Breaking News

KHAMMAM

ఆర్థికరంగాన్ని పరుగులు పెట్టించారు

ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించారు

సారథి న్యూస్​, ఖమ్మం: బహుభాషా కోవిదుడు, సరళీకరణ ఆర్థిక విధానాలు, లుక్ ఈస్ట్ పాలసీతో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి ఎనలేని సేవచేశారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. కష్టకాలంలో ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టి ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించారని గుర్తుచేశారు. ఆదివారం పీవీ శతజయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి సేవలను కొనియాడారు.

Read More

ఇంటింటికీ మొక్కలు పంపిణీ

సారథి న్యూస్​, ములుగు: వెంకటాపురం మండలంలోని మరికాల గ్రామంలో ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మంగళవారం పర్యటించారు. హరితహారంలో భాగంగా మరికాల పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. గ్రామంలోని ప్రతి ఇంటికి పూలు, పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని డంపింగ్ యార్డ్ పనులు, రైతు వేదిక పనులు పరిశీలించారు. ఆయన వెంట నుగూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బుచ్చయ్య, జడ్పీటీసీ రమణ, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో అనురాధ ఉన్నారు.

Read More

ఫైరింగ్​లో ట్రైనింగ్​

సారథి న్యూస్​, ఖమ్మం: మానసికంగా, శారీరకంగా దృఢత్వం కలిగి ఉన్నప్పుడే లక్ష్యాన్ని సులభంగా చేధించవచ్చని పోలీస్ కమిషనర్ తప్సీర్ ఇక్బాల్ అన్నారు. సిటి ఆర్మ్​డ్ పోలీస్ సిబ్బందికి ఏటా జరిగే వార్షిక రిఫ్రెష్ కోర్స్ శిక్షణలో భాగంగా సీనియర్, జూనియర్స్ మొత్తం 350 మంది సిబ్బందికి శుక్రవారం రఘునాథపాలెం మండలం మంచుకొండ పోలీస్ ఫైరింగ్ రేంజ్ లో వెపన్ ప్రాక్టీస్ చేయించారు. పోలీస్ కమిషనర్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ప్రతిభచూపిన వారిని కమిషనర్​ అభినందించారు. కార్యక్రమంలో […]

Read More

కృష్ణానీటిని తరలిస్తే ఖమ్మం ఎడారే

సారథి న్యూస్​, ఖమ్మం: కృష్ణానది నీటిని అక్రమంగా తరలించుకుపోయేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోనం. 203 అమలైతే.. దక్షిణ తెలంగాణతో పాటు ఖమ్మం జిల్లాకు సాగునీరు అందక ఎడారిగా మారడం ఖాయమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన సంగమేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి శుక్రవారం ఆయన ఖమ్మం జిల్లా గోళ్లపాడులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండితేనే నాగార్జునసాగర్ కు నీళ్లు వస్తాయన్నారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా […]

Read More

ఘనంగా అవతరణ దినోత్సవం

సారథి న్యూస్​, ఖమ్మం: ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్ పరేడ్ మైదానంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జెండాను ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పోలీసుశాఖ,జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అంక్షల అమలులో ప్రతిఒక్కరూ అహర్నిశలు కష్టపడి పనిచేశారని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్​లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ ఆఫీసులోఅడిషనల్ డీసీపీ ఇంజరాపు పూజ […]

Read More

ట్రాఫిక్​ సమస్యకు ఇక చెక్​

సారథి న్యూస్​, ఖమ్మం: ఖమ్మం పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. నాగార్జున సిమెంట్ సంస్థ వారు అందజేసిన బారికేడ్లను గురువారం ఆయన ప్రారంభించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు వీటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా అండ్​ ఆర్డర్ మురళీధర్, ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్, రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి, సీఐలు చిట్టిబాబు, కరుణాకర్, శ్రీధర్, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

Read More

పోలీసు సిబ్బందికి ‘థర్మల్‌ స్క్రీనింగ్‌’

సారథి న్యూస్​, ఖమ్మం: కరోనా వ్యాధి వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా వైద్యుల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి థర్మల్‌ స్క్రీనింగ్ పరీక్షలను మంగళవారం ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించారు. లాక్‌ డౌన్‌ విధి నిర్వహణలో ఉంటున్న పోలీసు సిబ్బందికి ముందస్తు నియంత్రణ చర్యలలో భాగంగా థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు ఖమ్మం రూరల్ ఏసీపీ వెంకట్​రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్, స్పెషల్ బ్రాంచ్ […]

Read More

హోంగార్డులకు మాస్క్​లు పంపిణీ

సారథి న్యూస్​, ఖమ్మం: ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు ఆదివారం ఏఆర్ అడిషనల్ డీసీపీ మాధవరావు పర్యవేక్షణలో హోంగార్డు ఆఫీసర్స్ యూనిట్ ఆఫీసులో హోంగార్డులకు శానిటైజర్స్​, మాస్క్​లను ఆర్​ఐ సాంబశివరావు నుంచి పంపిణీ చేశారు. విధుల నిర్వహణలో ఉండే హోంగార్డ్స్​ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏఆర్ ఎస్సై కృష్ణారావు,హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, పుల్లయ్య, హోంగార్డ్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుధాకర్, సెక్రటరీ మహమ్మద్ రఫీ, జాయింట్ సెక్రటరీ బంక శీను, నీరజ, వెంకటేశ్వర్లు, […]

Read More