Breaking News

MGM

వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ కరోనా

వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ కరోనా

సామాజిక సారథి, వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. అనేక మంది సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ బత్తుల శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం శ్రీనివాస్ హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. సూపరింటెండెంట్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

Read More

ఎంజీఎం ఆస్పత్రి.. ఉద్విగ్నం.. ఉత్కంఠ

చెన్నై: ప్రముఖగాయకుడు, గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉన్నదని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తాజాగా హెల్త్​బులెటిన్​ను విడుదల చేశాయి. దీంతో ప్రస్తుతం ఎంజీఎం వద్ద తీవ్ర ఉద్విగ్న వాతావరణం నెలకొని ఉన్నది. గురువారం సాయంత్రం నుంచి ఎస్పీ బాలూ ఆరోగ్యం తీవ్రంగా విషమించిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తెలుగు ప్రజలు, బాలూ అభిమానులు తీవ్ర ఆందోళనగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎంజీఎం దవాఖాన పరిసరాలు మాత్రం కోలాహలంగా మారాయి. ఎంజీఎంకు వెళ్లే దారులన్నీ బాలూ […]

Read More
కోలుకుంటున్న బాలు

కోలుకుంటున్న బాలసుబ్రహ్మణ్యం

చెన్నై: కరోనాతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా ఆయనకు ఇంకా వెంటిలేటర్​పైనే చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ బాలుకయ్యే వైద్య ఖర్చులను తమిళనాడు ప్రభుత్వమే భరిస్తుందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌ ప్రకటించారు. బాలూ.. తొందరగా రా..బాలు ఆరోగ్యం విషమించినట్లు తెలియగానే మాస్ట్రో ఇళయరాజా కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. […]

Read More
సూపరింటెండెంట్​ రాజీనామా

ఎంజీఎం సూపరింటెండెంట్​ రాజీనామా

సారథిన్యూస్​, వరంగల్​: ఉమ్మడి వరంగల్​ జిల్లాలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖాన అయిన ఎంజీఎం సూపరింటెండెంట్​ డాక్టర్​ శ్రీనివాసరావు రాజీనామా చేశారు. తాను కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నానని అందుకే రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు. కాగా ఈ విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా నేపథ్యంలో జరిగిన పరిణామాల వల్లే అతడు రాజీనామా చేసినట్టు సమాచారం. తెలంగాణలోని పలువురు వైద్యులు కరోనా పరిణామాలతో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల జూనియర్​ డాక్టర్లు ధర్నాలు చేసిన విషయం తెలిసిందే. […]

Read More

కరోనా లక్షణాలతో యువతి మృతి

సారథి న్యూస్, వరంగల్ రూరల్: కరీంనగర్​ జిల్లా చెన్నరావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన ఓ యువతి కరోనా లక్షణాలతో మృతిచెందింది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న సదురు యువతిని గురువారం తల్లిదండ్రలు వరంగల్​లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె నుంచి శాంపిల్స్​ సేకరించే లోపే మృతిచెందిందని వైద్యులు తెలిపారు. కాగా పాపయ్యపేటలో యువతి అంత్యక్రియల్లో పాల్గొన్నవారిని హోంక్వారంటైన్​లో ఉంచారు. గ్రామస్థులంతా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అధికారులు కోరుతున్నారు.

Read More