Breaking News

HUSNABAD

బీజేపీ డిమాండ్​

దవాఖాన ఎప్పడు కడతరు

సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్​లో 50 పడకల దవాఖానకు ఎప్పడు కడతారని బీజేపీ కౌన్సిలర్​ దొడ్డి శ్రీనివాస్​ ప్రశ్నించారు. గురువారం ఆయన కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​లో మీడియాతో మాట్లాడారు. హుస్నాబాద్​లో 50 పడకల దవాఖాన కడతామని మూడేండ్ల క్రితమే చెప్పినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదన్నారు. ప్రజలు ఏం ఇబ్బంది వచ్చినా దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శంకర్, ప్రభాకర్ రెడ్డి, సంతోష్, విద్యాసాగర్, వేణుగోపాల్ రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Read More

‘ఓపెన్’ పరీక్షలు రద్దుచేయాలి

సారథి న్యూస్, హుస్నాబాద్: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేయాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎంపీపీ గడిపె మల్లేశ్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 70 వేల మంది ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులున్నారని చెప్పారు.

Read More

నిర్వాసితుల కన్నెర్ర

సారథి న్యూస్​, హుస్నాబాద్: పరిహారం చెల్లించలేదని నిర్వాసితులు కన్నెర్ర చేశారు. తమకు పూర్తి పరిహారం చెల్లించేవరకు పనులు చేసుకోనివ్వబోమంటూ అడ్డగించారు. సిద్దిపేట జిల్లా గూడాడిపల్లి వద్ద గౌరవెల్లి ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు వెళ్లిన అధికారులు, కాంట్రాక్టర్లను శుక్రవారం నిర్వాసితులు అడ్డుకున్నారు. ప్రభుత్వం తమకు పునరావాస ప్యాకేజీ డబ్బులు చెల్లించలేదని వారు వాపోయారు. అధికారులు సంతకాలు తీసుకొని సంవత్సరం కావస్తున్నా తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవో జయచంద్రారెడ్డి ఘటనాస్థలికి చేరుకొని పరిహారం చెల్లిస్తామని హామీ […]

Read More

పరిహారం ఇస్తేనే పనులు చేయనిస్తం

సారథి న్యూస్​, హుస్నాబాద్: ‘పరిహారం చెల్లించాకే పనులు చేపట్టండి’ అంటూ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు బుధవారం ప్రాజెక్టు పనులను అడ్డకున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట పనులను చేసేందుకు వచ్చిన కాంట్రాక్టర్లను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న కుటుంబాలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలతో పాటు పునరావాస ప్యాకేజీ పరిహారం అందిస్తామని అధికారులు సంతకాలు చేయించుకొని సంవత్సరం కావస్తున్నా, నేటికి ఒక్క పైసా ఇవ్వలేదని మండిపడ్డారు.

Read More

తల్లిపాలే శ్రేయస్కరం

సారథిన్యూస్​, హుస్నాబాద్: అప్పడే పుట్టిన శిశువుకు తల్లిపాలే శ్రేయస్కరమని డీఎంహెచ్​వో మనోహర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆశకార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈవో భాస్కర్, వైద్యాధికారులు మురళీకృష్ణ, సౌమ్య, శివయ్య, కనకయ్య, శ్రీనివాస్, వినీత్, రామ్మూర్తి, ప్రేమలత, సూపర్ వైజర్లు విజయ, ఎలగొండమ్మ, ఆశకార్యకర్తలు […]

Read More
టీఆర్​ఎస్​ జెండాలు పాతి ధర్నా

అధ్వానంగా రోడ్లు

సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో రోడ్లు ఆధ్వానంగా మారినా అధికారులు, ​ మంత్రులు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో గుంతలుపడ్డ రోడ్లపై వారు టీఆర్​ఎస్​ జెండాలు పాతి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ నేతలు మాట్లాడుతూ.. వాహనదారులకు గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్​ నేతలు అక్క శ్రీనివాస్​, కౌన్సిలర్లు పద్మ, స్వర్ణలత, రాజయ్య, కిష్టస్వామి, రాజు, సది తదితరులు పాల్గొన్నారు. […]

Read More

గుట్కాప్యాకెట్లు పట్టివేత

సారథి, హుస్నాబాద్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్​లో రూ. 6600 విలువైన గుట్కాప్యాకెట్లను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని ఓ ఇంట్లో గుట్కాప్యాకెట్లు నిలువ ఉంచినట్టు పోలీసులకు సమాచారమందింది. దీంతో తనిఖీలు చేసిన అధికారులు గోర్ల శ్రీనివాస్​ ఇంట్లో అంబర్​ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ కు సహాకరించిన బొయిని వేణుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read More
యంత్రాలు.. ఎండకు, వానకు

యంత్రాలు.. ఎండకు, వానకు

సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రభుత్వం కొనుగోలు చేసిన యంత్రాలను అధికారులు నిరుపయోగంగా పడేశారని కాంగ్రెస్​ నేత అక్కు శ్రీనివాస్​ ఆరోపించారు. ఆదివారం ఆయన కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​లో మీడియాతో మాట్లాడుతూ.. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు పనుల్లోని మోటర్లకు ఉపయోగించేందుకు స్విచ్చింగ్ యంత్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయగా వాటిని అధికారులు హుస్నాబాద్​లోని నివాసప్రాంతాల్లో ఉంచారని ఆరోపించారు. వాటిని వెంటనే వినియోగించాలని.. లేదంటే కంపెనీలకు వాపస్​ ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై ఇప్పటికే వినతిపత్రం ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని […]

Read More