Breaking News

NIZAMPET

‘కోరుట్ల ఎమ్మెల్యే సారీ చెప్పాలే’

కోరుట్ల ఎమ్మెల్యే సారీ చెప్పాలే

సారథి న్యూస్, రామయంపేట: అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీరాముడి ఆలయానికి విరాళాల సేకరణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వెంటనే క్షమాపణలు చెప్పాలని, అలాగే బహిరంగ క్షమాపణ చెప్పాలని నిజాంపేట బీజేపీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాముడి గుడి ఎక్కడ కట్టినా విరాళాలు ఇవ్వడానికి ప్రతి హిందువు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో శేఖర్, నరేశ్, మహంకాళి, నరేష్ రెడ్డి, హరిబాబు, తదితరులు పాల్గొన్నారు. […]

Read More
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కమిటీ నియామకం

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కమిటీ నియామకం

సారథి న్యూస్, రామాయంపేట: నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో మంగళవారం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కమిటీని నియమించారు. నస్కల్ శాఖ ట్రస్ట్ కమిటీ అధ్యక్షుడిగా గందే రాములును నియమించారు. కార్యక్రమంలో జిల్లా ప్రముఖ్​ పబ్బ సత్యనారయణ, ఉమ్మడి జిల్లా సంఘటన కార్యదర్శి పుట్టి మల్లేష్, నిజాంపేట మండల ప్రముఖ్​ కొమ్మట నరేందర్, బీజేపీ నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్, తిరుపతి పాల్గొన్నారు.

Read More
ఇండిపెండెంట్ డబుల్ ఇళ్లకు రూ.5లక్షల సాయం

ఇండిపెండెంట్ ‘డబుల్’ ఇళ్లకు రూ.5లక్షల సాయం

సారథి న్యూస్, రామయంపేట: రాబోయే రోజుల్లో ఇల్లు లేక సొంత జాగా కలిగి ఉన్న వారికి రూ.ఐదు లక్షల వ్యయంతో నిర్మించబోయే డబుల్ బెడ్​రూమ్ ఇళ్ల నిర్మాణంలో కె.వెంకటాపూర్ కే ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నిజాంపేట మండలంలోని కె.వెంకటాపూర్ గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ముఖ్య​అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో భక్తిభావం విరసిల్లాలని ఆమె అన్నారు. అలాగే అలయ అభివృద్దికి తన సహాయ […]

Read More
కిడ్నీ మార్పిడికి ఆర్థిక సాయం

కిడ్నీ మార్పిడికి ఆర్థిక సాయం

సారథి న్యూస్​, నిజాంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన రాజేందర్ గౌడ్ కు రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో వైద్య ఖర్చులు, కిడ్నీ మార్పిడి కోసం బాధిత కుటుంబసభ్యులు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. మంజూరైన రూ.మూడులక్షల ఎల్వోసీని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తన క్యాంపు ఆఫీసులో బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు.

Read More
భార్యాభర్తలపై కత్తితో దాడి

భార్యాభర్తలపై కత్తితో దాడి

సారథి న్యూస్, రామయంపేట: పాత కక్షల నేపథ్యంలో భార్యాభర్తలపై కత్తితో ఓ వ్యక్తి దాడిచేశాడు. శనివారం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన బోయిని శ్రీనివాస్ అతని భార్య కనకవ్వలపై అదే గ్రామానికి చెందిన తమ్మల ప్రభాకర్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న పాతకక్షలే కారణమని గ్రామస్తులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలను చికిత్స కోసం రామాయంపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు […]

Read More
నిరుపేద వధువు పెండ్లికి సాయం

నిరుపేద వధువు పెండ్లికి సాయం

సారథి న్యూస్, రామాయంపేట: రామాయంపేట మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడ బిడ్డల వివాహానికి మెదక్​జిల్లా నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ పుస్తెమట్టెలను ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యుడు గౌస్, టీఆర్ఎస్​ నాయకులు లక్ష్మణ్ గౌడ్, నాగరాజు, అబ్దుల్, ఆముద రాజు తదితరులు పాల్గొన్నారు.

Read More
సబ్బండవర్ణాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ ధ్యేయం

సబ్బండవర్ణాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ ధ్యేయం

సారథి న్యూస్, రామాయంపేట: సబ్బండవర్ణాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రతి గ్రామంలో వందశాతం సబ్సిడీపై ఉచితంగా చేపపిల్లలను అందిస్తున్నారని అన్నారు. మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని చల్మేడ గ్రామంలో గురువారం జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ శ్రీనివాస్ తో కలసి చేపపిల్లలను చెరువులో వదిలారు. సోమాజి చెరువులో 73,500 చేపపిల్లలు, బ్రాహ్మండ్ల చెరువులో 93వేల చేప పిల్లలను వదిలినట్లు […]

Read More
సన్నాలకు గిట్టుబాటు ధర ప్రకటించాలే

సన్నాలకు గిట్టుబాటు ధర ప్రకటించాలే

సారథి న్యూస్, రామాయంపేట: రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లకు గిట్టుబాటు ధర కల్పించాలని బీజేపీ నిజాంపేట బీజేపీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ ​చేస్తూ స్థానిక తహసీల్దార్ జయరామ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్నవరికి రూ.2,500, పత్తికి రూ.8,000, అలాగే నీట మునిగిన పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వివరించారు. కార్యక్రమంలో […]

Read More