Breaking News

MUMBAI

పోలీసులపై అమృత ఫైర్​

ముంబై పోలీసులపై అమృత ఫైర్​

ముంబై: ముంబై పోలీసులపై మహారాష్ట్ర మాజీసీఎం ఫడ్నవీస్​ సతీమణి అమృత ఫడ్నవీస్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ముంబై నగరం మానవత్వాన్ని కోల్పోయింది. ఇక్కడి పోలీసుల తీరు బాధ్యతారాహిత్యాన్ని తలపిస్తుంది. వీరంతా నిజానిజాలను పక్కనపెట్టి అధికారంలో ఉన్నవారికి కొమ్ము కాస్తున్నారు. పోలీసుల వ్యవహారశైలితో ముంబైలో బతకడం అంత సురక్షితం కాదేమో అనిపిస్తుంది’ అంటూ ఆమె ట్వీట్​ చేశారు. సుశాంత్​ కేసులో మహారాష్ట్ర, బీహార్​ పోలీసుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న ప్రస్తుత తరుణంలో అమృత వ్యాఖ్యాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. […]

Read More
కరోనాను జయించిన బిగ్​బీ

కరోనాను జయించిన బిగ్​బీ

ముంబై: కరోనా మహమ్మారి నుంచి ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కోలుకున్నారు. ఇటీవల చేసిన కరోనా పరీక్షల్లో బిగ్‌బీ అమితాబ్‌కు కరోనా నెగిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన జులై 11న ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి కుదుటపడడంతో ఆదివారం డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు అమితాబ్ కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. కానీ అభిషేక్‌ మాత్రం ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు.

Read More
తనూశ్రీ దత్తా హాట్​ కామెంట్స్​

సుశాంత్​ కేసు.. బాలీవుడ్​ బ్యూటీ ఫైర్​

ముంబై: సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య బాలీవుడ్​లో తీవ్ర దుమారం సృష్టిస్తున్నది. ఇప్పటికే బాలీవుడ్​లోని నెపోటిజంపై పలువురు సీనీ నటులు, ప్రముఖులు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్​ అందాల భామ తనూశ్రీ దత్తా సుశాంత్​ కేసుపై స్పందించారు. ముంబై పోలీసులు సుశాంత్​ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారేమోనని తనకు అనుమానంగా ఉన్నదని ఆమె పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించడమే ఉత్తమమని ఆమె వ్యాఖ్యానించారు. ముంబై పోలీసులను పూర్తిగా నమ్మలేమని ఆమె వ్యాఖ్యానించారు. వారు రాజకీయనాయకుల […]

Read More
ఫేక్​ మాస్కుల గుట్టురట్టు

నకిలీ మాస్కుల దందా గుట్టురట్టు

ముంబై: కరోనా నేపథ్యంలో మాస్కులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో కొందరు అక్రమార్కులు ఎన్​95 మాస్కులంటూ నకిలీవి తయారు చేసి ప్రజలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా అటువంటి నకిలీ మాస్కుల రాకెట్​ను ముంబై పోలీసులు ఛేదించారు. రూ.21.39 లక్షల మాస్కులను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని భీవాండికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ నుంచి భారీ ఎత్తున నకీలీ మాస్కులను తీసుకొచ్చాడు. అనంతరం వాటిని ముంబై, థానేలోని పలు మెడికల్​ షాపుల్లో విక్రయించాడు. పోలీసులకు ఫిర్యాదుల అందడంలో […]

Read More
ముంబైలో కరోనా తగ్గుముఖం

ముంబైలో కరోనా తగ్గుముఖం

ముంబై: దేశ ఆర్థికరాజధాని ముంబైలో కరోనా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కేవలం 700 కేసులు మాత్రమే నమోదయ్యాయి. గత మూడు నెలల నుంచి ఇంత తక్కువస్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. ‘ఇది చాలా సంతోషిదగ్గ విషయం. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగానే ఉండాలి, మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. అదేసమయంలో భౌతికదూరం పాటించాలి’ అంటూ ఆ రాష్ట్ర మంత్రి ఆధిత్యథాక్రే ట్వీట్​ చేశారు.

Read More

సిలబస్​లో 25 శాతం కోత

ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. ఆ రాష్ట్రంలోని 1 నుంచి 12 వ తరగతి వరకు 25 శాతం వరకు సిలబస్​ను తగ్గించనున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర స్టేట్​ కౌన్సిల్​ ఫర్​ ఎడ్యుకేషనల్​ రీసెర్చ్​ అండ్​ ట్రైనింగ్​ (ఎంఎస్​సీఈఆర్టీ) ఆమోదం తెలిపింది. 2020​-21 విద్యాసంవత్సరంలో సిలబస్​ కోతను విధించనున్నట్టు ఆ రాష్ట్ర మంత్రి వర్షా గైక్వాడ్​ తెలిపారు. కరోనా వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కాగా ఇప్పటికే 9 నుంచి 12 […]

Read More
మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులు

మహారాష్ట్రలో 9వేల కొత్తకేసులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 9,895 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,47,502కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో మహారాష్ట్రలో 12,854 మంది మృతిచెందారు. గత 24 గంటల్లోనే 298 మంది మృత్యువాత పడ్డారు. కాగా ఇప్పటివరకు 1,94, 253 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. కాగా దేశంలో ఇప్పటికే సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని కొందరు వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న మూడు, నాలుగు వారాల్లో వ్యాధి తీవ్రత మరిత పెరిగే […]

Read More

12వేలకు చేరిన మృతులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. గత 24 గంటల్లో 176 మంది కరోనాతో మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 12,030కి చేరింది. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 3,18,695 మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో 8,240 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,75,029 మంది కోలుకున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. దేశంలో అత్యధిక కేసులో మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.

Read More