సామాజిక సారధి తిమ్మాజిపేట: గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న గిద్ద రమ్య అగర్వాల్ విద్యార్థికి ఫైన్ ఆర్ట్స్లోసీటు దక్కించుకుంది. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం మరికల్ గ్రామానికి చెందిన విద్యార్థి, రమ్య సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల గోపాల్పేట స్కూల్లో 5వ తరగతి పూర్తి చేసి ఆరో తరగతి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయగా సెలెక్ట్ అయింది. ఫైన్ ఆర్ట్స్ స్కూల్ మేడ్చల్ మల్కాజ్గిరి లొ జాయిన్ చేసినట్లు గిద్ద విజయ్ […]
వర్మకు జరిమాన విధించిన తెలంగాణ ప్రభుత్వం
సారథిన్యూస్, కొత్తగూడెం: కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటించని ఓ హోటల్‌కు భారీ జరిమాన విధించిన ఘటన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. సోమవారం ఉదయం కలెక్టర్ ఎంవీ రెడ్డి జిలా కేంద్రంలోని హోటళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో ‘గుడ్‌మార్నింగ్’ అనే హోటల్లో సిబ్బంది కనీసం మాస్కులు కూడా ధరించకుండా తినుబండారాలు సప్లై చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తంచేసిన కలెక్టర్ హోటల్ యజమానికి రూ. 25వేలు జరిమానా విధించారు. నిబంధనలు పాటించకపోతే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
సారథిన్యూస్, మహబూబాబాద్: ప్రజలు మాస్కులు ధరించకపోతే జరిమానా తప్పదని మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి సూచించారు. కరోనాను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 51 (బీ) చట్టాన్ని అనుసరించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు గుంపులుగా తిరిగినా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని ముఖ్యమైన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, వ్యాపార సముదాయల్లో ఎప్పటికప్పడు తనిఖీ చేస్తామని.. మాస్క్ లేకుండా ఎవరైనా కనిపిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.