సారథి న్యూస్, మెదక్: వానాకాలం వరి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలూ అందుకు అనుగుణంగా ముందుగానే ప్రణాళికలు సిద్ధంచేసుకోవాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. సోమవారం ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్లో వర్షాలు ఎక్కువగా కురవడంతో జిల్లావ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో వరిని సాగుచేశారని వివరించారు. అంచనా ప్రకారం మూడున్నర లక్షల టన్నుల ధాన్యం పండుతుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, డీఆర్డీఏ, […]
సారథిన్యూస్, రామాయంపేట: రైతులు సేంద్రియ పద్ధతులతో సాగుచేసి పర్యావరణాన్ని సంరక్షించాలని నిజాంపేట వ్యవసాయాధికారి సతీశ్ సూచించారు. సోమవారం మెదక్ జిల్లా నిజాంపేటలోని సబ్ మార్కెట్ యార్డులో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆద్వర్యంలో దళిత రైతులకు అవగహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సతీశ్ మాట్లాడుతూ.. యువతకు, పిల్లలకు వ్యవసాయంపై అవగహన పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పీ శంకర్, డీబీఆర్సీ జిల్లా కోఆర్డినేటర్ దుబాషి సంజీవ్, ఏఈవో గణేశ్, […]
చేతికొచ్చిన పంట కీటకాల పాలు లబోదిబోమంటున్న మెదక్ జిల్లా రైతులు ‘ పదేళ్లుగా ఎన్నడూ లేనివిధంగా ఈసారి అవేవో మిడతలు కొత్తగా వచ్చాయి. పంటలను పూర్తిగా నాశనం చేస్తున్నాయి. అవి ఎలా పోతాయేమో.. వరి పంటపై కింది భాగాన, ఆకులపైన కొరికి వేస్తున్నాయి. దీంతో కష్టపడి సాగుచేసిన పంటంతా నేలపాలవుతోంది. పెట్టుబడి కూడా చేతికి రాదేమో..’ అని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేయడం పరిస్థితికి అద్దంపడుతోంది. సారథి న్యూస్, నర్సాపూర్: ఆరుగాలం శ్రమించి పండించిన పైరు […]
దోపిడే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది ఉత్సవ విగ్రహంలా వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క ధ్వజం సారథి న్యూస్, మెదక్: సీఎం కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి దోపిడే ధ్యేయంగా పనిచేస్తోందని సీఎల్పీ లీడర్మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం ఆయన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి మెదక్ప్రభుత్వాసుపత్రిని సందర్శించి కరోనా రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విపత్తు సమయంలో సర్వ […]
సారథిన్యూస్, రామాయంపేట: గ్రామాల్లో అభివృద్ధి పనులు నిరాటంకంగా కొనసాగించాలని మెదక్ జిల్లా ఇంచార్జి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో పర్యటించారు. ఈ గ్రామానికి సీఎం కేసీఆర్ ఓఎస్డీ ( ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) రాజశేఖర్‌రెడ్డి రూ. 1.64 కోట్లు మంజూరు చేయించారు. ధర్మారం రాజశేఖర్‌రెడ్డి స్వగ్రామ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో గ్రామంలో […]
సారథి న్యూస్, మెదక్: రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలంలో 146 మందికి, మనోహరాబాద్ మండలంలో 54 మంది కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల సదుపాయాలు ఉన్నాయని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి గర్భిణి ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకోవాలన్నారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే కరోనా పరీక్షలు […]
సారథి న్యూస్, మెదక్: ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతు చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా రోడ్ల పరిస్థితిపై హైదరాబాద్ లోని ఎంసీహెచ్ఆర్డీలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ కోతకు గురయ్యాయన్నారు. ఆర్అండ్ బీ అధికారులు అప్రమత్తంగా ఉండి మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. యుద్ధప్రాతిపదికన, శాశ్వత ప్రాతిపదికన చేయాల్సిన పనులను గుర్తించాలన్నారు. జీవోనం.2 కింద మరమ్మతు పనులు తక్షణమే చేపట్టాలని […]
సారథి న్యూస్, మెదక్: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ తమవంతు బాధ్యతగా కృషిచేయాలని, ఇళ్లు, మండపాల వద్ద మట్టితో తయారుచేసిన ప్రతిమలను ప్రతిష్టించాలని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ సూచించారు. మట్టితో తయారుచేసిన వినాయక ప్రతిమలను శుక్రవారం మెదక్ మున్సిపల్ ఆఫీసులో చైర్మన్ చంద్రపాల్ తో కలిసి పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించుకోవాలని సూచించారు. సామూహిక పూజలు, ప్రార్థనలు, ఊరేగింపుల వల్ల కరోనా వైరస్ మరింత వ్యాప్తి […]