సామాజిక సారథి, హుజూరాబాద్: రాష్ట్రమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 10వ రౌండ్లో బీజేపీ 506 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్‌ముగిసే సరికి 5,637 ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఉన్నారు. ఇప్పటివరకు 13 రౌండ్లు పూర్తయ్యాయి. 11వ రౌండ్లో బీజేపీ 3,941(48,588), టీఆర్ఎస్ 4,308 (43324) ఓట్లు సాధించింది. ఇక 13వ రౌండ్లో టీఆర్ఎస్ 2,971(49,945), బీజేపీ 4,836 (58,333 ) ఓట్లు సాధించింది. ఇప్పటివరకు బీజేపీ […]
సామాజిక సారథి, నల్లగొండ: హుజురాబాద్ ఫలితాలు ఉత్కంఠ లేపుతున్నాయి. రిజల్టుపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. ‘ఈటల రాజేందర్ 30వేల మెజార్టీతో గెలవబోతున్నాడు. హుజురాబాద్ ఉపఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ రూ.ఐదువేల కోట్లు ఖర్చు చేసింది. హుజురాబాద్ ఫలితాలు ఆ పార్టీకి చెంపపెట్టు. హుజురాబాద్ ప్రజలు అదిరిపోయే తీర్పు ఇవ్వబోతున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టలు ఈటల రాజేందర్ గెలుపును చూడకతప్పదు.’ అని వ్యాఖ్యానించారు.
సామాజిక సారథి, హుజూరాబాద్: రాష్ట్రమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందిరా నగర్ పోలింగ్ సెంటర్ ను కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్ పరిశీలించారు. బీజేపీ అభ్యర్థి, మాజీమంత్రి ఈటల రాజేందర్, జమున దంపతులు కమలాపూర్ 262 పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. అనంతరం హుజురాబాద్ మండలం కందుగుల జడ్పీ హైస్కూలులో […]
సారథి, రామడుగు: మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆ పార్టీ రామడుగు మండల నాయకులు స్థానిక హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈటల త్వరగా కోలుకుని మళ్లీ హుజూరాబాద్ పాదయాత్ర పూర్తిచేయాలని ఆకాంక్షించారు. నాయకులు కట్ట రవీందర్, జేట్టవెని అంజిబాబు, మునిగంటి శ్రీనివాస్, డబులకార్ రాజు, నిరంజన్ ముదిరాజ్, జిట్టవేని రాజు, నీలం దేవకిషన్, ఉత్తేమ్ రాజమల్లు పాల్గొన్నారు.
ముదిరాజ్ సంఘం జిల్లా యువ నాయకుడు హరికృష్ణ సారథి, బిజినేపల్లి: మాజీమంత్రి, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ కు తెలంగాణ ముదిరాజ్ మహాసభ అండగా నిలుస్తుందని సంఘం జిల్లా నాయకులు హరికృష్ణ ముదిరాజ్ తెలిపారు. గురువారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాగర్ కర్నూల్ యువజన విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈటలను కలిశారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ ను కక్ష సాధింపుతో మంత్రివర్గం నుంచి తొలగించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన […]
సారథి, హుజూరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ క్యాంప్ ఆఫీసులో ఆయనకు వ్యతిరేకంగా ముద్రించిన కరపత్రాలు కలకలం సృష్టించాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద ప్రజాఆరోగ్య పరిరక్షణ సంఘం పేరిట గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలు వేసి వెళ్లిపోయారు. ఈటల అక్రమాస్తులపై సీబీఐ విచారణతో పాటు అతని బినామీలైన రంజిత్ రెడ్డి, వెంకట్రాంరెడ్డి ఇళ్లపై ఐటీదాడులు చేయాలని అందులో పేర్కొన్నారు. ఆయన ఎన్నికల్లో పోటీచేసినప్పుడు ఇచ్చిన ఆస్తుల అఫిడవిట్లను పరిశీలించి తప్పుడు లెక్కలు చూపినందుకు […]
నేను నిప్పు లాంటోడిని.. చిల్లరమల్లర వాటికి లొంగను ఆ మీడియాలో తప్పుడు కథనాలు ప్రజల్లో పలుచన చేసే కుట్ర నాపై ఆరోపణలకు ఏ విచారణకైనా సిద్ధమే అంతిమ విజయం ధర్మానిదేనని స్పష్టం మీడియా సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ సారథి, హైదరాబాద్: తనపై వచ్చిన ఆరోపణలను తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఖండించారు. విచారణకు దేనికైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. అవినీతి చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని ప్రకటించారు. చిల్లర మల్లర ఆరోపణలకు […]
సారథి న్యూస్, హైదరాబాద్: ముదిరాజ్ కులస్తుల సమస్యలు పరిష్కరించి, వారి అభ్యున్నతికి కృషిచేస్తానని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోని కోకాపేట్లో ముదిరాజ్కులస్తులకు ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలంలో నిర్మించనున్న భవన నిర్మాణానికి ఆదివారం మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. స్థలం కేటాయించినందుకు సీఎంకు కృతజ్క్షతలు తెలిపారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ముదిరాజ్ కులస్తులు లేని ఊరు, చేప తిననివారు లేరని వివరించారు. […]