Breaking News

CARONA

ప్లాస్మా ఇస్తే ఐదువేలు ప్రోత్సాహం

బెంగళూరు: ప్లాస్మా దానం చేసే కరోనా రోగులకు రూ.5000 ప్రోత్సాహం అందిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కరోనా రోగులకు ప్లాస్మాథెరపీతో ఆశాజన ఫలితాలు వస్తున్న విషయం తెలిసిందే. ప్లాస్మాథెరపీ వైద్యం చేయాలంటే ఇప్పటికే వ్యాధి సోకి నయమైనవారి రక్తంలో నుంచి ప్లాస్మా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కరోనా బాధితులు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. దీంతో ప్లాస్మా ఇచ్చే వారికి రూ.5000 ప్రోత్సాహం ఇస్తామంటూ కర్ణాటక రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిబీ శ్రీరాములు ప్రకటించారు.కరోనా నుంచికోలుకున్న వారు […]

Read More

మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం

షిల్లాంగ్​: కరోనాను కట్టడి చేసేందుకు మేఘాలయ ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటున్నది. జూలై 24 నుంచి 31 వరకు ఆ రాష్ట్ర సరిహద్దులను పూర్తిగా మూసివేయనున్నది. కరోనా కట్టడిలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్​రాడ్​ సంగ్మా బుధవారం మీడియాకు తెలిపారు. అత్యవసర సేవలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతించనున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు మేఘాలయ రాష్ట్రంలో 270 కరోనా కేసులు నమోదయ్యాయి. చిన్నరాష్ట్రమైనప్పటికి అత్యధిక సంఖ్యలో టెస్టులు చేస్తూ.. ఎప్పటికప్పడు కరోనాను కట్టడి చేస్తున్న మేఘాలయను […]

Read More

32 వేల కొత్తకేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తున్నది. కొత్తకేసులు ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో 32 వేల కొత్తకేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ రేంజ్​లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే టెస్టులు సరిగ్గా చేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు భారత్​లో 9,68,876 కేసులు నమోదయ్యాయి. 6,12,814 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటికి 24, 915 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,31,146 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. భారత్​ లాంటి […]

Read More

ఐసోలేషన్​ వార్డులో రేప్​

పాట్నా: కరోనా ఐసోలేషన్​ వార్డులో విధులు నిర్వర్తిస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు దారుణానికి ఒడిగట్టాడు. కరోనా రోగి బాగోగులు చుసుకొనేందుకు వచ్చిన ఓ మైనర్​ బాలికపై లైంగికదాడి చేశాడు. ఈ దారుణ ఘటన పాట్నాలోని ఓ ప్రైవేట్​ దవాఖానలో జూలై 8 న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుడిని బిహార్​​లోని దనాపూర్​కు చెందిన మహేశ్​ కుమార్​(40) గుర్తించారు. మహేశ్ ఆర్మీలో పనిచేసి పదవీవిరమణ పొందాడు. ప్రసుతం అతడు ఓ ప్రైవేట్​ దవాఖానలో సెక్యూరిటీ గార్డుకు పనిచేస్తున్నాడు. మహేశ్​ […]

Read More

తెలంగాణలో 1,597 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో బుధవారం 1,597 కరోనా పాజిటివ్​కేసులు నమోదయ్యాయి. తాజాగా 11 మంది మహమ్మారి బారినపడి మృతిచెందారు. ఇలా రాష్ట్రంలో ఇప్పటివరకు 386 మంది మృత్యువాతపడ్డారు. మొత్తంగా పాజిటివ్​కేసుల సంఖ్య 39,342 కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 2,08,666 మందికి మెడికల్​టెస్టులు చేశారు. జిల్లాల వారీగా.. జీహెచ్ఎంసీ 796, మేడ్చల్​115, సంగారెడ్డి 73, కామారెడ్డి 33, వరంగల్​అర్బన్​44, పెద్దపల్లి 20, మెదక్​18, మహబూబ్ నగర్​21, మంచిర్యాల 26, నల్లగొండ 58, సూర్యాపేట జిల్లాలో 14 చొప్పున […]

Read More
కరోనా చాలెంజ్​ను ఎదుర్కొందాం

కరోనా చాలెంజ్​ను ఎదుర్కొందాం

ఈ పరిస్థితుల్లో నైపుణ్యమే కీలకం వర్చువల్‌ మీటింగ్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మనకు సరికొత్త చాలెంజ్‌లను విసిరిందని, దాన్ని ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. బుధవారం వరల్డ్‌ యూత్‌ స్కిల్‌ డేను పురస్కరించుకుని యువతను ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడారు. నైపుణ్యం అనేది చాలా కీలకమైందని, ఇలాంటి సమయంలోనే యువత తమ స్కిల్స్‌కు పదును పెట్టాలని మోడీ చెప్పారు. ‘మీ స్కిల్స్‌ను నిరూపించుకునేందుకు ఈ రోజును అంకితమిచ్చారు. కొత్త కొత్త […]

Read More

ఐసోలేషన్‌లో ఉండలేకపోతున్నా

బ్రెజిల్‌: ఎప్పుడూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ.. జనం మధ్య ఉండే వారిని ఒక్కసారిగా ఐసోలేషన్‌ అంటూ బంధిస్తే ఉండటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సెనారో కూడా అదే ఫీల్‌ అవుతున్నాడంట. ఎప్పుడూ జనంలో ఉంటూ.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే ఆయనకు ఐసోలేషన్‌లో ఉండాలంటే చిరాకుగా అనిపిస్తోంది అంట. దీంతో సోమవారం మరోసారి కరోనా టెస్టు చేయించుకోవాలని నిర్ణయించుకున్నానని ఆయన ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నేను ఐసోలేషన్‌లో ఉండలేకపోతున్నాను. మరోసారి పరీక్షలు చేయించుకుంటాను. […]

Read More

పెండ్లికి 20మందికే అనుమతి

భోపాల్​: కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రదేశ్​ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో పెండ్లి వేడుకలకు కేవలం 20 మంది మాత్రమే హాజరకావాలని ఆదేశాలు జారీచేసింది. ఇంట్లో జరిగే పుట్టినరోజు తదితర వేడుకలకు 10 మంది మాత్రమే హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ ఆదేశాలను ఎవరు ఉల్లంఘించినా కఠినచర్యలు తీసుకుంటుమాని పేర్కొన్నది. రాష్ట్రంలో ఎటువంటి మతపరమైన కార్యక్రమాలు చేయకూడదని.. బహిరంగ ప్రదేశాల్లో 5 కంటే ఎక్కువమంది ఓకే చోట గుమికూడదని పేర్కొన్నది. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుతతరుణంలో […]

Read More