టీఆర్ఎస్, బీజేపీ మధ్య లీడ్ దోబూచులాట కనీసం పోటీ ఇవ్వని కాంగ్రెస్ సారథి న్యూస్, దుబ్బాక: గులాబీ కంచుకోటలో కమలం వికసించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు 1,079 ఓట్ల మెజారిటీతో అనూహ్య విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ మొదలుకుని 25 రౌండ్లలో ప్రతి రౌండ్ నువ్వా.. నేనా? అన్నట్లు సాగింది. ప్రతి రౌండ్ నరాలు తెగే ఉత్కంఠతను తలపించింది. పలు రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ అంతిమ […]
సారథి న్యూస్, దుబ్బాక: మాధవనేని రఘునందన్‌రావు టీఆర్ఎస్ తో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి బీజేపీలో రాష్ట్రస్థాయి కీలకనేతగా ఎదిగారు. రాజకీయాలకు రాక ముందు ఆయన ఓ ప్రముఖ దినపత్రికలో విలేకరిగా పనిచేశారు. చిన్నతనం నుంచే రాజకీయాలపై అవగాహన ఉన్న ఆయన డిగ్రీ వరకు సిద్దిపేటలో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టాపొందారు. విలేకరిగా మొదలైన మాధవనేని రఘునందన్ రావు జీవితం ఎమ్మెల్యే స్థాయి దాకా వెళ్లింది. ఉమ్మడి మెదక్‌జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లా దుబ్బాక […]
గులాబీ కోటలో కాషాయ జెండా రెపరెపలు ఉత్కంఠ పోరులో రఘునందన్ రావు విజయం కారును పోలిన సింబల్‌ను 3,489 ఓట్లు సారథి న్యూస్, దుబ్బాక: రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉపఎన్నికలో సంచలన విజయం నమోదైంది. నువ్వా నేనా? అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్యరీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు సమీప అభ్యర్థి సోలిపేట సుజాతపై విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన పోరులో చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం చూపి టీఆర్ఎస్ […]
సారథి న్యూస్, దుబ్బాక: ఈనెల 10న నిర్వహించనున్న దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశామని దుబ్బాక ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెన్నయ్య చెప్పారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీమతి భారతి హోళీకేరి ఆదేశాల మేరకు కౌంటింగ్ కేంద్రం వద్ద అన్ని మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. బ్రాండ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు వీడియోగ్రఫీ చేస్తున్నామని చెప్పారు. కౌంటింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశిత […]
సారథి న్యూస్, దుబ్బాక: దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ మంగళవారం ముగిసింది. 82.61 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో ఈ పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 6గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో 86.24శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి పోలింగ్ శాతం తగ్గడం కొంత ఆందోళన కలిగిస్తోంది. కాగా, […]
టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు ఇంకా అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్ సారథి న్యూస్, దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ప్రముఖంగా త్రిముఖ పోరు కనిపిస్తోంది. ఎవరికివారు బలనిరూపణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలని అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మంగా పావులు కదుపుతున్నాయి. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్రపోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా తన […]