సారథి న్యూస్, రామయంపేట: గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్లను ఏర్పాటుచేసినట్లు ప్రోగ్రాం ఆఫీసర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మెదక్‌జిల్లా నిజాంపేట మండలంలోని చల్మేడ గ్రామంలో బాలవికాస, ప్రాంక్లిన్ టెంపుల్ టెన్ సంస్థల సహకారంతో ఏర్పాటుచేసిన వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. సర్పంచ్ నరసింహరెడ్డి, ఉపసర్పంచ్ రమేశ్, ఎంపీటీసీ బాల్ రెడ్డి పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామాయంపేట: రైతులు తాము పండించిన పంటలను అరబెట్టుకోవాడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రైతుల కష్టాలను తెలుసుకున్న ప్రభుత్వం స్వయంగా కల్లాలను నిర్మించేందుకు ఉపాధిహామీ నిధులు మంజూరు చేశారు. కల్లాల నిర్మాణం కోసం మెదక్ జిల్లాకు 22.7 కోట్లు నిధులను కేటాయించారు. జిల్లాలోని 20 మండలాల్లో కల్లాలను నిర్మించనున్నారు.కల్లాల నిర్మాణానికి వీళ్లు అర్హులుపంట నూర్పిడి కల్లాల నిర్మాణం కోసం చిన్న, సన్నకారు రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు అర్హులు. వీరిలో ఎస్సీ, ఎస్టీ […]
సారథి న్యూస్, మెదక్: జిల్లాలో ఎక్కడైన రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే సంబంధిత వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదుచేస్తామని మెదక్ కలెక్టర్ ఎం.ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో మాట్లాడుతూ రైతులు వ్యయప్రయాసాలకోర్చి పంటలు పండించే అన్నదాతలకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే కొందరు బ్లాక్‌లో విత్తనాలు అమ్ముతున్నారని వారిపై సంబంధిత శాఖ అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా నకిలీ విత్తనాలు […]
సారథి న్యూస్, మెదక్: జిల్లాలో ఎక్కడైన రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే సంబంధిత వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదుచేస్తామని మెదక్ కలెక్టర్ ఎం.ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో మాట్లాడుతూ రైతులు వ్యయప్రయాసాలకోర్చి పంటలు పండించే అన్నదాతలకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే కొందరు బ్లాక్‌లో విత్తనాలు అమ్ముతున్నారని వారిపై సంబంధిత శాఖ అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా నకిలీ విత్తనాలు […]
సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలోని వివేకానంద యువజనసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పార్కుకు శుక్రవారం సర్పంచ్ బాల్ నర్సవ్వ, ఎంపీపీ సిద్ధరాములు శంకుస్థాపన చేశారు. పార్కు లోపల ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి, వార్డు మెంబర్లు, వివేకానంద యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు.
సారథి న్యూస్, రామాయంపేట: రాష్ట్రప్రభుత్వం పారిశుద్ధ్యానికే అధిక ప్రాధాన్యమిస్తున్నదని రామాయంపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతిగ్రామంలో డంపింగ్ యార్డులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఆయన మెదక్ డీపీవో హనోక్ తో కలసి నిజాంపేట మండలం చల్మేడ గ్రామంలో డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి దగ్గరే తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ నరసింహ రెడ్డి, ఎంపీపీ […]
సారథి న్యూస్, రామాయంపేట: కూలీలుగా ఉన్న దళితులు రైతులుగా ఎదగాలని, ఆత్మగౌరవంతో జీవించాలని దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (డీబీఆర్సీ) రాష్ట్ర సమన్వయ కర్త పీ శంకర్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడలో దళిత మహిళా రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం పంపిణీ చేసిన మూడెకరాలు తీసుకున్న దళితులు ఆహార పంటలను పండించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో డీబీఅర్సీ మెదక్ జిల్లా కో ఆర్డినేటర్ దుబాషి సంజీవ్, పరశురాములు, దేవరాజు, స్వామి, […]
సారథి న్యూస్, మెదక్: ఉపాధి హామీ పథకంపై జిల్లా అధికారులు ప్రత్యేకశ్రద్ధ చూపాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో నీటి పారుదల, జిల్లా గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ఎన్ని చెరువులు, ఫీడర్ చానెళ్లు, తూములు, వాటర్ ట్యాంకులు ఉన్నాయో వెంటనే వివరాలు సేకరించాలని సూచించారు. నీటిపారుదల శాఖ అధికారులతో […]