సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రమాదవశాత్తు మృతిచెందిన ఓ వ్యక్తి కుటుంబానికి చౌటపల్లి గ్రామఅభివృద్ధి కమిటీ రూ.5000 ఆర్థికసాయం అందించింది. కరీంనగర్ జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన గుడిపాటి రాజయ్య హఠాత్తుగా మృతిచెందడంతో అతడి కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. దీంతో శనివారం సర్పంచ్ గద్దల రమేశ్ బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పోశెట్టి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఐలయ్య, వెంకటయ్య, మల్లేశం, రమేష్, త్రిమూర్తి, శంకర్, సురేందర్, రాజ్ కుమార్, బాలయ్య, […]
సారథి న్యూస్, హుస్నాబాద్: పేదల కోసం పంపిణీ చేయాల్సిన 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిలువ ఉంచుకున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక ఎల్లమ్మ బజార్ కాలనీలో గౌరిశెట్టి నర్సయ్య అనే వ్యక్తి తన ఇంట్లో రేషన్‌బియ్యం నిలువచేశాడు. సమాచారమందుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులతో కలిసి నర్సయ్య ఇంట్లో తనిఖీ చేసి బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై […]
సారథి న్యూస్, హుస్నాబాద్ : అధిక విద్యుత్ బిల్లులతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లా కోహెడ, బెజ్జంకి మండల విద్యుత్ శాఖ ఏడీ మాణిక్య లింగానికి వినతి పత్రాన్ని అందజేసి మాట్లాడారు. పేద ప్రజలు నిత్యావసర వస్తువులు కొనేందుకు డబ్బులు లేక సతమతమవుతుంటే విద్యుత్ బిల్లులు రూ.1000కి పైగా వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ […]
సారథి న్యూస్, హుస్నాబాద్: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ సూచించారు. గురువారం పట్టణంలోని ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటుచేసిన సర్వసభ్య ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు గ్రామాల్లో మిషన్ భగీరథతో పాటు పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయని వాటిని వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ రాజారెడ్డి, ఎంపీపీ మానస, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఇంచార్జ్ ఎంపీడీవో […]
సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ పాలనలో దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని బీజేపీ అక్కన్నపేట మండల అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా అక్కన్నపేట మండలంలో ఆయన మోదీ ఏడాది పాలనపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించేందుకు కేంద్రప్రభుత్వం ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. 70 ఏళ్లుగా పరిష్కారం కాని ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ ప్రజలకు విముక్తి కల్పించిన గొప్ప […]
సారథి న్యూస్, హుస్నాబాద్: సంక్షేమంలో రాష్ట్ర రైతాంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కోహెడ వ్యవసాయ మార్కెట్ పాలకమండలి ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులు నిర్మించి బీడు భూముల్లో పచ్చని పంటలు పండేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారని కొనియాడారు. రైతుబంధు పథకాన్ని అమలుచేసిన ఘనత టీఆర్ఎస్ కే దక్కిందన్నారు. నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆవుల రాధతో పాటు […]
సారథి న్యూస్, హుస్నాబాద్: ఈత సరదా ఇద్దరి నిండు ప్రాణాలను బలితీసుకుంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో చోటుచేసుకుంది. ఏసీపీ మహేందర్ కథనం.. బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన పొన్నాల అనిల్ (17), మానకొండూరు మండలం రంగంపేటకు చెందిన నంగునూరు కుమార్(18) బంధువుల ఇంటికి వచ్చారు. శనివారం ఉదయం కోహడ మండలం శనిగరం ప్రాజెక్టులో ఈత కొట్టేందుకు వెళ్లి ఊపిరాడక చనిపోయారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: మానవ తప్పిదాలతోనే తరచూ రోడ్డు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ అన్నారు. రోడ్డుపై వెళ్తుంటే ఏమాత్రం ఏమరపాటు మరిచినా ప్రమాదమేనని హెచ్చరించారు. హుస్నాబాద్ డివిజన్ లోని హుస్నాబాద్, కోహెడ, చేర్యాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగిన రోడ్ యాక్సిడెంట్ ప్రదేశాలను బుధవారం ఆయన అధికారుల బృందంతో కలిసి పరిశీలించారు. వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలను పాటించకుండా అతివేగంతో నడపడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. స్పీడ్ లేజర్ గన్ ద్వారా వేగం […]