Breaking News

HARISHRAO

అటు దుబ్బాక.. ఇటు జీహెచ్​ఎంసీ

అటు దుబ్బాక.. ఇటు జీహెచ్​ఎంసీ

తమకు ఎదురులేదనే ధీమాతో టీఆర్​ఎస్​ ‘ట్రబుల్​ షూటర్’ దుబ్బాక బాధ్యతలు తీర్మానాల వ్యూహానికి మరింత పదును ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం డాక్టర్​ రాజశేఖరరెడ్డి హయాం నుంచి నేటి దాకా ఉపఎన్నికల పార్టీగా టీఆర్‌ఎస్‌ తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుంటోంది. ఆయా ఎన్నికల్లో భారీ మెజారిటీలే లక్ష్యంగా పనిచేసుకుంటూ పోవడం దానికి ఆనవాయితీ. అది పార్లమెంట్​ సీటైనా, అసెంబ్లీ స్థానమైనా.. పక్కా ప్లాన్‌ ప్రకారం సమావేశాలు, సభలు నిర్వహించడం ద్వారా ఓటర్లను కొన్ని నెలల ముందే కలవడం, […]

Read More
ప్రజలు కోరింది చేయడమే ధ్యేయం

ప్రజలు కోరింది చేయడమే ధ్యేయం

సారథి న్యూస్, మెదక్: ప్రజలు కోరుకున్న పనులను చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఎంతో కృతనిశ్చయంతో ఉన్నారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు అన్నారు. బుధవారం మెదక్ నియోజకవర్గంలోని నార్సింగి మండలంలో పలు అభివృద్ధి పనులకు మెదక్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, భూపాల్ రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పీఎంజీఎస్​వై కింద దుబ్బాక నియోజకవర్గానికి మంజూరైన రోడ్డును దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి నార్సింగి […]

Read More
జీఎస్టీ పరిహారం కేంద్రమే చెల్లించాలి

జీఎస్టీ పరిహారం కేంద్రమే చెల్లించాలి

సారథి న్యూస్, హైదరాబాద్: జీఎస్టీ పరిహారం కేంద్రమే చెల్లించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు డిమాండ్​చేశారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.5,420 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. జీఎస్టీ పరిహారంలో సెస్ మిగిలితే కేంద్రం కన్సాలిడేట్ ఫండ్ లో జమచేసి వాడుకుంటుందని వివరించారు. గురువారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్నిరాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులు హాజరయ్యారు. బీఆర్కే భవన్ నుంచి మంత్రి టి.హరీశ్​రావు […]

Read More
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

సారథి న్యూస్, మెదక్: రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు అన్నారు. మంగళవారం మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలంలో 146 మందికి, మనోహరాబాద్ మండలంలో 54 మంది కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల సదుపాయాలు ఉన్నాయని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి గర్భిణి ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకోవాలన్నారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే కరోనా పరీక్షలు […]

Read More
రామలింగారెడ్డి మృతి కలిచివేసింది

రామలింగారెడ్డి మృతి కలిచివేసింది

సారథి న్యూస్​, సిద్దిపేట: దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి టి.హరీశ్​రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన లేకుండా ఒక కార్యక్రమంలో పాల్గొనాల్సి వస్తుందని అనుకోలేదని విచారం వ్యక్తంచేశారు. గురువారం దుబ్బాక అసెంబ్లీ నియోజవర్గంలోని దౌల్తాబాద్ వీటీటీ ఫంక్షన్ హాల్ లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు. అంతుకుముందు దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి […]

Read More

బాలు త్వరగా కోలుకోవాలి

సారథిన్యూస్​, హైదరాబాద్​: గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్​రావు ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన గురువారం ట్వీట్​ చేశారు. ఎస్పీ బాలు కరోనాతో చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చికిత్సపొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని యావత్ దేశం ప్రార్థిస్తోంది. అభిమానులతో పాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక, క్రీడా ప్రముఖులు కూడా బాలు ఆరోగ్యం మెరుగుపడాలని […]

Read More

బండరపల్లి చెక్​డ్యాంకు జలకళ

సారథి న్యూస్​, దేవరకద్ర: మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర మండలం గూరకొండ సమీపంలోని బండర్​పల్లి చెక్​డ్యాం అలుగు పారుతోంది. బండర్​పల్లి వంతెనను గతేడాది మంత్రి టి.హరీశ్​రావు చొరవతో చెక్​డ్యాంగా నిర్మించారు. కాగా, కొన్ని రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో పెద్దఎత్తున నీరు చేరి అలుగు పారుతోంది. చెక్ డ్యాం నిండడంతో పరిసర గ్రామల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెక్​డ్యాంకు నిధులు మంజూరు చేసిన మంత్రి టి.హరీశ్​రావు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Read More
మత్స్యకారులను ఆదుకుంటాం

మత్స్యకారులను ఆదుకుంటాం

సారథి న్యూస్, రామాయంపేట: మత్స్యకారులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఎంతో కృషిచేస్తోందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మెదక్​ జిల్లా రామాపంపేట మండలం డీ. ధర్మారంలోని ఊరచెరువులో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 1.76కోట్ల చేపపిల్లలను వదిలారు. మత్స్యకారులు దళారులను నమ్మకుండా చేపలను సొంతంగా మార్కెటింగ్​ చేసుకునేలా అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం గ్రామంలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనంతో పాటు డంప్​యార్డు, వైకుంఠధామాలను […]

Read More