సారథి న్యూస్, అనంతపురం: ఏపీలోని అనంతపురం నగరంలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేద్దామని జిల్లా ఎస్పీ భూసారపు సత్యఏసుబాబు చెప్పారు. శనివారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వృద్ధులు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు, మందులు దుకాణాలు, తోపుడు బండ్ల వ్యాపారం చేయకూడదన్నారు. పాతఊరు తిలక్ రోడ్డు, గాంధీబజార్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లోని దుకాణాల వద్ద జనం గుమిగూడకుండా దృష్టిపెట్టాలన్నారు. దుకాణాల […]
సారథి న్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చెరుకుపల్లి పంచాయతీ తుమ్మలనగర్ లో స్నేహ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో సుమారు 30 మంది ఆదివాసీ పేద కుటుంబాలకు టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో మాస్క్ లు, నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు కలగకూడదనే సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు.
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో వైద్యులు, పోలీసులతో పాటు పారిశుద్ధ్య కార్మికులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కొనియాడారు. శుక్రవారం మే డే సందర్భంగా తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో వారితో కలిసి సహపంక్తి భోజనం ఏర్పాటుచేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 15 రోజులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ బాబురావు వారి మిత్రబృందం మున్సిపల్ కార్మికులకు అన్నదానం నిర్వహించడంతో అభినందించారు. కరోనా కట్టడికి […]
–గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆంక్షల సడలింపు –విమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాలు నిషేధం విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు బంద్ సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మే17 వరకు మరోసారి లాక్ డౌన్ ను పొడగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లో రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లను గుర్తించి వాటిపై ఆంక్షలను సడలించింది. దేశంలో విమానాలు, రైళ్లు, రాష్ట్రాల మధ్య […]
సారథి న్యూస్, మహబూబ్ నగర్ :లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పలు రంగాల కార్మికులు పనులు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకటరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే వీలుందని, పట్టణాల్లో వీటికి ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టం చేశారు. వాటిల్లో ఇటుక బట్టీలు, చేనేత, స్టోన్ క్రషింగ్, బీడీ తయారీ, ఇసుక మైనింగ్, సెరామిక్ టైల్స్, రూఫ్ […]
సారథి న్యూస్, రంగారెడ్డి: లాక్ డౌన్ సమయంలో పేదలకు ఆకలి తీర్చడంలోనే అసలైన సంతోషం ఉంటుందని శ్రీగాబ్రీయేల్ స్కూలు, న్యూటన్ గ్రీన్ ప్లే స్కూల్ విద్యాసంస్థల చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి అన్నారు. సోమవారం టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ జెండాను ఎగరవేశారు. అనంతరం హయత్ నగర్, మన్సురాబాద్ డివిజన్ లో ప్రింట్, అండ్ ఎలక్ర్టానిక్ మీడియా విలేకరులకు బియ్యం, నిత్యావసర సరుకులను […]
సారథి న్యూస్, చేవెళ్ల: అండర్ గ్రైండ్ డ్రైనేజీ పనులను చేవెళ్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ శైలజా ఆగిరెడ్డి అన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయిస్తామన్నారు. చేవెళ్ల పంచాయతీ పరిధిలోని రంగారెడ్డి కాలనీ వాసులకు ఇబ్బంది పడుతున్నారని తెలిసి, కరోనా లాక్ డౌన్ ఉన్నప్పటికీ స్థానికులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
సారథి న్యూస్, అనంతపురం: కరోనా విజృంభిస్తున్న వేళ.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో ఎవరికివారు ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఎవరివారు తమ సొంత పనులను చక్కబెట్టుకుంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీమంత్రి పరిటాల సునీత చీనీ, బత్తాయి పండ్లను కోస్తూ తోటలో ఇలా కనిపించారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలోని నరసంపల్లి గ్రామ సమీపంలో పరిటాల […]