ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగానే ఉంటున్నదని వైద్యశాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇప్పటివరకు భారత్‌లో 8 లక్షల మంది కోరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కాగా గత 24 గంటల్లో 49,310 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 12,87,945 లకు ఎగబాకింది. ఇప్పటివరకు 30,601 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 4,40,135 […]
ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 9,895 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,47,502కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో మహారాష్ట్రలో 12,854 మంది మృతిచెందారు. గత 24 గంటల్లోనే 298 మంది మృత్యువాత పడ్డారు. కాగా ఇప్పటివరకు 1,94, 253 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. కాగా దేశంలో ఇప్పటికే సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని కొందరు వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న మూడు, నాలుగు వారాల్లో వ్యాధి తీవ్రత మరిత పెరిగే […]
సారథిన్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో కరోనా అంతకంతకూ విస్తరిస్తున్నది. తాజాగా 13 కొత్తకేసులు నమోదైనట్టు డీఎంహెచ్‌వో సుధాకర్ లాల్ తెలిపారు. నాగర్‌కర్నూల్ పట్టణంలో ఇటీవల కరోనాతో మృతిచెందిన విలేకరి సోదరికి, అతని కోడలుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నాగర్‌కర్నూల్ మండలం పెద్దాపూర్‌కు చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో డయాలసిస్ చేయించుకుంటున్నది. తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లిలో మరో ముగ్గురికి కరోనా సోకింది. అచ్చంపేట పట్టణంలో నలుగురికి, బల్మూర్ మండలం […]
ఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 38,902 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో.. మొత్తం కేసుల సంఖ్య 10,77,618 కి చేరింది. ఒక్కరోజులో 38 వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కొత్తగా 543 మంది వైరస్ బాధితులు మృతి చెందడటంతో మొత్తం మరణాల సంఖ్య 26,816 కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటి వరకు భారత్‌లోని మొత్తం కరోనా రోగుల్లో 6.77 లక్షల మంది కోలుకున్నారు. […]
ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ భయంకరంగా పెరుగుతున్నది. కొత్తగా 34,000 కొత్తకేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 10,38,716 లకు చేరుకున్నది. కాగా ఇప్పటికే 26,273 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కాగా పట్టణప్రాంతాలతోపాటు గ్రామాలకు ఈ మహమ్మారి విస్తరించింది. రానున్నరోజుల్లో పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా 6,53,750 మంది కోలుకోవడం కొంత ఊరటనిచ్చే అంశమే. ప్రభుత్వాలు చేతులెత్తేసిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలే జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో రోజు రోజుకు విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 10 లక్షల మార్క్ దాటింది. 24 గంటల్లో 36,247 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,004,652కి చేరింది. ఒక్క రోజులో 690 మంది చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 25,594కి చేరింది. ఒక్కరోజులో ఇన్ని మరణాలు నమోదవ్వడం ఇదే. 10లక్షల కేసుల్లో 3,43,268 యాక్టివ్ కేసులు కాగా.. 6,35,790 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అమెరికాలో 3,648,250 […]
భోపాల్: కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో పెండ్లి వేడుకలకు కేవలం 20 మంది మాత్రమే హాజరకావాలని ఆదేశాలు జారీచేసింది. ఇంట్లో జరిగే పుట్టినరోజు తదితర వేడుకలకు 10 మంది మాత్రమే హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ ఆదేశాలను ఎవరు ఉల్లంఘించినా కఠినచర్యలు తీసుకుంటుమాని పేర్కొన్నది. రాష్ట్రంలో ఎటువంటి మతపరమైన కార్యక్రమాలు చేయకూడదని.. బహిరంగ ప్రదేశాల్లో 5 కంటే ఎక్కువమంది ఓకే చోట గుమికూడదని పేర్కొన్నది. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుతతరుణంలో […]
న్యూఢిల్లీ: కోవిడ్-19 కేసులసంఖ్య భారత్‌లో అంతకంతకూ పెరుగుతున్నది. కేవలం గత నాలుగు రోజుల్లేనే లక్షకేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఇప్పటివరకు మొత్తం కేసులసంఖ్య 8,49,553కు చేసింది. గత 24 గంటల్లో 28,637 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా బారిన పడి 22,674 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా శనివారం 2,80,151 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు ఐసీఎంఆర్ తెలిపింది.