Breaking News

CARONA

కరోనాను జయించిన బిగ్​బీ

కరోనాను జయించిన బిగ్​బీ

ముంబై: కరోనా మహమ్మారి నుంచి ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కోలుకున్నారు. ఇటీవల చేసిన కరోనా పరీక్షల్లో బిగ్‌బీ అమితాబ్‌కు కరోనా నెగిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన జులై 11న ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి కుదుటపడడంతో ఆదివారం డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు అమితాబ్ కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. కానీ అభిషేక్‌ మాత్రం ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు.

Read More
కేంద్రమంత్రి అమిత్‌ షాకు కరోనా

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు కరోనా

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ బారిన రాజకీయ ప్రముఖులు పడుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయింది. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అమిత్‌ షా తన ట్విటర్‌ ఖాతాలో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.

Read More
మంత్రిని బలితీసుకున్న కరోనా

కరోనాతో మంత్రి మృతి

లక్నో: కరోనా మహమ్మారి సామాన్యులను, ప్రముఖులను సైతం బలితీసుకుంటున్నది. ఆదివారం ఉత్తర్​ప్రదేశ్​ విద్యాశాఖ మంత్రి కమలా రాణి కరోనాతో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంలో ఆమె సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కరోనాపై పోరులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ ఆమె ముందున్నారు. ఈ క్రమంలోనే జులై 18న అనారోగ్యం పాలైయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి లక్నోలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. […]

Read More
తెలంగాణలో 1,891 కేసులు

తెలంగాణలో 1,891 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం 1,891 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 66,677కు చేరింది. తాజాగా 10 మంది కరోనా వ్యాధిబారినపడి మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 540కు చేరింది. రాష్ట్రంలో 18,547 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఒక్కరోజులో 1088 మంది డిశ్చార్జ్​అయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధితో అత్యధికంగా 517 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. […]

Read More
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి

సారథి న్యూస్, అచ్చంపేట: రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. కోవిడ్ చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆదివారం నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట మండలంలోని బ్రాహ్మణపల్లి, బుడ్డతండా, హాజీపూర్ గ్రామాల సర్పంచ్​లకు వినతిపత్రాలు ఇచ్చారు. లాక్​డౌన్ ​సందర్భంగా వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారులు, విద్యార్థులు, ప్రైవేట్​ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కరోనాకు ఉచితంగా వైద్యచికిత్సలు అందించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ […]

Read More
కరోనా..జాగ్రత్తలు పాటించండి

కరోనా.. జాగ్రత్తలు పాటించండి

సారథి న్యూస్, అచ్చంపేట: కరోనా వైరస్ విజృంభించకుండా కట్టడి చేయడంతో పాటు ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించి ప్రజలకు వివరించాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు నియోజకవర్గ ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు. ఆదివారం ఆయన హైదరాబాద్ ​నుంచి జూమ్​యాప్ లో ఉప్పునుంతల ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీడీవో, ఎస్సై, సర్పంచ్​లు, పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడారు. కరోనా కాలంలో అభివృద్ధి పనులు ఆలస్యం కాకుండా చూడాలని కోరారు.

Read More
కోలుకున్నవారి సంఖ్య పెరుగుతున్నది

ఒకేరోజు 50 వేలమంది డిశ్చార్జ్​

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇది నిజంగా ఉపశమనం కలిగించే వార్తే. కేంద్ర వైద్యశాఖ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. గత 24 గంటల్లో 51,255 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒకే రోజు ఇంతమంది కోలుకోవడం మనదేశంలో ఇదే ప్రథమం. కాగా ఇప్పటివరకు మొత్తం 11,45,629 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 54,735 కొత్తకేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 17,50,723కు చేరుకున్నది. ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన […]

Read More
ఏపీ మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత

ఏపీ మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత

అమరావతి: ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్​నేత పైడికొండల మాణిక్యాలరావు కరోనాతో శనివారం కన్నుమూశారు. ఇటీవల ఆయన తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్ భీమ శంకరరావు(తాతాజీ)తో కలిసి ఒకే కారులో ప్రయాణించారు. శంకరరావుకు కరోనా ప్రబలినట్లు నిర్ధారణ కావడంతో మాణిక్యాలరావు కూడా కరోనా టెస్టు చేయించుకున్నారు. 20 రోజుల పాటు ఏలూరు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకొచ్చారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. తాడేపల్లిగూడెం నుంచి బీజేపీలో సామాన్య కార్యకర్త నుంచి […]

Read More