Breaking News

HYDERABAD

మూడు రోజుల పాటు వర్షాలు

మూడు రోజుల పాటు వర్షాలు

సారథి, హైదరాబాద్: మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్​వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వద్ద స్థిరంగా కొనసాగుతుందని సోమవారం వెలువరించిన రిపోర్టులో వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా ద్రోణి మధ్య ట్రోపోస్పీయర్ స్థాయి వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి వైపునకు వంపు తిరిగి ఉండి స్థిరంగా కొనసాగుతోందని, […]

Read More
ఓరి మీ తెలివి ‘‘బంగారం’’ కానూ!

ఓరి మీ తెలివి ‘బంగారం’ కానూ!

బంగారంతో ఏకంగా టీషర్టు మిక్సర్​ గ్రైండర్ లో రెండున్నర కేజీల గోల్డ్ చట్టం నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుపడుతున్న వైనం సారథి, హైదరాబాద్: విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా మన దేశానికి తీసుకురావడానికి కొందరు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. ఒకరు పంటిలో, మరొకరు ఒంటిలో, మరొకరు షూస్​లో అమర్చుకుని తెచ్చిన ఘటనలను చాలా చూశాం.. కానీ వాటికి మించి కొత్త ఎత్తులు వేస్తున్నారు. బంగారాన్ని రవాణా చేయడానికి ఇన్ని మార్గాలు […]

Read More
సీతారాముల కల్యాణం.. రమణీయం

సీతారాముల కల్యాణం.. రమణీయం

సారథి, హైదరాబాద్: సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. బుధవారం శ్రీరామనవమిని పురస్కరించుకుని ఎల్బీ నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని వీరన్నగుట్ట షిర్డీసాయినగర్ కాలనీలోని సీతారామాలయంలో స్వామివారి కల్యాణం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి దంపతులు హాజరై దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సీతారామాలయ కమిటీ అధ్యక్షుడు తిరుమల కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎస్.ఎల్లస్వామి, కోశాధికారి కె.వెంకట్రావు, షిర్డీసాయినగర్ కాలనీ అధ్యక్షుడు కేకే ఎల్ల గౌడ్​, […]

Read More
మాస్క్ లేకుంటే రూ.1000 ఫైన్​

మాస్క్ లేకుంటే రూ.1000 ఫైన్​

హైదరాబాద్​: ప్రతిఒక్కరూ మాస్క్‌ను ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. లేకపోతే రూ.1000 జరిమానా విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిబంధనను శుక్రవారం నుంచి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుంటే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, కోర్టులో హాజరుపర్చాలని సూచించింది. విపత్తు నిర్వహణచట్టంతో పాటుగా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేయాలని పోలీసులను ఆదేశించింది.

Read More
ఎమ్మెల్సీ సంబరాల్లో తుపాకీ కలకలం

ఎమ్మెల్సీ సంబరాల్లో తుపాకీ కలకలం

హైదరాబాద్​: నల్లగొండ, హైదరాబాద్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్​రెడ్డి, సురభి వాణీదేవి ​ఘనవిజయం సాధించారు. టీఆర్ఎస్ ​శ్రేణుల సంబరాల్లో భాగంగా బాణాసంచా కాల్చడంతో తెలంగాణ భవన్ ​కప్పుకు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. ప్రమాదం తప్పింది. శనివారం సాయంత్రం టీఆర్ఎస్ ​నేత ఒకరు తుపాకీతో హల్​చల్​ సృష్టించాడు. ఆ పార్టీలో యూత్​వింగ్ ​లీడర్​ కట్టెల శ్రీనివాస్ ఒక్కసారిగా తుపాకీ తీసి పైకి ఎత్తిపట్టడంతో సమీపంలోని కార్యకర్తలు, నాయకులు హతాశులయ్యారు. వెంటనే తుపాకీని దాచిపెట్టాడు. […]

Read More
కొద్ది గంటల్లో ఎమ్మెల్సీ ఫలితం

కొద్ది గంటల్లో ఎమ్మెల్సీ ఫలితం

హైదరాబాద్​: హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం స్థానం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. అభ్యర్థులు ఎవరూ కూడా మేజిక్ ఫిగర్ దాటకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. నల్లగొండ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి 1,10,840 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 83,290 ఓట్లు, ప్రొఫెసర్ కోదండరాంకు 70,072 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 39,107 ఓట్లు వచ్చాయి. పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై […]

Read More
పాక్ జలసంధిని ఈదేశారు..

పాక్ జలసంధిని ఈదేశారు..

హైదరాబాద్​: హైదరాబాద్‌కు చెందిన జి.శ్యామల(47) అరుదైన రికార్డును నెలకొల్పారు. శ్రీలంక నుంచి ఇండియా మధ్యలో ఉన్న 30 కి.మీ. పాక్ జలసంధిని ఈజీగా ఈదేశారు. ఈ రికార్డు సాధించిన తొలి తెలుగు మహిళగా, ప్రపంచంలోని రెండో మహిళగా గుర్తింపుపొందారు. శుక్రవారం ఉదయం 4.15 గంటలకు శ్రీలంక తీరం నుంచి ప్రారంభమై 13 గంటల 43 నిమిషాల పాటు నిరంతరంగా ఈదుతూ రామేశ్వరంలోని ధనుష్కోడికి చేరుకున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది వద్ద శ్యామల శిక్షణ పొందుతున్నారు. […]

Read More
నిరుద్యోగుల ఆగ్రహంలో కొట్టుకుపోక తప్పదు

నిరుద్యోగుల ఆగ్రహంలో కొట్టుకుపోక తప్పదు

సారథి న్యూస్, హైదరాబాద్: నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులకు ఎన్నో హామీలు ఇచ్చి.. వాటిని నెరవేర్చకుండా ఉన్న ప్రజాప్రతినిధులు, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆగ్రహంలో కొట్టుకపోకతప్పదని మహబూబ్​నగర్, రంగారెడ్డి, హైదరాబాద్​జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ముకురాల శ్రీహరి హెచ్చరించారు. ఆదివారం తెలంగాణ నిరుద్యోగుల ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని చిక్కడపల్లి సెంట్రల్​ లైబ్రరీ, ఆర్సీరెడ్డి స్టడీ సెంటర్, పలు స్టడీ సెంటర్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలువురు గ్రాడ్యుయేట్లను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఈ […]

Read More