:: జితేందర్‌రెడ్డి,సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధిసెల్నం: 90005 66615 వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తెల్లబంగారం రికార్డు ధర పలికింది. ఏకంగా క్వింటాలుకు రూ.10వేలు దాటి ఆల్ టైం రికార్డు స్థాయికి చేరింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఎప్పుడూ లేనంతగా క్వింటాలుకు రూ.10,100కు అమ్ముడుపోయింది. మంచి లాభసాటి ధర రావడంతో పత్తి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి ధర ఆల్ టైమ్ గరిష్టానికి చేరి క్వింటాలుకు […]
సామాజిక సారథి, వరంగల్: వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో మిర్చి ధర మంగళవారం పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రూ.18వేలు పలికిన వండర్ హాట్ మంగళవారం రూ.18500, 341 రకం 17500, తేజ రకం రూ.15400 ఉన్నట్టు అధికారులు తెలిపారు. మార్కెట్లో పత్తికూడా రికార్డు ధర పలికింది. రూ.8715 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. సీజన్ లో పత్తి ధర ఈ విధంగా పలకడం ఇదే మొదటిసారి కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
సారథిన్యూస్, నల్లగొండ : నకిలీ విత్తనాల కేసులో కర్నూలు జిల్లాకు చెందిన కర్నాటి మధుసూదన్‌రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు చండూర్ సీఐ సురేష్ కుమార్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం భారీగా నకిలీ పట్టివిత్తనాలు పట్టుకున్న నల్లగొండ జిల్లా పోలీసులు కేసులో విచారణ పూర్తి చేసి ఎస్పీ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు.. సీఐ సురేష్ కుమార్ శనివారం మధుసూదన్‌రెడ్డిని వరంగల్ కు తరలించారు. నల్లగొండ కలెక్టర్ ఆదేశాల మేరకు […]
సారథి న్యూస్, నర్సాపూర్: అడపాదడపా చినుకులు, అప్పుడప్పుడు భారీవర్షాలు కురవడంతో ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు చేలల్లో కలుపుతీత పనులతో పాటు వరి నాట్లలో నిమగ్నమయ్యారు. నర్సాపూర్మండలంలో భౌగోళిక విస్తీర్ణం 22,496 ఎకరాలు ఉండగా, ఇందులో వ్యవసాయ భూమి 11,576 ఎకరాలు, సాగుకు వీలులేని భూమి 10,920 ఎకరాలు ఉంది. అందులో భాగంగానే సన్న చిన్న కారు రైతులు కౌడిపల్లి లో1700 , కొల్చారంలో 11057మంది ఉన్నారు. గతేడాది వరి 7,426 ఎకరాలు సాగు […]
సారథిన్యూస్, రామాయంపేట: నియంత్రిత పంటసాగులో భాగంగా ఈ ఏడాది పత్తిపంటకు అధికప్రాధాన్యమిస్తున్నామని మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి పరుశురాం నాయక్ పేర్కొన్నారు. గత ఏడాది మొక్కజొన్న సాగుచేసిన పొలాల్లో ఈ ఏడాది పత్తి పంట వేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. శనివారం ఆయన నిజాంపేట మండలకేంద్రంలో పలు విత్తన, ఫెర్టిలైజర్ దుకాణాలను మండల వ్యవసాయాధికారి సతీశ్తోకలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు మొక్కజొన్న పంటకు ప్రత్యామ్నాయంగా పత్తిని వేసుకోవాలని సూచించారు. మరో రెండ్రోజుల్లో నిజాంపేట ఆగ్రోస్ […]
సారథి న్యూస్, నారాయణఖేడ్: ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను కొనడం లేదని మంగళవారం కంగ్టి మండలం దెగుల్ వాడీ గ్రామరైతులు స్థానిక అగ్రికల్చర్ ఆఫీసు ఎదుట ధర్నాచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటామని గొప్పలు చెప్పి, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పి చివరకు చేతికి వచ్చేసరికి కొనడం లేదన్నారు. అనంతరం మార్కెటింగ్‌శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో రైతులు శ్రీనివాస్ యాదవ్, సంగారెడ్డి, మారుతిరెడ్డి, సంజీవ్, గోపాల్ పాల్గొన్నారు.