Breaking News

NAGARKURNOOL

అడవుల సంరక్షణ అందరి బాధ్యత

అడవుల రక్షణ అందరి బాధ్యత

సారథి, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ శివారులో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మియావాకి ప్లాంటేషన్ ను శుక్రవారం కలెక్టర్ ఎల్.శర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను పెంచేలా జపాన్‌ మియావాకీ పద్ధతిలో నాటడం ద్వారా పచ్చదనంతో వనం మాదిరిగా కనిపిస్తుందన్నారు. మున్సిపాలిటీల్లో తక్కువ స్థలంలోనే ఎక్కువ పచ్చదనానికి ఎంతో ఉపయుక్తమైన ఈ విధానంతో ప్రతి పట్టణ ప్రాంతంలో కనీసం ఒక ఎకరాలో నాటి చిట్టడవులను […]

Read More
రామాపురం వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ

రామాపురం వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ

రూ.3లక్షల విలువైన పంచలోహ విగ్రహాల అపహరణ సారథి, కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గుట్టపై వెలిసిన వేంకటేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.3లక్షల విలువ చేసే పంచలోహ విగ్రహాలను ఎత్తికెళ్లారు. వేంకటేశ్వర స్వామి, అలవేలు మంగమ్మ, పద్మావతి విగ్రహాలు చోరీకి గురైయ్యాయి. సుదర్శనచక్రం, స్వామి, మరో రెండు విగ్రహాలను ఎత్తికెళ్లారు. వాటి విలువ సుమారు రూ.రెండు లక్షల మేర ఉంటుందని పూజారి శివయ్యశర్మ తెలిపారు. […]

Read More
లానికి వెళ్లే దారిని మూసివేశారని..

పొలానికి వెళ్లే దారిని మూసివేశారని..

మాజీ ఎంపీటీసీ కుటుంబం ఆత్మహత్యాయత్నం సారథి, కొల్లాపూర్: తమ పొలానికి వెళ్లే దారిని మూసివేశారని మాజీ ఎంపీటీసీ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంగళవారం ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం జనంపల్లిలో కలకలం రేపింది. బాధితులు, గ్రామస్తుల కథనం.. మాజీ ఎంపీటీసీ సభ్యురాలు సాలమ్మ కుటుంబం 30 ఏళ్లుగా పొలానికి వెళ్తున్న దారిని పల్లెప్రకృతి వనాన్ని నిర్మించేందుకు గాను మూసివేశారు. దారి లేకపోవడంతో రాకపోకలకు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్, పంచాయతీ […]

Read More
విద్యావలంటీర్లకు అండగా ఉంటాం

విద్యావలంటీర్లకు అండగా ఉంటాం

బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు సారథి, కొల్లాపూర్: రాష్ట్ర ప్రభుత్వం చేతిలో దగాపడ్డ విద్యా వలంటీర్లకు అండగా ఉంటామని బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎల్లేని సుధాకర్ రావు భరోసా ఇచ్చారు. నాగ్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో గురువారం జరిగిన ‘దగాపడ్డ విద్యావలంటీర్లకు చేయూత’ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో వారి బతుకులు చితికిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. వారి న్యాయమైన డిమాండ్ల […]

Read More
మైత్ర సోలార్ ప్లాంటులో చోరీ

మైత్ర సోలార్ ప్లాంటులో చోరీ

రూ.6లక్షల విలువైన కాపర్ కేబుల్ చోరీ నాగర్ కర్నూల్ పోలీసులకు ఫిర్యాదు సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ మండలం పులిజాల గ్రామంలోని మైత్ర సోలార్ ప్లాంట్ లో చోరీ జరిగింది. ప్లాంట్ లోని సోలార్ ప్యానల్ బోర్డులకు అమర్చే కాపర్ కేబుల్ ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారు. ఈ మేరకు స్టార్ క్యూ బెక్స్ కంపెనీ బాధ్యులు చిలక పూర్ణచంద్రారెడ్డి ఆదివారం నాగర్ కర్నూల్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. తమ కంపెనీ ఆధ్వర్యంలో 13మంది సెక్యూరిటీ, సూపర్ […]

Read More
పర్యావరణాన్ని కాపాడుకుందాం

పర్యావరణాన్ని కాపాడుకుందాం

సారథి, బిజినేపల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం నాగర్ కర్నూల్ జిల్లా పాలెం జిల్లా వైద్యాశాఖ కార్యాలయ ఆవరణలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్యశాఖ అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. వాతావరణ సమతుల్యతను కాపాడాలన్నారు. ఖాళీప్రదేశాల్లో మొక్కలు నాటాలని కోరారు. మనుషుల మనుగడ ప్రకృతితో ముడిపడి ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ బి.కృష్ణయ్య, హెల్త్ సూపర్ వైజర్ […]

Read More
మార్కండేయ లిఫ్ట్ కు పరిపాలన అనుమతులు

మార్కండేయ లిఫ్ట్ కు పరిపాలన అనుమతులు

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హర్షం సారథి ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని ఐదు గ్రామాలు, 17 గిరిజన తండాలకు సాగునీరు అందించే మార్కండేయ లిఫ్ట్ నిర్మాణానికి రూ.76.92 కోట్ల నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో నం.211 విడుదల చేసింది. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. బిజినేపల్లి మండలంలోని గంగారం, సాయిన్ పల్లి, మమ్మాయిపల్లి, సాయిన్ […]

Read More
మెడికల్ కాలేజీ ఏర్పాటుపై హ‌ర్షం

మెడికల్ కాలేజీ మంజూరుపై హ‌ర్షం

సారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లాలో మెడికల్ కాలేజీ మంజూరుపై బిజినేపల్లి మండలవాసులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కళాశాల మంజూరు చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుర్మయ్య, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, సహకార సంఘం చైర్మన్ బాల్ రాజ్ గౌడ్, రైతు సంఘం మండలాధ్యక్షుడు మహేష్ […]

Read More