సారథి న్యూస్, రామాయంపేట: మూడు దశాబ్ధాలుగా లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్, మానవతా సంస్థల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న రామాయంపేటకు చెందిన ఏలేటి రాజశేఖర్‌రెడ్డికి న్యాయ శాస్త్రం లో డాక్టరేట్ లభించింది. సామాజిక శాస్త్రంలో, న్యాయశాస్త్రంలో పట్టబద్రుడైన ఆయన హైదరాబాద్‌లోని కేవీ రంగారెడ్డి కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జైపాల్‌రెడ్డి, రాజస్థాన్‌లోని జగదీశ్ ప్రసాద్ జబర్ మెన్ టెబ్రివాల యూనివర్సిటీ (జేజేటీయూ) అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయమాల పర్యవేక్షణలో ‘ఏ స్టడీ ఆన్ ఎన్విరాన్మెంటల్ లాస్ […]
సారథిన్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆదివారం లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గుగ్గిళ్ల రవీంద్రాచారి మాట్లాడుతూ.. కరోనా, లాక్‌డౌన్‌తో ప్రైవేట్ టీచర్ల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. అందుకే వారికి తమవంతుగా ఈ సాయం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి భిక్షపతి, కోశాధికారి గుండా రాజు, సభ్యులు శరత్ బాబు, డాక్టర్ వెంకటేశ్వర్లు, భేణిగోపాల్ త్రివేది, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, చొప్పదండి: కరోనా నేపథ్యంలో లయన్స్‌క్లబ్ విశేషసేవలందిస్తున్నది. శుక్రవారం కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గకేంద్రంలో లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో బ్యాంక్ అధికారులకు, సిబ్బందికి మాస్కులు పంపిణీచేశారు. కరోనాను రూపుమాపేందుకు ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని, సామాజికదూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తొడుపునూరి లక్ష్మయ్య, ఒల్లల కృష్ణాహరి, వైస్ ప్రెసిడెంట్ కొల్లూరి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.