సారథి న్యూస్ : చార్మినార్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్‌అలీఖాన్ కుమార్తె సాహెబ్‌జాదీ బషీరున్నీసాబేగం(93) పురానీహవేలీ నిజాం మ్యూజియం ఆవరణంలోని ఉస్మాన్‌కాటేజ్ భవనంలో కన్నుమూశారు. ఏడో నిజాంకు 21 సంవత్సరాల వయసులో 1906 ఏప్రిల్ 14న ఆజం ఉన్నీసాబేగంతో వివాహమైంది. ఆయనకు మొత్తం 34 మంది సంతానం. ఆయన సంతానంలో ఇప్పటి వరకు జీవించి ఉన్నది ఈమె ఒక్కరే. బషీరున్నీసాబేగం 1927లో జన్మించారు. దక్కన్ హైదరాబాదీ సంస్కృతిని ప్రతిబింబించేలా నగలు ధరించేవారు. ఈమె భర్త నవాబ్ ఖాజీంయార్‌జంగ్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా నియంత్రణ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కరోనా కమ్యూనిటీ వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. శనివారం కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రి పాత భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆరేళ్లలో వారసత్వ కట్టడాల మరమ్మతులకు ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. కొత్త భవనం నిర్మాణానికి ఉస్మానియా ఆస్పత్రి వెనుక ఆరెకరాల విస్తీర్ణంలో స్థలం […]
సారథి న్యూస్, మెదక్: ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు పనులకు ఎట్టకేలకు గ్రహణం వీడింది. శంకుస్థాపన చేసిన ఐదేళ్ల తర్వాత ప్రధానమైన ఆనకట్ట ఎత్తు పెంపు పనులు మొదలయ్యాయి. ఏళ్ల తరబడి పెండింగ్ ఉండటంతో అసలు ఆనకట్ట ఎత్తు పెంపు పనులు జరుగుతాయా? లేదా? అన్న సందేహంలో ఉన్న వేలాది మంది ఆయకట్టు రైతులకు ఊరట కలిగినట్టయింది. ఆనకట్ట ఎత్తు పెరిగితే నీటి నిల్వ సామర్థ్యం పెరిగి అదనంగా ఐదువేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.నిజాం నవాబుల కాలంలో […]