న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడా? టీమిండియాలో అతను మళ్లీ కనిపించనున్నాడా? ఈ అంశంపై కొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జులై చివరిలో టీమిండియా కోసం బీసీసీఐ శిక్షణ శిబిరాన్ని నిర్వహించనుంది. అందులో ధోనీని ఎంపిక చేయాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోనున్నారు. గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత మహీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. దీంతో అతని పేరును సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా తప్పించారు. అయినా కూడా […]
మెల్బోర్న్: ప్రపంచ క్రికెట్లో మాజీ సారథి ధోనీ ఓ దిగ్గజమని ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. క్రికెట్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలిసిన ఓ గొప్ప పండితుడని కొనియాడాడు. ‘మహీ దిగ్గజం, మిస్టర్ కూల్. క్రికెట్ కోసమే పుట్టాడు. ఆట అంటే అతనికి పిచ్చి’ అని స్మిత్ వ్యాఖ్యానించాడు. జట్టులో మహీ ఉండడం విరాట్‌కు కొండంత అండని చెప్పాడు. ఇక ఇప్పుడున్న క్రికెటర్లలో రవీంద్ర జడేజా.. అత్యుత్తమ ఫీల్డర్ అని స్మిత్ కితాబిచ్చాడు. యువతరం […]
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ధోని బయోపిక్ ఎంతో పేరుతెచ్చింది. మహేంద్రసింగ్ ధోని పాత్రలో జీవించిన సుశాంత్ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇవాళ సుశాంత్ సేవలను దేశమంతా గుర్తుచేసుకుంటున్నదంటే అందుకు కారణం ధోని చిత్రమేనని చెప్పకతప్పదు. సుశాంత్ తీసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే.. ‘ఎం.ఎస్.ధోని’ ఒకెత్తు. ఈ చిత్రం తెలుగుతోపాటు ఇతర భాషల్లోకీ డబ్ కావడంతో సుశాంత్ టాలెంట్ అందరికీ తెలిసింది. అందుకే అతడి మరణవార్త విన్న మహేష్ బాబు, ఎన్టీయార్, రామ్ చరణ్ వంటి తెలుగు […]
న్యూఢిల్లీ: డీఆర్‌ఎస్‌లను అంచనా వేయడంలో ధోనీని మించినోళ్లు లేరని మాజీ ప్లేయర్ వసీమ్ జాఫర్ అన్నాడు. ఒకవేళ ధోనీ సాయం లేకపోతే రివ్యూల్లో విరాట్ కోహ్లీ విజయవంతం కాలేడన్నాడు. ‘మహీ కీపర్ మాత్రమే కాదు. వికెట్ల వెనక ఉండి బంతిని చాలా నిశితంగా గమనిస్తాడు. బంతి గమనాన్ని అంచనా వేయడంలో చాలా నిష్ణాతుడు. అందుకే డీఆర్ఎస్ విషయంలో అంత కచ్చిమైన నిర్ణయాలు తీసుకుంటాడు. తన అంచనా కరెక్ట్ అని తేలితే ఒక్క క్షణం కూడా ఆలోచించడు. ఈ […]
కలకత్తా: బంతిపై ఉమ్మిని రుద్దకుండా నిషేధం విధించినా.. తాను మాత్రం రివర్స్ స్వింగ్ రాబడతానని టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. కాకపోతే బంతి రంగు మారకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించాడు. ‘ఇందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. చిన్నతనం నుంచి పేసర్లు బంతిపై ఉమ్మి రుద్దేందుకు అలవాటుపడ్డారు. ఇది ఆటలో భాగమైపోయింది. ఒకవేళ నీవు ఫాస్ట్ బౌలర్ కావాలనుకుంటే బంతి రంగు మెరుగపర్చేందుకు ఉమ్మిని రుద్దాల్సిందే. అయితే ఆ బంతి రంగు పోకుండా కాపాడగలిగితే కచ్చితంగా రివర్స్ […]
చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి క్రికెట్ అంటే పిచ్చి అని అతని భార్య సాక్షి వెల్లడించింది. ఆట గురించి ఎప్పుడూ భావోద్వేగంతో ఉంటాడని చెప్పింది. ఎక్కడున్నా సహచరులకు సాయం చేయడానికి ముందుంటాడని పేర్కొంది. ‘క్రికెట్ ఉంటే ధోనీ వేరే విషయాలు పట్టించుకోడు. ఆట అంటే అతనికి అంత ఆసక్తి. ఒకవేళ ఖాళీ దొరికితే వీడియోగేమ్స్ ఆడుతుంటాడు. ఒత్తిడిని ఉపశమనం పొందడానికి అది ఓ మార్గంగా భావిస్తాడు. ఇటీవల విరామం రావడంతో పబ్జీ గేమ్ ఆడుతున్నాడు. […]
న్యూఢిల్లీ: మాజీ సారథి ధోనీ వల్లే తాను అంతర్జాతీయ క్రికెట్లో ఎదిగానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. దాదాపు ఆరు, ఏడు ఏళ్ల పాటు మహీ తనపై దృష్టిపెట్టడంతోనే ఇదంతా సాధ్యమైందన్నాడు. రాత్రికిరాత్రే తాను కెప్టెన్ కాలేదని స్పష్టం చేశాడు. ‘ఓ క్రికెటర్‌గా నాకంటూ ఓ ఆటతీరు ఉంటుంది. కానీ కెప్టెన్‌గా ఎలా? అందుకే ధోనీ నన్ను చాలా కాలం పాటు దగ్గరి నుంచి గమనించాడు. మ్యాచ్‌లో నా బాధ్యతల నిర్వహణ, ఆటతీరును, సహచరులతో ప్రవర్తన.. […]
లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర న్యూఢిల్లీ: 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను అప్పటి లంక కెప్టెన్ కుమార సంగక్కర గుర్తుచేసుకున్నాడు. ముంబైలోని వాంఖడేలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రెండుసార్లు టాస్ వేయాల్సి వచ్చిందని చెప్పాడు. అప్పటి టీమిండియా సారథి ధోనీ వల్లే ఇలా జరిగిందన్నాడు. ‘ఫైనల్ కోసం అభిమానులు పోటెత్తారు. జనంతో వాంఖడే నిండిపోయింది. శ్రీలంకలో మేం ఇలాంటి అనుభవాన్ని ఎప్పుడూ చూడలేదు. మా వాళ్లకు చాలా కొత్తగా అనిపించింది. […]