సారథి, చొప్పదండి: చొప్పదండి మండలానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు రూ.5,41,500 సీఎం సహాయ నిధి చెక్కులను శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషిచేస్తున్నారని కొనియాడారు. గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే ఎవరికీ తెలిసేది కాదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం […]
సారథి ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన బొలిశెట్టి రాజేష్ కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.3.5 లక్షల చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావా వసంత కలిసి గురువారం పంపిణీ చేశారు. అనంతరం జగిత్యాల రూరల్ మండలం చలిగల్ క్లస్టర్ గ్రామ రైతువేదికను ప్రారంభించారు. ఇటీవల మొరపల్లి గ్రామానికి చెందిన రైతు ఎడమల నాగరాజు మరణించగా వారి కుటుంబసభ్యులకు రూ.ఐదులక్షల రైతుబీమా చెక్కును అందజేశారు. అనంతరం […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని కమలాపురం గ్రామానికి చెందిన మంగలి వెంకయ్యకు సీఎం రిలీఫ్ ఫండ్ రూ.రెండు లక్షలు, పెద్దశంకరంపేట గ్రామానికి చెందిన బొగ్గుల నాగమణికి రూ.ఐదులక్షల రైతు బీమా సహాయాన్ని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి, ఎంపీపీ జంగం శ్రీనువాస్, జడ్పీటీసీ విజయ రామరాజు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు, సురేష్ గౌడ్, సర్పంచ్ ల ఫోరమ్ మండలాధ్యక్షుడు కుంట్ల రాములు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వేణుగోపాల్ గౌడ్, […]
సారథి న్యూస్, పస్రా: ములుగు జిల్లా పస్రా గ్రామంలో బుధవారం గండికోట నవీన్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.14వేల చెక్కును టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురహరి భిక్షపతి అందజేశారు. ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి, గ్రామాధ్యక్షుడు చందర్ రాజు, ఎంపీటీసీ వెలిశాల స్వరూప, వార్డు సభ్యులు శ్యాం, పున్నం చందర్, రాజశేఖర్, గజ్జి మల్లికార్జున్, పట్టపు వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చల్మెడ గ్రామంలో ఆదివారం సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు బాల్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. దొంతర బోయిన సత్తయ్యకు రూ.90వేలు, గొల్ల పోచవ్వ కూతురుకు రూ.60వేల చెక్కులను అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహేష్, వార్డ్ సభ్యుడు రవీందర్, గ్రామస్తులు తిర్మలయ్య, శ్రీను, మల్లేశం పాల్గొన్నారు.