Breaking News

ICC

ఐసీసీ ఎలైట్ ప్యానెల్​లో నితిన్ మీనన్

ఐసీసీ ఎలైట్ ప్యానెల్​లో నితిన్ మీనన్

దుబాయ్: భారత అంపైర్ నితిన్ మీనన్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అంపైర్ల ఎలైట్ ప్యానెల్లో అతను చోటు దక్కించుకున్నాడు. దీంతో అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. 2020–21 సీజన్ కోసం ఐసీసీ ప్రకటించిన జాబితాలో నిగెల్ లాంగ్ (ఇంగ్లండ్) స్థానంలో నితిన్​కు చోటు కల్పించారు. 3 టెస్టు, 24 వన్డేలు, 16 టీ20ల్లో అంపైరింగ్ నిర్వహించిన 36 ఏళ్ల నితిన్.. ఇండియా తరఫున ఎలైట్ ప్యానెల్లో చోటు సంపాదించిన మూడో వ్యక్తి. గతంలో […]

Read More

నేడు తేలనున్న టీ20 ప్రపంచకప్ భవితవ్యం

న్యూఢిల్లీ: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఉంటుందా? ఉండదా? అన్న అనిశ్చితికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఎఫ్టీపీ షెడ్యూల్, కొత్త చైర్మన్, ద్వైపాక్షిక సిరీస్ లపై నేడు ఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. కరోనా పెరిగిపోతుండటంతో ప్రపంచకప్ పై క్రికెట్ ఆస్ర్టేలియా (సీఏ) సుముఖంగా లేకపోవడంతో.. టోర్నీ రద్దు దిశగానే వెళ్తోందని సమాచారం.అయితే ఈ విషయాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని బీసీసీఐ కోరుకుంటోంది. ‘వరల్డ్ కప్ ఉంటుందా? లేదా? అన్నది త్వరగా తేల్చాలి. దీనిపై వేచిచూసే ధోరణి […]

Read More
పిచ్ లను మార్చుకోండి

పిచ్ లను మార్చుకోండి

న్యూఢిల్లీ: కరోనా తర్వాత జరిగే మ్యాచ్ లో ప్లేయింగ్ కండీషన్స్ మారిపోనున్న నేపథ్యంలో.. కొత్త తరహా ప్రయోగాలు చేయాలని ఐసీసీ క్రికెట్ కమిటీ చీఫ్ అనిల్‌ కుంబ్లే అన్నాడు. అందులో భాగంగా బ్యాట్, బంతికి మధ్య సమతూకం వచ్చేలా పిచ్ ను తయారు చేసుకోవాలని సూచించాడు. దీనివల్ల బంతి మెరుపు పెంచేందుకు ఉమ్మి వాడకపోయినా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నాడు. ఉమ్మి వాడకపోవడం తాత్కాలికమే కాబట్టి.. బంతి మెరుపు కోసం మరే ఏ పదార్థాన్ని వాడే అవకాశం లేదన్నాడు. […]

Read More

ఐపీఎల్‌ లో కచ్చితంగా ఆడతా: స్మిత్‌

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే కచ్చితంగా ఐపీఎల్​లో ఆడతానని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అన్నాడు. తమ ప్రభుత్వం అనుమతిస్తే.. భారత్​కు ప్రయాణించేందుకు సిద్ధమేనన్నాడు. ఈ సీజన్​లో స్మిత్ రాజస్థాన్ రాయల్స్​కు కెప్టెన్​గా వ్యవహరించాల్సి ఉంది. ‘ఏ క్రికెటరైనా దేశం తరఫున ప్రపంచకప్ ఆడడం గొప్ప విషయం. ఎందుకంటే పరిమిత ఓవర్లలో క్రికెట్​లో ఇదే అతిపెద్ద ఈవెంట్. అందుకే ప్రతిఒక్కరూ ఆ టోర్నీలో ఆడాలని కోరుకుంటారు. ఇందుకు నేను కూడా అతీతం కాదు. ఒకవేళ […]

