సామాజిక సారథి, హైదరాబాద్: హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు నమ్మబోరని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దేవుని సతీష్ మాదిగ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ నాయకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 12 నుంచి 16వ తేదీ వరకు అలంపూర్ లో జరిగే జోగుళాంబదేవి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆయన కలిసిన వారిలో దేవాదాయశాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్, ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ రవిప్రకాశ్ గౌడ్ తదితరులు ఉన్నారు.
సారథి న్యూస్, అచ్చంపేట: తరాల భూముల తగవులకు ముగింపు పలికేలా, కొత్త తరాలకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా కొత్త చట్టం ఉందని, తెలంగాణ రైతుల కష్టాలు తీర్చడమే ధ్యేయంగా సీఎం రెవెన్యూలో భారీ సంస్కరణలకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు శ్రీకారం చుట్టారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కొనియాడారు. నూతన రెవెన్యూ చట్టం అమలు సందర్భంగా.. సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు సంఘీభావం తెలియజేస్తూ శుక్రవారం ఉదయం అచ్చంపేటలో నియోజకవర్గ రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా వ్యవసాయశాఖ మంత్రి […]
సారథి న్యూస్, హైదరాబాద్: ‘గిఫ్ట్ఏ స్మైల్’ పిలుపులో భాగంగా నాగర్ కర్నూల్జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో కొత్త అంబులెన్స్‌ను బహూకరించారు. ఈ అంబులెన్స్ ను మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు చేతులమీదుగా ప్రగతిభవన్ లో శనివారం ప్రారంభించారు. అలాగే గిఫ్ట్ఏ స్మైల్ పిలుపులో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి ఐదు కొత్త అంబులెన్స్‌లను బహూకరించారు. కార్యక్రమంలో మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, జి.జగదీశ్వర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతుసమన్వయ […]
సారథి న్యూస్, అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సోమవారం తన క్యాంపు ఆఫీసులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా పేద దళిత రైతులకు పట్టాపాసు బుక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎల్.శర్మన్, నాగర్ కర్నూల్ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పోకల మనోహర్, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ తులసీరాం, వివిధ గ్రామాల రైతులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఆర్డీవో, […]
సారథి న్యూస్, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళగంగ వద్ద శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టీఎస్ జెన్ కో విద్యుత్ కేంద్రం మొదటి యూనిట్‌లోని ఓ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా గురువారం అర్ధరాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్దం సంభవించి మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. జీరో లెవెల్ నుంచి సర్వీస్ బే వరకు మంటలు వ్యాపించాయి. ఉద్యోగులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. […]
సారథి న్యూస్, అచ్చంపేట: కరోనా విపత్తులోనూ రూ.1,173కోట్లను రైతుబీమా కోసం చెల్లించామని వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుబంధు పథకం ద్వారా 57లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.ఐదువేల చొప్పున అందించామన్నారు. గురువారం అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి నియామకం, అభినందన సభ నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. పంటల నమోదును రాష్ట్రంలో శాస్త్రీయంగా అమలు […]
సారథి న్యూస్, అచ్చంపేట: కరోనా వైరస్ విజృంభించకుండా కట్టడి చేయడంతో పాటు ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించి ప్రజలకు వివరించాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు నియోజకవర్గ ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు. ఆదివారం ఆయన హైదరాబాద్ నుంచి జూమ్‌యాప్ లో ఉప్పునుంతల ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీడీవో, ఎస్సై, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడారు. కరోనా కాలంలో అభివృద్ధి పనులు ఆలస్యం కాకుండా చూడాలని కోరారు.