించే రజకులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని అన్నారు. రూ. 5 లక్షల నిధులతో దోభీఘాట్ నిర్మిస్తున్నామన్నారు. అనంతరం 8వ డివిజన్​లోని తెలంగాణ అడ్వంచర్ అక్వాడ్ టూరిజం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్ […]

Read More
నిరంజన్​రెడ్డి

ఎరువుల ఉత్పత్తి వేగవంతం

సారథిన్యూస్​, పెద్దపల్లి: ఎరువుల కర్మాగారం నిర్మాణపనులు త్వరితగతిన పూర్తిచేసి సెప్టెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మిస్తున్న ఎరువుల కర్మాగారాన్ని ఆయన సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్​రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.6120.5 కోట్ల నిర్మాణంతో చేపట్టిన ఎరువుల కర్మాగార పునరుద్ధరణ పనులు […]

Read More

కార్మికులను ఆదుకుంటాం

సారథి న్యూస్​, రామగుండం: కాంట్రాక్ట్​​ కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సిబ్బందికి లాక్​డౌన్​ సమయంలోని ఏప్రిల్​ మాసంలో 50 శాతం వేతనాలు అందించేందుకు ఆ సంస్థ యజమాన్యం అంగీకారం తెలిపారు. పాలకుర్తి మండలం బసంత్ నగర్ లో కేశోరాం ఫ్యాక్టరీ కాంట్రాక్టు కార్మికులతో ఎమ్మెల్యే మాట్లాడారు. లాక్ డౌన్ కాలంలో వేతనాలు ఇప్పించాలని కార్మికులు ఎమ్మెల్యేను కోరారు. దీంతో ఎమ్మెల్యే ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించి […]

Read More

పట్టణాల పారిశుద్ధ్యమే ముఖ్యం

సారథి న్యూస్​, రామగుండం: పట్టణాల పారిశుద్ధ్యమే ముఖ్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం ఆయన రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రధాన కాల్వల క్లీనింగ్​ను పరిశీలించారు. వర్షాకాలంలో సీజనల్ వాధ్యులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆయన వెంట రామగుండం కార్పొరేషన్​ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, నారాయణదాసు, మారుతి, ఇరుగురాళ్ల శ్రావణ్, బూరుగు వంశీకృష్ణ, […]

Read More

వ్యాధుల నుంచి జాగ్రత్తగా ఉండాలి

సారథి న్యూస్​, రామగుండం: కార్పొరేషన్ లోని ప్రతి డివిజన్​లో ప్లాన్​ ప్రకారం అభివృద్ధి పనులను పూర్తిచేస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం పట్టణ ప్రగతిలో భాగంగా 37, 46వ డివిజన్ లో పర్యటించారు. ఇంటిలో వాడిన నీటిని డ్రైనేజీల్లోకి వెళ్లేలా చూసుకోవాలని సూచించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అంతకుముందు రామగుండం కార్పొరేషన్ ఆఫీసు ఆవరణ, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే […]

Read More

పర్యావరణాన్ని కాపాడుకుందాం

సారథి న్యూస్​, గోదావరిఖని: ప్రతిఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆర్జీ1 జీఎం కె.నారాయణ, రామగుండం ఎన్విరాన్​మెంట్​ ఇంజనీర్ కె.రామదాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆర్ జీ 1 జీఎం ఆఫీసులో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పంచభూతాలను కలుషితం చేయొద్దన్నారు. సింగరేణి ఏరియాలో ఎక్కువ మొత్తంలో మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. జీవవైవిధ్యంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన ఉద్యోగులకు మెమొంటోలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు దామోదర్ రావు, అధికారుల సంఘం […]

Read More