Breaking News

KADAPA

జేసీ ప్రభాకర్​రెడ్డి మళ్లీ అరెస్ట్​

జేసీ ప్రభాకర్​రెడ్డి మళ్లీ అరెస్ట్​?

అనంతపురం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్​రెడ్డి మళ్లీ అరెస్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్రమ వాహనాల కేసులో ఆయన కొంతకాలం క్రితం అరెస్టయిన జేసీ.. కోర్టు బెయిల్​ ఇవ్వడంతో గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా కడప సెంట్రల్​ జైలు వద్ద జేసీ అనుచరులు రెచ్చిపోయారు. కోవిడ్​ నిబంధనలను ఉల్లంఘించి భారీగా జైలు వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఓ సీఐ దేవేంద్రపై జేసీ ప్రభాకర్​రెడ్డి దురుసుగా ప్రవర్తించాడు. […]

Read More
జేసీ ప్రబాకర్​ రెడ్డికి బెయిల్​

జేసీ ప్రభాకర్​రెడ్డికి బెయిల్​

సారథి న్యూస్​, అనంతపురం : జేసీ దివాకర్​రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జేపీ ప్రభాకర్​రెడ్డి బుధవారం బెయిల్​పై విడుదలయ్యారు. బీఎస్​3 వాహనాలను బీఎస్​4 మార్చి రిజిస్టర్​ చేయించారనే ఆరోపణలతో జేసీని, ఆయన కుమారుడు అస్మిత్​రెడ్డిని పోలీసులు అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ ప్రస్తుతం కడప జిల్లా జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్నారు. బెయిల్​ రావడంతో వీరిద్దరూ జైలు నుంచి విడుదలయ్యారు. జేసీ ట్రావెల్స్ మాజీ ఉద్యోగులు నాగేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో […]

Read More
కడప- బెంగళూరు బస్సులకు బ్రేక్​

కడప- బెంగళూరు బస్సులకు బ్రేక్​

కడప: కడప- బెంగళూరు మధ్య ఆదివారం నడిచే బస్సు సర్వీసులు ఇక నుంచి నిలిపివేయాలని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఈనెల 12, 19, 26 తేదీల్లో ఆ రూటులో బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆయా తేదీల్లో రిజర్వేషన్ చేయించుకున్న వారికి నగదు డబ్బులు రిటన్ చేస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కోవిడ్-19 వ్యాప్తి ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఆదివారం బెంగళూరులో పూర్తి లాక్‌డౌన్ ఉన్నందున రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, మిగతా రోజుల్లో […]

Read More
వైఎస్సార్​కు ఘన నివాళి

వైఎస్సార్​కు ఘన నివాళి

సారథి న్యూస్, కడప: దివంగత మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం వైఎస్సార్‌ 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయన తనయుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అంజలి ఘటించారు. కార్యక్రమంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి రెడ్డి, వైఎస్‌ షర్మిల, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌, ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ […]

Read More

ఏపీ డిప్యూటీ సీఎం అంజద్​బాషాకు కరోనా

సారథిన్యూస్​, కడప: ఏపీలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం అంజద్​బాషాకు కరోనా సోకింది. ఆయన గన్ మెన్ కు కూడా కరోనా పాజిటివ్ నమోదైనట్లు సమాచారం. ప్రస్తుతం అంజద్​ బాషా హోంక్వారంటైన్​లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. రేపటి నుంచి 28 రోజుల పాటు డిప్యూటీ సీఎం గృహనిర్బందంలో ఉండనున్నారు. ఆయనకు మరోమారు పరీక్షలు నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, పాత్రికేయులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అంజద్​బాషాకు కరోనా పాజిటివ్​ […]

Read More

కడప జైలుకు జేసీ సోదరుడు

సారథి న్యూస్, అనంతపురం: బీఎస్‌-3 వెహికిల్స్​ను బీఎస్‌-4గా రిజిస్ట్రేషన్‌ చేయించారన్న అభియోగాలపై అరెస్టయిన ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి జేసీ దివాకర్​రెడ్డి సోదరుడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కొడుకు అస్మిత్‌రెడ్డిని పోలీసులు తాజాగా కడప సెంట్రల్​ జైలుకు తరలించారు. అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు ఎస్సైలు, నలుగురు సిబ్బంది శనివారం తెల్లవారుజామున హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్‌లో ప్రభాకర్‌రెడ్డి ఇంటి తలుపు తట్టి వారిపై ఉన్న అభియోగాలను […]

Read More