Breaking News

CARONA

తెలంగాణలో కరోనాతో 99శాతం రికవరీ

తెలంగాణలో 99శాతం కరోనా రికవరీ

సారథి న్యూస్, సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో 99శాతం మంది కరోనా రోగులు రికవరీ అవుతున్నారని మంత్రి కె.తారకరామారావు అన్నారు. అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో కోవిడ్–19 ఐసీయూ సెంటర్, 40 పడకల ఆక్సిజన్ వార్డుతో పాటు కోవిడ్ అంబులెన్స్ ను సోమవారం ఆయన ప్రారంభించారు. పంచాయతీరాజ్ ఈఈ, డీఈఈ ఆఫీసులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా ఆస్పత్రికి సీఎస్ఆర్ పథకం కింద రూ.2.28 కోట్లు […]

Read More
దర్శకుడు తేజకు కరోనా

దర్శకుడు తేజకు కరోనా

తెలుగు సినీ దర్శకుడు తేజకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఇటీవల ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో కరోనా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. క్వారంటైన్​లో ఉండాలని ఆయన సూచించారు. తేజ నెల క్రితం కరోనాపట్ల జాగ్రత్తగా ఉంటాలంటూ ఓ వీడియోను విడుదల చేశాడు. భారతీయుల అటిట్యూడ్​ వల్ల కరోనా కేసుల […]

Read More
కార్తీ చిదంబరానికి కరోనా

కార్తీ చిదంబరానికి కరోనా

చెన్నై: కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తీ చిదంబరానికి కరోనా ప్రబలింది. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్​ చేశారు. ఇటీవల ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నారు. దీంతో ఆయనకు కరోనా నిర్ధారణ అయ్యింది. కాగా ఇటీవల కార్తీ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తనను ఇటీవల కలిసిన వారంతా క్వారంటైన్​లో ఉండాలని, వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు కార్తీ చిదంబరం కుటుంబసభ్యులంతా పరీక్షలు చేయించుకున్నారు.

Read More
కరోనా పేషెంట్​లో ధైర్యం నింపుదాం

కరోనా పేషెంట్​లో ధైర్యం నింపుదాం

భయంతోనే ఎక్కువ మంది చనిపోతున్నారు తెలంగాణ రాష్ట్రమంతా ఒకే వైద్యావిధానం డాక్టర్లతో వైద్యాశాఖ మంత్రి ఈటల వీడియోకాన్ఫరెన్స్​ సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా ట్రీట్​మెంట్​కు సంబంధించి తెలంగాణ రాష్ట్రమంతా ఒకే వైద్యవిధానాన్ని అనురిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్​ స్పష్టంచేశారు. సోమవారం ఆయన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, వైద్యనిపుణులతో వీడియోకాన్ఫరెన్స్ ​నిర్వహించారు. కరోనా వచ్చినవారు జబ్బుతో కంటే భయంతోనే ఎక్కువ మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. పాజిటివ్ నిర్ధారణ అయిన పేషెంట్​లో ధైర్యం నింపాలని పిలుపునిచ్చారు. […]

Read More
551 మరణాలు.. 67వేల కేసులు

551 మరణాలు.. 67వేల కేసులు

ఇదీ తెలంగాణలో కరోనా పరిస్థితి జీహెచ్​ఎంసీ పరిధిలో ఎక్కువ కేసులు సారథి న్యూస్, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొంతమేర తగ్గినట్లే కనిపిస్తోంది. సోమవారం కొత్తగా 983 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 11 మరణాలు సంభవించాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 273, రంగారెడ్డి జిల్లాలో 73 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 67,660కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి 48,609 మంది కోలుకోగా, 18,500 మంది […]

Read More
దేశంలో రెండు కోట్ల కరోనా పరీక్షలు

కరోనా పరీక్షలు @ 2 కోట్లు

ఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు దాదాపు 2 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర వైద్యశాఖ అధికారులు తెలిపారు. టెస్టింగ్​, ట్రేసింగ్​, ట్రీటింగ్​ ద్వారానే కరోనాను అరికట్టవచ్చన్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ సరిగ్గా టెస్టులు చేయడం లేదు. కరోనా రోగుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 18,03,695 కు చేరుకుంది. గత 24 గంటల్లో 52,972 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో దేశవ్యాప్తంగా 38,135 మంది […]

Read More
యడుయూరప్పకు కరోనా

కర్ణాటక సీఎంకు కరోనా

బెంగళూరు: కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ వైరస్​ బారిన పడుతున్నారు. ఆదివారం కేంద్ర మంత్రి అమిత్​షాకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటక సీఎం యడూయురప్పకు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. అయితే ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారంతా హోం క్వారంటైన్​లోకి వెళ్లాలని.. వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు యడూయురప్ప కూతురుకు […]

Read More
ఏపీ డిప్యూటీ స్పీకర్‌కు కరోనా

ఏపీ డిప్యూటీ స్పీకర్‌కు కరోనా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బారిన ప్రముఖులు, రాజకీయ నాయకులు పడుతున్నారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్​కోన రఘుపతికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కోన రఘువతి తెలిపారు.

Read More