Breaking News

HUSNABAD

మేమున్నామని..

మేమున్నామని..

సారథి న్యూస్, హుస్నాబాద్: మృతుడి కుటుంబానికి వాట్సాప్ గ్రూపు సభ్యులు మేమున్నామని చేయూతనిచ్చారు. ఈ సందర్భంగా గ్రూప్ అడ్మిన్ దామెర మల్లేశం మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన బొందుగుల వెంకటయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. సోషల్ మీడియాలో ఒక్కటైన గ్రూప్ సభ్యులు తలకొంత డబ్బులు వేసుకుని 50కిలోల బియ్యాన్ని అందజేశారు. కార్యక్రమంలో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ మల్లేశం, గ్రూప్ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.

Read More
నాలాలను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోండి

నాలాలను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోండి

సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ అన్నారు. ఈ సందర్బంగా శనివారం ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు చేర్యాల పట్టణంలోని రోడ్లన్నీ నీటితో నిండిపోయాయన్నారు. రహదారి వెంట అక్రమార్కులు నాలాలను కబ్జా చేయడం ద్వారా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందన్నారు. మున్సిపల్ అధికారులు, పాలకమండలి సభ్యులు నాలాలను క్లీన్ చేయడం, కబ్జాలకు గురైన స్థలాలను […]

Read More
రంగనాయక సాగర్.. భూసేకరణకు సహకరించండి

రంగనాయక సాగర్.. భూసేకరణకు సహకరించండి

సారథి న్యూస్, హుస్నాబాద్: రంగనాయక్ సాగర్ కెనాల్ భూసేకరణపై ఆర్డీవో జయచంద్రారెడ్డి రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందులపూర్ గ్రామంలో నిర్మించిన రంగనాయక్ సాగర్ జలాశయం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి పంటలకు సాగునీరు విడుదల కానుందన్నారు. కెనాల్ ద్వారా కొహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోని రైతుల భూముల గుండా పోతుందన్నారు. కెనాల్ కు రైతులు భూములు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతం పంటపొలాలతో […]

Read More
అక్కన్నపేట బీజేవైఎం అధ్యక్షుడిగా కార్తీక్

అక్కన్నపేట బీజేవైఎం అధ్యక్షుడిగా కార్తీక్

సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) మండలాధ్యక్షుడిగా కొయ్యడ కార్తీక్ ఎన్నికయ్యారు. తనపై నమ్మకంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి పదవి బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్క్షతలు తెలిపారు. కార్తీక్ ఎన్నిక పట్ల హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జ్​ చాడ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి విజయ్ పాల్ రెడ్డి, అక్కన్నపేట మండలాధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి, బీజేపీ సీనియర్ […]

Read More
ఫిర్యాదులో మూడో వ్యక్తి జోక్యం వద్దు

ఫిర్యాదులో మూడో వ్యక్తి జోక్యం వద్దు

సారథి న్యూస్, హుస్నాబాద్: భూతగాదాల్లో ఫిర్యాదు, ప్రతివాది తప్ప మూడో వ్యక్తిపై జోక్యం చేసుకుంటే ఆ వ్యక్తిపై పీడీయాక్డు కేసు నమోదు చేసి జైలుకు పంపించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ ఆదేశించారు. సోమవారం హుస్నాబాద్ సబ్ డివిజన్ పోలీస్ ఉన్నతాధికారుతో చేర్యాల సర్కిల్ ఆఫీసులో పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కొహెడ, మద్దూర్, చేర్యాల, కొమురవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసి […]

Read More
నిషేధిత గుట్కాల పట్టివేత

నిషేధిత గుట్కాల పట్టివేత

సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్లు బెజ్జంకి ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. మండల కేంద్రంలో పొగాకు, గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పట్టణంలోని పలు కిరాణా షాపుల్లో పోలీస్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించగా రూ.42,800 విలువైన అంబర్, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ప్రభుత్వం నిషేధించిన పొగాకు గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న ఏ.సంతోష్, ఎం.రమేష్, డి.నాగరాజు, ఎండీ మసూద్ హైమద్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Read More
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

సారథి న్యూస్, హుస్నాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవంలో భాగంగా గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ, స్థానిక ఆర్డీవో కార్యాలయల్లో బీజేపీ నాయకులు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అధికారంలో ఉండి కూడా తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీకి భయపడుతూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ […]

Read More

సైకో భర్త నీచపు కోరికలు.. భార్య ఆత్మహత్య

పుణే: సైకో భర్త నీచమైన లైంగికకోరికలు తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. మద్యం, డ్రగ్స్​కు బానిసైన ఈ నీచుడు ఫోర్న్​ సినిమా తరహాలో సెక్స్​ కావాలంటూ భార్యను వేధించేవాడు. ఆమెను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేసేవాడు. దీంతో శాడిస్ట్​ మొగుడి టార్చర్​ తట్టుకోలేక.. పుట్టింటికి వచ్చిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు.. మహారాష్ట్రలోని పూణెకు చెందిన రతన్ లాల్​కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న కూతురును 2019లో లండన్​లో ఉద్యోగం చేస్తున్న […]

Read More