Breaking News

PALVANCHA

వారెవ్వా.. కాపీయింగ్​!

వారెవ్వా.. కాపీయింగ్​

సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: ఓపెన్ ​యూనివర్సిటీ ఎగ్జామ్స్ ​నిర్వహణ అభాసుపాలవుతోంది. నిర్వాహకులు బుక్స్, సెలఫోన్స్ ​ముందుపెట్టుకుని ఎగ్జామ్స్ ​రాయించడం చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని రవి ఐటీఐ కాలేజీలో నాగార్జున యూనివర్సిటీ ఓపెన్ డిస్టెన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ జోరుగా మాస్ కాపీయింగ్ కొనసాగుతోంది. కోవిడ్ ​19 నిబంధనలు పాటించకుండా ఒకే రూమ్ లో 40 మందిని కిక్కిరిసి కూర్చోబెట్టి పరీక్ష రాయిస్తున్నారు. నిర్వాహకులు విద్యార్థుల వద్ద ఒక్కో సబ్జెక్ట్ కు కొంత […]

Read More
రైతు పక్షపాతి కేసీఆర్​

రైతు పక్షపాతి కేసీఆర్

సారథి న్యూస్​, పాల్వంచ: సీఎం కేసీఆర్​ తెలంగాణ రాష్ర్ట రైతుల పక్షపాతని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పాల్వంచ కో ఆపరేటివ్ సొసైటీ కి కొత్త సభ్యులకుగాను రూ.65 లక్షలు మంజూరయ్యాయి. పాల్వంచ సొసైటీ కార్యాలయంలో గురువారం వనమా రైతులకు పంట రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వనమా మాట్లాడుతూ కేసీఆర్​ సీఎం అయిన తర్వాత రైతులకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టి రూ.లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారన్నారు. రైతుబంధు […]

Read More
దంచికొడుతున్న వానలు

దంచికొడుతున్న వానలు

సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 13.6 అడుగులకు నీటిమట్టం చేరింది. గోదావరి నదిలోకి 74,723 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇలా ఉండగా, పాల్వంచ మండలంలో కురుస్తున్న భారీవర్షాలకు లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా […]

Read More

వ్యభిచారముఠా అరెస్ట్​

సారథిన్యూస్​, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోలీసులు తనిఖీ చేసి వ్యభిచార ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పాల్వంచలోని ఓ ఇంజిరింగ్​ కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీచేసి ముగ్గురు మహిళలతోపాటు ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు.

Read More

రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డ మహిళా వీఆర్వో

సారథిన్యూస్​, పాల్వంచ: ఓ మహిళా అధికారి లంచం తీసుకుంటూ రెడ్​హ్యండెడ్​గా ఏసీబీకి చిక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలానికి చెందిన ఓ బాధితురాలు .. కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్నది. ఆ దరఖాస్తును అప్రూవల్​ చేసేందుకు వీఆర్వో పద్మ లంచం డిమాండ్​ చేసింది. బాధితురాలు ఏసీబీని ఆశ్రయించగా .. రంగంలోకి దిగిన అధికారులు మంగళవారం తహసీల్దార్​ కార్యాలయంలో వీఆర్వో పద్మ.. లంచం తీసుకుంటుండగా అధికారులు గా పట్టుకున్నారు.

Read More