సారథిన్యూస్, గోదావరిఖని: కేంద్రప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నదని వామపక్ష నాయకులు ఆరోపించారు. గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. కరోనాను అరికట్టడంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య , సీపీఐ (ఎంఎల్ ) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు నరేశ్, వామపక్ష నాయకులు తోకల రమేశ్, మహేశ్వరీ, లావణ్య, ఫైముదా, పీర్ మహ్మద్, మోగిలి, ఎం దుర్గయ్య, […]
సారథి న్యూస్, హుస్నాబాద్: పెంచిన పెట్రోధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా అంతకంతకూ పెరుగుతున్నా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా ప్రజారోగ్యాన్ని గాలికొదిలాయని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ నెల 25న సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళనలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు ఎడ్ల వెంకట్రామిరెడ్డి, సీపీఐ జిల్లా […]
సారథిన్యూస్, గోదావరిఖని: కేంద్రప్రభుత్వం బీద, మధ్య తరగతి ప్రజలను దోచుకొని ధనికులకు పంచిపెడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలివెన శంకర్ పేర్కొన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గోదావరిఖని పట్టణంలో ఓ కారుకు తాళ్లను కట్టి దాన్ని నెట్టుకుంటూ వెళ్లి వినూత్న రీతిలో సీపీఐ శ్రేణులు నిరసన తెలిపాయి. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్ మాట్లాడుతూ.. […]
సారథి న్యూస్, హుస్నాబాద్: గండిపల్లి ప్రాజెక్టును పూర్తి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చిన రాష్ట్ర నీటిపారుదల శాఖ సెక్రటరీ రజత్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్టును రీ డిజైన్ చేసిన తర్వాత పనులు చేపట్టకుండా పూర్తిగా నిలిచిపోయాయన్నారు. ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న భూమి నిర్వాసితులకు నష్ట పరిహారం అందించకుండా జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన యువకులకు ఆర్అండ్ఆర్ […]
సారథి న్యూస్, రామడుగు: లాక్‌డౌన్‌తో పనిలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ప్రస్తుత సమయంలో ప్రభుత్వం విద్యుత్‌బిల్లులను రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సృజన్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం విద్యుత్ సెక్షన్ ఆఫీస్ ఎదుట కార్యకర్తలతోకలిసి ధర్నా చేపట్టారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు గంటే రాజేశం, మచ్చ రమేష్, తదితరులు పాల్గున్నారు.
సారథి న్యూస్, మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలపై ఏర్పడిన ఆరేళ్ల పాలనలో పాలమూరును పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి పరమేశ్ గౌడ్ విమర్శించారు. పార్టీ ఆఫీసులో జాతీయజెండా ఆవిష్కరణ అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానాలు అమలుకాలేదని గుర్తుచేశారు. దక్షిణ తెలంగాణపై ఆయన ప్రేమ లేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు డి.బాలకిషన్, పి.సురేష్, రైతుసంఘం జిల్లా నాయకులు […]
సారథి న్యూస్, హుస్నాబాద్: అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు మరణం సీపీఐకి తీరనిలోటని రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేష్ అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి భూపతిరెడ్డి అమరుల భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. నాగేశ్వరరావు రైతు, కూలీల హక్కుల సాధనకు సమరశీల పోరాటాలు చేశాడని గుర్తుచేశారు. రైతు సంఘం జిల్లా సహయ కార్యదర్శి హన్మిరెడ్డి, రాజారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు వనేశ్, కోమురయ్య, భాస్కర్, సుదర్శనాచారి, లక్ష్మినారాయణ, ఏఐవైఎఫ్ […]
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సారథి న్యూస్, హుస్నాబాద్: గౌరవెల్లి, గండిపల్లి భూ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించి ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన హుస్నాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాల్వ మంజూరై 27 ఏళ్లు గడుస్తున్నా నేటికీ పనులు పూర్తి కాలేదన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును 1.7 నుంచి 8.23 టీఎంసీల […]