కేంద్రం అబద్ధాలకు కూడా ఓ హద్దు ఉండాలి ఇంత మోసపూరిత సర్కారును చూడలేదు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సారథి న్యూస్, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, సీనియర్ అధికారులతో గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈనెల 14 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, కేంద్రం […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఏపీ టీడీపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఆ పార్టీ విధానం ఏమిటో కూడా అర్థం కాక తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే అధికార వైఎస్సార్‌సీపీ టీడీపీపై దాడికి పదునుపెట్టింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను దూరం చేసి తమ వైపునకు తిప్పుకొంటోంది. మరోవైపు నాయకులపై కేసులు పెడుతోంది. ఇలాంటి తరుణంలో అధికార పార్టీని బలంగా ఢీకొనాలని టీడీపీ కూడా తమ విమర్శలకు పదును పెడుతోంది. కానీ, ఇటీవల కాలంలో ఆ పార్టీ […]
సారథి న్యూస్, అనంతపురం: వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురు అభ్యర్థులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు ఎన్నికల్లో ఘన విజయం ఆ పార్టీ బలం రాజ్యసభలో ఆరుకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 175 ఓట్లు ఉండడంతో గెలిచేందుకు 36 ఓట్లు అవసరమవుతాయి. అయితే 173 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, కె.అచ్చెన్నాయుడు ఓటింగ్‌లో పాల్గొనలేదు. మరోవైపు పోలైన వాటిలో కూడా నలుగురి ఓట్లు […]
న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. పార్టీ ఫిరాయింపు దారుల కోసమే రాజ్యసభ ఎలక్షన్స్‌ను లేట్ చేశారని బీజేపీపై విమర్శలు చేశారు. గుజరాత్, రాజస్థాన్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు, అమ్మకాలు పూర్తికాలేదు కాబట్టే ఎన్నికలను రెండు నెలలు వాయిదా వేశారని ఆరోపించారు. ‘రాజ్యసభ ఎన్నికలు రెండు నెలల క్రితమే జరగాల్సి ఉంది. రాజస్థాన్, గుజరాత్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు అమ్మకాలు పూర్తికాలేదు. అందుకే డిలే చేశారు. ఇప్పుడు పరిస్థితి […]