Read More

టీ20 వరల్డ్​ కప్​పై కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్​ను వాయిదా వేస్తారని ఊహాగానాలు వచ్చినా.. అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) ఆ దిశగా అడుగులు వేయలేకపోయింది. ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తున్న గవర్నింగ్ బాడీ తమ నిర్ణయాన్ని వచ్చేనెల 10కు వాయిదా వేసింది. అప్పటివరకు పరిస్థితులపై భాగస్వాములతో చర్చించాలని నిర్ణయించింది. ఆ తర్వాతే మెగాఈవెంట్స్​పై తుదినిర్ణయం తీసుకోనుంది. మూడు రోజుల పాటు జరిగిన వీడియో కాన్ఫరెన్స్​లో సుదీర్ఘమైన చర్చలు జరిగినా తమ షెడ్యూల్స్​కు సంబంధించి ఐసీసీ ఎటూ తేల్చుకోలేకపోయింది. […]

Read More

ఎక్స్​ట్రా రివ్యూ.. అందుకోసమే

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ అనిల్ కుంబ్లే న్యూఢిల్లీ: స్థానిక అంపైర్లకు టెస్ట్ మ్యాచ్ అనుభవం లేకపోవడంతోనే అదనంగా మరో రివ్యూను ప్రతిపాదించామని ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ అనిల్ కుంబ్లే వెల్లడించాడు. మ్యాచ్​లో ఎలాంటి తప్పులు జరగొద్దని, ఏ జట్టు నష్టపోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామన్నాడు. ‘క్రికెట్​ను సురక్షితంగా, సజావుగా గాడిలో పెట్టడమే మన ముందున్న లక్ష్యం. మ్యాచ్​లో పారదర్శకత కోసం 20 ఏళ్ల నుంచి తటస్థ అంపైర్లను ఉపయోగిస్తున్నాం. కానీ ఇప్పుడు అంతర్జాతీయ ట్రావెల్ […]

Read More

ఉమ్మి నిషేధం తాత్కాలికమే

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ అనిల్ కుంబ్లే న్యూఢిల్లీ: క్రికెట్ బంతిపై మెరుపు పెంచడానికి ఉమ్మి వాడొద్దని పెట్టిన అంక్షలు తాత్కాలికమేనని ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ అనిల్ కుంబ్లే అన్నాడు. కరోనా అదుపులోకి వచ్చిన తర్వాత ఈ అంక్షలు తొలిగిస్తామన్నాడు. అప్పుడు సాధారణ పరిస్థితుల్లోనే మ్యాచ్లు జరుగుతాయని స్పష్టం చేశాడు. ‘క్రికెట్​కు హాని కలిగించే చాలా అంశాలను చాలాసార్లు దూరంపెట్టాం. ఇలాంటి విషయాల్లో కఠినంగా కూడా వ్యవహరించాం. ఇప్పుడు కూడా అంతే. సాధారణ పరిస్థితులు వచ్చాకా […]

Read More

బీసీసీఐ x ఐసీసీ

–పన్ను మినహాయింపుపై వైరం ముంబై: బీసీసీఐ, ఐసీసీ మధ్య ఎన్నాళ్లుగా ఉంటున్న వైరం మరోసారి రాజుకుంది. భారత్ ఆతిథ్యమిచ్చే 2021 టీ20 ప్రపంచకప్, 2023 వన్డే వరల్డ్​ కప్​కు సంబంధించి పన్ను మినహాయింపు విషయంలో రెండు బోర్డుల మధ్య జరుగుతున్న గొడవ మరింత ముదిరింది. పన్ను మినహాయింపుకు సంబంధించి గ్యారెంటీ లెటర్ ఇవ్వాలని చాలా రోజులుగా ఐసీసీ.. బీసీసీఐని అడుగుతోంది. దీనికి సంబంధించిన తుది గడువు కూడా ముగియడంతో ఇప్పుడు అంతర్జాతీయ బాడీ రంగంలోకి దిగింది. పన్ను […]

Read More