సారథి, రామడుగు: సమగ్ర బాలల సంరక్షణ పథకంలో భాగంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం మండలంలోని వెదిర గ్రామంలో గురువారం గ్రామస్థాయి బాలాల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇందులో మొత్తం 16 మంది సభ్యులు వీరిలో సర్పంచ్ చైర్మన్ గా వ్యవహరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారి కవిత, సర్పంచ్ తీగల సంగీత, వార్డు సభ్యులు, కార్యదర్శి ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, జడ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్ కమల […]
సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, కార్యదర్శులు అభివృద్ధి చెందిన గ్రామాన్ని సందర్శిస్తారని ఎంపీడీవో మల్హోత్ర తెలిపారు. అందులో భాగంగానే బుధవారం వెలిచాల సర్పంచ్ వీర్ల సరోజన వెలిచాల గ్రామానికి ఎంపీపీ, జడ్పీటీసీ వస్తారని తెలిపారు. కావునా మండలంలోని సర్పంచ్లు, కార్యదర్శులు హాజరుకావాలని ఎంపీడీవో తెలిపారు.
సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని తాటివనానికి పోయేందుకు రోడ్డు మీద బ్రిడ్జి నిర్మించాలని గౌడకులస్తులు ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ కు క్యాంపు ఆఫీసులో బుధవారం వినతిపత్రం ఇచ్చారు. స్థానిక ఎల్లమ్మ, సమ్మక్క సారలమ్మ దేవాలయాలు, రామడుగు తాటి వనంలో ఉండడంతో గౌడ కులస్తులు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. రోడ్డుమధ్యలో వాగు ప్రవహిస్తూ వర్షాల సమయంలోనూ నారాయణ పూర్ రిజర్వాయర్ నీరు విడుదల చేసినప్పుడు వరద ఉధృతికి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. […]
సారథి, రామడుగు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీని బుధవారం మండల కేంద్రంలో ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ చైర్మన్ గా కాడే శంకర్, వైస్ చైర్మన్ గా జెట్టుపల్లి వీరయ్య, మాదం ఎల్లయ్య, మాదం రమేష్, గునుగొండ అశోక్, ప్రధాన కార్యదర్శిగా జెట్టుపల్లి మురళి, కోశాధికారి పల్నాటి చంద్రయ్య సభాధ్యక్షుడిగా జెట్టుపల్లి అనిల్, సభ్యులు పర్లపల్లి మహేష్ కర్నె శ్రీను, సలహాదారులుగా కల్గెటి లక్ష్మణ్, […]
సారథి, రామడుగు: కొద్దిరోజులుగా కరోనా మహమ్మరి సెకండ్ వేవ్ ఉధృతి పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని నిషేధాజ్ఞలు జారీచేసిందని, వాటిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని రామడుగు ఎస్సై గొల్లపల్లి అనూష హెచ్చరించారు. ఈ మేరకు ఆమె ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఆదేశాలను మండల ప్రజలు కచ్చితంగా పాటించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, సభలు, సమావేశాలకు అనుమతి లేదని, ర్యాలీలు, ధర్నాలకు పర్మిషన్ లేదని హెచ్చరించారు. […]
సారథి న్యూస్, రామడుగు: రామడుగు మండలంలోని వెదిర గ్రామంలో వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం గురువారం వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య అంగరంగ వైభవంగా సాగింది. దుర్ముట్ల లక్ష్మీ, నర్సింహారెడ్డి, దుర్ముట్ల హారిక కిషన్ రెడ్డి, సందూరి జ్యోతి, రవీందర్ రెడ్డి దగ్గరుండి జరిపించారు. స్వామి వారిని ఎదుర్కోలుగా తీసుకొచ్చి ముత్యాల పందిరిలో కూర్చోబెట్టగా వేదపండితులు కల్యాణం జరిపించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించి కట్నకానుకలు సమర్పించారు. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో […]
సారథి న్యూస్, రామడుగు: పండ్ల తోటల్లో అధిక సాంద్రత, వాటి ఉపయోగాలు అనే అంశంపై ఆత్మ సౌజన్యంతో రైతులకు సిద్దిపేట జిల్లా ములుగు సెంటర్ లో మంగళవారం విజ్ఞానయాత్ర నిర్వహించారు. రామడుగు, చొప్పదండి మండల లకు చెందిన రైతులు ఈ పర్యటనలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారులు రోహిత్, అర్చన వివిధ మండలాల నుంచి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామడుగు: రామడుగు మండలం వన్నారం గ్రామానికి చెందిన జి.కొమురయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. వైద్యఖర్చుల కోసం గతంలో రూ.మూడులక్షలు, ప్రస్తుతం రూ.రెండు లక్షల ఎల్వోసీని కొమురయ్య కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.