సారథిన్యూస్, మహబూబాబాద్: ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలను ఉచితంగా చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వమే తన ఆధీనంలోకి తీసుకోవాలని సూచించారు. కరోనా టెస్టుల విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు. కరోనా టెస్టుల్లో ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం ఆయన మహబూబాబాద్‌లోని పెరుమాండ్ల భవన్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంటింటికి కరోనా టెస్టులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. […]
సారథిన్యూస్, మహబూబాబాద్: పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్ హెచ్చరించారు. ఆదివారం మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇల్లందు బై పాస్ రోడ్ లో కలెక్టర్ పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మురికి కాల్వల్లో చెత్తను ఏరోజుకారోజు తొలగించాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ సూచించినట్టుగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలపాటు నిలువ ఉన్న నీటిని తొలగించాలని ఆదేశించారు. పట్టణంలోని పలు టైర్ల షాపులను పరిశీలించారు. అక్కడ నీరు […]
సారథిన్యూస్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో కలెక్టర్ గౌతమ్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. అటవీ ప్రాంతంలో పర్యటించి సోలార్ బోర్వెల్ పాయింట్స్, ప్లాంటేషన్ పనులకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. బయ్యారం మండల కేంద్రంలో పలు చోట్ల నీటినిల్వలు ఉండటం పట్ల పారిశుద్ధ కార్మికులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సారథి న్యూస్, మహబూబాబాద్: మహబూబాబాద్ నియోజకవర్గ పట్టణంలోని జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, మహబూబాబాద్ ఎంపీ కవిత మలోత్ కవిత మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్, కేజీబీవీ స్కూలు, ఎస్పీ ఆఫీసు పనులను పరిశీలించారు. పనులు క్వాలిటీగా ఉండాలని సూచించారు. వారి వెంట జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, జడ్పీ చైర్పర్సన్ ఆంగోతు బిందు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
సారథి న్యూస్, మహబూబాబాద్: పారిశుద్ధ్య పనులకు ప్రజలు సహకరించాలని రాష్ట్ర గిరిజన, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ కోరారు. సోమవారం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 34 ,19 వార్డుల్లో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను ఆమె స్వయంగా పర్యటించి పరిశీలించారు. ప్రతి ఆదివారం ఉదయం 10:10 గంటలకు ప్రతి ఇంట్లో పారిశుద్ధ్య పనులను చేపట్టి.. వృథాగా ఉన్న వస్తువులు తొలగించాలని సూచించారు. మహబూబాబాద్ మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దే కార్యంలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆమె వెంట […]
సారథి న్యూస్, మహబూబాబాద్: మంచి నీటిని చౌర్యం చేస్తే కేసులు పెట్టాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని గార్ల మండలం సీతంపేటలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. గ్రామస్తులు తాగునీటి కష్టాలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. తక్షణమే సర్పంచ్‌లతో మీటింగ్ పెట్టి ఏర్పాటు చేయాలని గార్ల ఎంపీడీవో ఆదేశించారు. ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, ఇంకుడుగుంతలు తవ్వుకోవాలని సూచించారు. డంపింగ్ యార్డును కంప్లీట్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈవో […]
సారథి న్యూస్, మహబూబాబాద్: గృహమే కదా స్వర్గసీమ! అన్న పెద్దలమాటను ఆచరించి ప్రతిఒక్కరూ తమ ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సీజనల్ వ్యాధుల బారినపడకుండా క్షేమంగా ఉండాలని మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గిరిజన సంక్షేమ, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఇంట్లోని కిచెన్, హాల్, కిటికీలు, ఫ్రిజ్, ఆవరణలోని వరండాలను ఆమె శుభ్రంచేశారు. మంత్రి కేటీఆర్ పిలుపుతో తాను కూడా […]