సారథిన్యూస్, రామడుగు: టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లతో పేదల సొంత ఇంటి కల సాకారమవుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పథకం బృహత్తరమైనదని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతం చేసి పేదలకు త్వరితగతిన అందించేలా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో […]
సారథిన్యూస్, గంగాధర: తన పుట్టినరోజు నాడు వికలాంగులకు బస్‌పాస్‌లు అందించి ఓ మహిళా నేత ఔదార్యాన్ని చాటుకున్నారు. టీఆర్ఎస్ మహిళా నాయకురాలు రోజా తన పుట్టిన రోజున సొంతఖర్చులతో వికలాంగులకు ఉచిత బస్‌పాసులు అందజేశారు. శనివారం కరీంనగర్ జిల్లా గంగాధర మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వికలాంగులకు బస్‌పాసులను అందించారు.