Breaking News

CARONA

పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య

15 లక్షలు దాటిన కరోనా కేసులు

ఢిల్లీ: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15,31,669 మంది కరోనా బారినపడ్డారు. కేవలం గత 24 గంటల్లోనే 48,513 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 5,09,447 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. 34,193 మంది కరోనాతో మృతిచెందారు. 9,88,028 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రజలంతా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. త్వరలో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

Read More
మధ్యప్రదేశ్​ మంత్రికి కరోనా

మధ్యప్రదేశ్​ మంత్రికి కరోనా

భోపాల్​: మధ్యప్రదేశ్​ మంత్రి తుల్సీ సిలావత్​, అతడి భార్యకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఇటీవలే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివ్​రాజ్​సింగ్​ చౌహాన్​కు కరోనా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తనతో కాంటాక్ట్​ అయిన వాళ్లంతా పరీక్షలు చేయించుకోవాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో మంత్రులందరికీ పరీక్షలు చేయగా తుల్సీ సిలావత్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఆయన ప్రస్తుతం భోపాల్​లోని ఓ ప్రైవేట్​ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మధ్యప్రదేశ్​లోని పలువురు అధికారులు, పోలీస్​ సిబ్బందికి కూడా […]

Read More
పొగరాయుళ్లు జరభద్రం

పొగరాయుళ్లూ.. జర భద్రం

ఢిల్లీ: పొగ తాగేవళ్లకు కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. సిగరేట్లు ద్వారా కరోనాకు వాహకాలుగా పనిచేస్తాయని పేర్కొన్నది. సిగరేట్​ అమ్మే వ్యక్తికి కరోనా ఉంటే.. అవి కొని తాగేవారికి వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే వారు సిగరెట్​ను తమ చేతితో తాకుతారు అనంతరం పెదవులతో కూడా తాకుతారు. దీంతో కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. […]

Read More
కేరళలో పరిస్థితి మొదటికి..

కేరళలో మళ్లీ మొదటికి

త్రివేండ్రమ్​: కేరళలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. కేరళలోనే తొలికేసు నమోదైనప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కరోనా అదుపులోకి వచ్చింది. తాజాగా మరోసారి కరోనా కేసుల సంఖ్య పెరిగింది. మంగళవారం ఒక్కరోజే ఆ రాష్ట్రంలో 1,167 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 20,894 కు చేరుకున్నది. ఇప్పటివరకు 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలేవరూ ఆందోళన చెందవద్దని.. టెస్టుల సంఖ్య పెంచి రోగులకు కచ్చితమైన వైద్యం అందించడం ద్వారా కరోనాను అదుపులోకి తీసుకురావచ్చని ఆయన […]

Read More
ప్లాస్మా దానంతో ప్రాణాలు కాపాడండి

ప్లాస్మా దానంతో ప్రాణాలు కాపాడండి

సారథి న్యూస్, కర్నూలు: ‘కరోనాకు ఎవరు కూడా బయపడొద్దు.. ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుంది’ అని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్​ సుధాకర్ అన్నారు. మంగళవారం జీజీహెచ్ లోని బ్లడ్ బ్యాంక్ లో ప్లాస్మా దానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరానాతో ఎవరూ ఇబ్బందులు పడకూడదని, చావులు ఉండకూడదని, కరోనాతో పోరాడి విజేతలైన వారు ప్లాస్మాను దానం చేయాలని కోరారు. కరోనా పాజిటివ్​వస్తే హోం క్వారంటైన్​లో ఉండి నిరంతరం వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవాలని సూచించారు. […]

Read More
ఇంట్లోనే బక్రీద్​ప్రార్థనలు

ఇంట్లోనే బక్రీద్​ ప్రార్థనలు

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ముస్లింలు ఇంట్లోనే ఉండి ప్రార్థనలు చేసుకోవాలని తెలంగాణ డిప్యూటీ హోం మినిస్టర్​మహమూద్​అలీ సూచించారు. మంగళవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే పండుగను ముస్లిం సోదరులు ప్రత్యేక జాగ్రత్తలతో జరుపుకోవాలని సూచించారు. భౌతిక దూరం పాటించాలని, ప్రతిఒక్కరూ తప్పకుండా మాస్కులు కట్టుకోవాలని, తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. బక్రీద్ ​సందర్భంగా బలిచ్చే పశువుల వ్యర్థాలను తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేశామని […]

Read More
పువ్వాడ అజయ్​కుమార్​

కార్పొరేట్​ దవాఖానకు అన్నం దంపతులు

సారథిన్యూస్​, ఖమ్మం: కరోనా బాధితులకు సాయం చేస్తూ, కరోనా అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్న ప్రముఖ సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాసరావు దంపతులకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కాగా వీరిద్దరూ మద్దులపల్లి కరోనా కేర్​సెంటర్​లో చికిత్సపొందుతున్నారు. అక్కడ వారిని ఎవరూ పట్టించుకోకపోవడం, వైద్యం సరిగ్గా అందకపోవడంతో తమకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి పువ్వాడ అజయ్​ను కోరారు. వెంటనే స్పందించిన మంత్రి వీరిద్దరినీ ప్రత్యేక అంబులెన్స్​లో హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్​లోని మమత […]

Read More

కరోనా కాటేస్తుంది జాగ్రత్త

సారథిన్యూస్​, నల్లగొండ: కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి పేర్కొన్నారు. సన్నిహితులు, స్నేహితులే కదా అని పార్టీలకు వెళితే కరోనా అంటించుకోవడం ఖాయమని పేర్కొన్నారు. విందు, వినోదాలతోనే కరోనా అధికంగా వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. మన చుట్టే ఎంతోమంది కరోనా రోగులు ఉండొచ్చన్నారు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. త్వరలో గ్రామీణప్రాంతాల్లోనూ టెస్టులు చేస్తామాని చెప్పారు. మంగళవారం ఆయన వర్తక, వాణిజ్య సంఘాలతో టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. కరోనా కట్టడి కోసం […]

Read More