సారథి,పెద్దశంకరంపేట: కరోనా నేపథ్యంలో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు రైతుబంధు పథకం ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులను జమచేయడంతో పెద్దశంకరంపేటలో సీఎం కేసీఆర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చిత్రపటాలకు మంగళవారం ప్రజాప్రతినిధులు, పలువురు రైతులు క్షీరాభిషేకం చేశారు. తెలంగాణలో 1.50 లక్షల ఎకరాలకు గాను 63.25లక్షల మంది రైతులకు రూ.7,058.78 కోట్లను వారి ఖాతాల్లో జమచేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, రైతుబంధు మండలాధ్యక్షుడు సురేష్ గౌడ్, వైస్ […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: కళ్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపిల్లలకు వరం లాంటిదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పెద్దశంకరంపేటలో 84 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులను బుధవారం ఆయన అందజేశారు. సీఎం కేసీఆర్కళ్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.1.16లక్షలు అందజేస్తున్నారని తెలిపారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థినిపై లక్షలు ఖర్చు చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రతిఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో మెదక్ డీపీవో తరుణ్ కుమార్, రైతుబంధు సంగారెడ్డి జిల్లా […]
సారథి న్యూస్, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు వాగులు, వంకలు మత్తడి దూకుతున్నాయి. చాలా గ్రామాల్లో పత్తి, మినుము, సోయా, కంది పంటలు నీటిమునిగిపోయాయి. పంట పొలాల్లో నిలిచిన నీటిని మళ్లించేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే కంగ్టి మండలంలోని చాప్టా(కే)గ్రామానికి చెందిన కొందరు రైతులు వ్యవసాయ పొలానికి వెళ్లేందుకు చందాలు వేసుకుని రూ.ఐదులక్షల వ్యయంతో ఫార్మేషన్ రోడ్డు నిర్మించుకున్నారు. సోమవారం కురిసిన జోరు వానకు బ్రిడ్జితో పాటు […]
నారాయణఖేడ్, సారథి న్యూస్: సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతు బంధు నిధులు విడుదల చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. మంగళవారం తన కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కంగ్టి ఎంపీపీ సంగీత వెంకట్ రెడ్డి, జడ్పీటీసీ లలిత ఆంజనేయులు, సర్పంచ్ పూజ కృష్ణ ముదిరాజ్ టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, నారాయణఖేడ్: సర్కార్ సబ్సిడీపై రైతులకు అందిస్తున్న సోయాబీన్ బస్తాలు కోసం గత శుక్రవారం కంగ్టిలో ఒకరికొకరు రైతులు తోసుకున్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో మాస్క్‌లు కట్టుకోకుండానే విత్తనాల కోసం వచ్చారు. ఈ విషయమై ‘సారథి’లో ‘నో మాస్క్.. నో డిస్టెన్స్’ శీర్షిక వచ్చిన వార్తా కథనానికి స్థానిక అధికారులు స్పందించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంతో పాటు తడ్కల్ గ్రామంలో వ్యవసాయ అధికారులు, పోలీస్ సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుని రైతులకు […]
సారథి న్యూస్, నారాయణఖేడ్: రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీని బలోపేతం చేద్దామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో చాప్టా(కే)గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా రాజనరసింహ మాట్లాడారు. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కార్యకర్తలు కృషిచేయాలని కోరారు.
సారథి న్యూస్, నారాయణఖేడ్: ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని ప్రభుత్వం పదేపదే చెబుతోంది.. హరితహారం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. కానీ కొందరు వ్యాపారులు, ఫారెస్ట్ ఆఫీసర్లు కుమ్మకై చెట్లను ఇష్టారీతిలో అడవులను నరికేస్తున్నారు. ప్రతిరోజూ లారీలు, ట్రాక్టర్లలో లోడ్ చేసి పొరుగు రాష్ట్రాలు దాటించేస్తున్నారు. కంగ్టి, కల్హేర్, మనూర్ ఉమ్మడి మండలంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా చెట్లను నరికివేస్తున్నారు. కంగ్టి మండలం నుంచి ప్రతిరోజు ఐదు నుంచి పది ట్రాక్టర్ల కలప అక్రమంగా […]