Breaking News

CARONA

తెలంగాణలో 1,724 కరోనా కేసులు

తెలంగాణలో 1,724 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 1,724 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి 10 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 729 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 97,424కు చేరింది. ఇప్పటివరకు 75,186 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,509 యాక్టివ్​కేసులు ఉన్నాయి. తాజాగా 1,195 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్​అయ్యారు. జీహెచ్​ఎంసీ పరిధిలో అత్యధికంగా 395 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. భద్రాద్రి […]

Read More

జాగ్రత్తలతో కరోనాను జయిద్దాం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: ప్రజలంతా జాగ్రత్తలు పాటించి కరోనా మహమ్మారిని జయించాలని మెదక్​ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి సూచించారు. కరోనా వచ్చినవారు భయపడాల్సిన అవసరం లేదని.. దేశంలో 70 శాతం మంది వ్యాధి నుంచి కోలుకుంటున్నారని ఆమె భరోసా కల్పించారు. బుధవారం మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలకేంద్రంలో ఆమె పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలు కూడా కరోనా రోగులపై వివక్ష చూపించవద్దని కోరారు. కరోనా వచ్చినంతమాత్రాన వారి కుటుంబాలను […]

Read More

నిజాంపేటలో 31 వరకు లాక్​డౌన్​

సారథి న్యూస్​, రామాయంపేట: కరోనా వైరస్​ తీవ్రరూపం దాల్చుతున్న ప్రస్తుత తరుణంలోనిజాంపేట మండల కేంద్రంలో ఈ నెల 31 వరకు లాక్​డౌన్​ పొడగించాలని గ్రామపంచాయతీ తీర్మానించింది. ఈ సందర్భంగా సర్పంచ్ అనూష మాట్లాడుతూ.. కరోనా వైరస్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లఘించిన వారికి రూ. 5000 జరిమానా విధిస్తున్నట్లు ఆమె తెలిపారు. బుధవారం లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురు షాప్ యజమానులకు జరిమానా విధించినట్టు ఆమె […]

Read More

ఏపీలో కొత్తగా 9,742 కేసులు

సారథిన్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,742కరోనా కేసులు నమోదయ్యాయి. 86 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,16,003 కి చేరింది. మొత్తం 57,685 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 86,725గా ఉంది. ఇప్పటివరకు 2,26,372మంది కరోనా నుంచి కోలుకోగా.. 2,906 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ […]

Read More

కరోనాకు రెడ్డీల్యాబ్స్​ మందు

సారథిన్యూస్​, హైదరాబాద్​: కరోనా మహమ్మారిని తగ్గించేందుకు రెమిడిసివిర్​, ఫావిపిరవర్​ మందులు కొంతమేర ప్రభావవంతంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ఔషధకంపెనీలు ఈ మందులను మార్కెట్లో విక్రయిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఔషధకంపెనీ రెడ్డీ ల్యాబ్స్​కరోనా టాబ్లెట్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. అవిగాన్ బ్రాండ్ పేరుతో ఫావిపిరవిర్ 200 ఎంజీ టాబ్లెట్లను విడుదల చేస్తున్నట్లు బుధవారం డాక్టర్ రెడ్డీస్ బ్రాండెడ్‌ మార్కెట్స్‌ సీఈవో ఎంవీ రమణ తెలిపారు. వ్యాధి తీవ్రంగా లేనివారికి ఈ మందు మెరుగ్గా […]

Read More

తెలంగాణలో 1,763 కొత్త కేసులు

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 1,763 కొత్తకేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పటివరకు 95,700 మంది కరోనా బారిన పడ్డారు. మంగళవారం ఒక్కరోజే 8 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాబారిన పడి 719 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 1789 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 73,991కి చేరుకున్నది. రాష్ట్రంలో 20,990 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. 7,97,470 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు […]

Read More

సింగర్​ సునీతకు కరోనా

కరోనా మహమ్మారి సామాన్యులతోపాటు సెలబ్రిటీలను సైతం పట్టి పీడిస్తోంది. తాజాగా టాలీవుడ్​ సింగర్​ సునీతకు కరోనా పాజిటివ్​ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఓ వీడియోలో వెల్లడించారు. సునీతకు కరోనా సోకినట్టు మంగళవారం ఉదయం నుంచి సోషల్​మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో సునీత స్వయంగా వీడియోను విడుదల చేశారు. తనకు కరోనా వచ్చినమాట వాస్తవమేనని.. అయితే తాను హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకున్నానని.. ప్రస్తుతం కోలుకున్నానని ఆమె చెప్పారు. ప్రముఖ నేపథ్య గాయకుడు […]

Read More
ఏపీలో 3లక్షలు దాటిన కేసులు

ఏపీలో 3లక్షలు దాటిన కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో మంగళవారం 9,652 కరోనా కేసులు నమోదుయ్యాయి. ఇప్పటివరకు మొత్తంగా 3,03,366 పాజిటివ్ కేసుల నిర్ధారణ అయ్యాయి. తాజాగా, వ్యాధిబారిన పడి 88 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తంగా 2,820 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు చికిత్స అనంతరం 2,15,416 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 85,130కు చేరింది. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే అనంతపురం 445, చిత్తూరు 990, ఈస్ట్​ గోదావరి 1396, గుంటూరు 895, కడప 755, […]

Read More