సారథి న్యూస్, రామడుగు: పండ్ల తోటల్లో అధిక సాంద్రత, వాటి ఉపయోగాలు అనే అంశంపై ఆత్మ సౌజన్యంతో రైతులకు సిద్దిపేట జిల్లా ములుగు సెంటర్ లో మంగళవారం విజ్ఞానయాత్ర నిర్వహించారు. రామడుగు, చొప్పదండి మండల లకు చెందిన రైతులు ఈ పర్యటనలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారులు రోహిత్, అర్చన వివిధ మండలాల నుంచి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సారథి న్యూస్, ములుగు: జిల్లాలో మార్చి1వ తేదీ(సోమవారం) నుంచి రెండవ విడత కరోనా వాక్సినేషన్ ప్రారంభమవుతుందని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్య తెలిపారు. ఆదివారం ఆయన సంబంధిత అధికారులు, వైద్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్వేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు వైద్యుల ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలని కోరారు. ఆన్లైన్లో తమ పేరును cowin. gov. in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శ్యాంసుందర్, డీఎంహెచ్‌వో, […]
సారథి న్యూస్, తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సోమవారం నుంచి సమ్కక్క, సారలమ్మ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు వనదేవతల పూజారులు వెల్లడించారు. కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మార్చి 1 నుంచి 21వ తేదీ వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టంచేశారు.
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చీకుపల్లి గ్రామపంచాయతీలో శుక్రవారం సుమారు 189 దోమ తెరలను పంపిణీ చేశామని డాక్టర్ యమున తెలిపారు. మలేరియా రాకుండా గ్రామంలో దోమల మందు చల్లినట్లు తెలిపారు. క్రమంలో సబ్ యూనిటీ అధికారి శరత్ బాబు,హెల్త్ పర్యవేక్షకుడు కోటిరెడ్డి, ఏఎన్ఎం నాగేంద్ర కుమారి, సెక్రటరీ శిరీష, ఆశా కార్యకర్త. అంగన్వాడీ టీచర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, ములుగు: ఎమ్మెల్సీ ఎన్నికల డ్యూటీని తమకు కేటాయించిన అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా నిర్వర్తించాలని జిల్లా రెవెన్యూ అధికారి రమాదేవి సూచించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. విధుల పట్ల ఏవైనా అనుమానాలు తలెత్తితే నివృత్తి చేసుకోవాలని సూచించారు. మార్చి 2న పీవో, ఏపీవోలకు మొదటి విడత, 9న రెండో విడత శిక్షణ ఉంటుందని తెలిపారు. ఎన్నికల పోలింగ్ లో […]
సారథి న్యూస్, వెంకటాపురం: ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండలంలోని పామునూరు అటవీప్రాంతంలో మంగళవారం పేలుడు సామగ్రిని అమర్చుతూ కనిపించిన ఏడుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సంగ్రామ్జీ పాటిల్వెల్లడించారు. వారి నుంచి మందుగుండు సామగ్రి, టిఫిన్ బాక్స్ లు, వైర్, బ్లేడ్ లు, కత్తులు, గొడ్డళ్లు, బాణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని దులాపురం అటవీప్రాంతంలో ఓ చిరుత పులి హల్ చల్ చేసింది. సోమవారం ఉదయం కొంగాల గ్రామానికి చెందిన కొందరు ఇల్లు కప్పేందుకు గుట్ట గడ్డి కోసం దులాపురానికి సుమారు 3.కి.మీ. దూరంలో ఉన్న మాసెలొద్ది గుట్టకు వెళ్లారు. వారంతా గడ్డి కోస్తున్న సమయంలో ఏవో పెద్ద పెద్ద అరుపులు వినిపించడంతో భయాందోళనకు గురయ్యారు. అరుపులు వింటూ అటుగా వెళ్లగా, ఎండిన పెద్దచెట్టుపై చిరుత పులిని చూసి ఉలిక్కిపడ్డారు. […]
సారథి న్యూస్, వెంకటాపురం: నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండల కేంద్రంలోని కుమ్మరివీధికి చెందిన పూసం యశ్వంత్(20) అనే యువకుడి డెడ్‌బాడీ గురువారం పాలెం ప్రాజెక్టులో లభ్యమైంది. గ్రామస్తుల కథనం మేరకు.. పూసం యశ్వంత్ నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో వారంతా వేరే బంధువుల ఇంటికి వెళ్లి ఉండొచ్చని భావించి ఆరా తీయలేదు. రెండురోజులైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఇంటి సభ్యులు […]